ఇలాంటి చవటలా పాలించేది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇలాంటి చవటలా పాలించేది?

ఇలాంటి చవటలా పాలించేది?

Written By ysrcongress on Wednesday, December 14, 2011 | 12/14/2011

*రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు చెబుతున్నారు
*విద్యార్థుల సెమిస్టర్ పూర్తికావస్తున్నా ఫీజులుచెల్లించరా?
*ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిత మసకబారుతోంది
*చంద్రబాబూ.. నీ హయాంలో పిల్లల చదువుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా?
*ఆ పిల్లల తల్లిదండ్రుల బాధలు చూశావా?
*ఆరు నెలల కిందటే అవిశ్వాసం పెట్టి ఉంటే ఈ సర్కారు బంగాళాఖాతంలో కలిసేది

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అయ్యా.. ముఖ్యమంత్రి..! 2009-10లో మీ పాలన ఉంది.. 2010-11లో నువ్వు ఉన్నావు.. 2011-12లోనూ నీదే పరిపాలన. కనీసం నీ పరిపాలన కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను కట్టాలని నీకు అనిపించడం లేదా? ఒక సెమిస్టర్ పూర్తి చేసుకొని మూడు నెలల్లో మరో సెమిస్టర్‌లోకి అడుగుపెట్టబోతున్న విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేస్తారా? పైగా అసెంబ్లీ సాక్షిగా ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించిన సొమ్ములు చెల్లించామని అబద్ధాలు చెప్తారా? ఈ చేతగాని పాలకులతో విద్యార్థుల భవిష్యత్తు మసకబారుతోంది. ఇలాంటి చవటలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. 

గుంటూరు జిల్లాలో మంగళవారం 41వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన పెదపరిమి గ్రామంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణకు వెళ్తుండగా పరిసర గ్రామాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చి జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘అన్నా... సెమిస్టర్ అయిపోయింది. ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బులు రాలేదు. ‘ఇక ఈ ప్రభుత్వం ఫీజులు కట్టదు.. మీకు ఫీజులు కట్టలేము.. చదివింది చాలు.. కాలేజీ మానండి’ అని అమ్మానాన్నలు బలవంతం చేస్తున్నారు. చదువు మధ్యలో ఆపడం కంటే ఆత్మహత్య చేసుకోవడే మేలన్నా..’’ అని విద్యార్థులు చెప్పడంతో జగన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 

‘‘అమ్మా.. మీ పక్షాన మేం నిలబడతాం.. మీరు ధైర్యంగా చదువుకోండి’’ అని వారికి భరోసానిచ్చారు. ఇదే గ్రామం వేదిక మీద నుంచి మాట్లాడుతూ.. సర్కారు తీరుపై మండిపడ్డారు. తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో 11 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్.. పలుచోట్ల జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని అధ్వాన పరిస్థితి..
దివంగత నేత ఒక స్వప్నాన్ని చూశారు. పేద కుటుంబాలు బాగుపడాలంటే.. ఆ కుటుంబం నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరైనా.. డాక్టరో.. ఇంజనీరో.. లేదంటే కలెక్టర్ లాంటి పెద్ద చదువులు చదవాలని కలలుగన్నారు. కులాలకు.. మతాలకు..రాజకీయాలకు.. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించినప్పుడే అది సాధ్యపడుతుందని ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవానికి ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ చేతగాని ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? త్వరలో ఈ విద్యా సంవత్సరం కూడా పూర్తవుతుంది. విద్యార్థులు ఒక సెమిస్టర్‌ను పూర్తి చేసుకొని మరో సెమిస్టర్‌లోకి అడుగుపెడతారు. ఇవాళ 2011-12 సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి చవటలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అని బాధనిపిస్తుంది.

బాబూ.. నీ తొమ్మిదేళ్లలో ఒక్క రోజైనా కాలేజీలకు వెళ్లావా?
ఇవాళ చంద్రబాబు పిల్లల దగ్గరకు పోతాడు. అవినీతిపై ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్చర్ల మీద లెక్చర్లు దంచుతారు. ఇదే చంద్రబాబునాయుడు గారిని ఒక్కమాట అడుగుతున్నా.. నువ్వు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏ ఒక్క రోజైనా కాలేజీలకు వెళ్లావా? ఏ ఒక్కసారైనా ఆ పిల్లల చదువుల గురించి ఆలోచించావా? పిల్లలను చదివించుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూశావా? పోనీ ఇప్పుడైనా విద్యార్థుల సమస్యలు పడుతున్నాయా? రంగారెడ్డి జిల్లాలో ఫీజులు అందక వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫీజు రీ యింబర్స్‌మెంటు కోసం కళాశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ప్రభుత్వంతో పోరాటం చేశాయి. ఆరునెలల కిందట రోజులకూ ఈ రోజులకు పెద్దగా తేడా లేదు. అప్పుడే నువ్వు అవిశ్వాసం పెట్టి ఉంటే ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి ఉండేది.

చేలను తడిపే నీళ్లలో వైఎస్‌ను చూసుకుంటున్నాం
ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ శాఖమూరుకు వెళ్లగా గ్రామస్తులు ఊరు చివర్లోనే ఆయనను ఆపి.. ‘‘అన్నా ఈ లిప్టు దగ్గర ఒక్క కొబ్బరి కాయ కొట్టివెళ్లన్నా..!’’ అని కోరారు. ‘‘మేం టెయిల్ ఎండ్‌లో ఉన్నాం. మా పొలాకు నీళ్లు పారవు. తుళ్లూరు ఎత్తిపోతలు కట్టి నీళ్లు అందిస్తామని ఎంతో మంది నేతలు మాటిచ్చి మోసం చేశారు. మహానేత మాట తప్పలేదు. తుళ్లూరు ఎత్తిపోతల కట్టి చూపించారు. అయినా మా గ్రామానికి నీళ్లు అందకపోతే.. రూ.14కోట్లతో మాకు లిఫ్టుబావి కట్టించారు. ఇవాళ మా గ్రామానికే కాదు...చుట్టూ ఆరు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. పొలానికి వెళ్లి పచ్చపైరు వైపు చూసినప్పుడు, చేలను తడుపుతున్న ఆ నీళ్లలో మహానేతను చూస్తున్నాం. వైఎస్సార్‌తోనే లిప్టు ఓపెన్ చేయించాలని అనుకున్నాం..! మాట కాదనకన్నా..! ఈ కొబ్బరి కాయ కొట్టన్నా..’’ అంటూ పట్టుబట్టారు. దీంతో జగన్ అక్కడ కొబ్బరికాయ కొట్టి ముందుకు కదిలారు.
Share this article :

0 comments: