ఈడీ నుంచి కొత్త సమాచారం లేదు: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈడీ నుంచి కొత్త సమాచారం లేదు: జగన్

ఈడీ నుంచి కొత్త సమాచారం లేదు: జగన్

Written By news on Monday, December 19, 2011 | 12/19/2011

న్యూఢిల్లీ : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కొత్తగా తమకు ఎలాంటి సమాచారం రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఆస్తుల కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు తనను గాని, తన ప్రతినిధిని గాని హాజరు కావాలన్న విషయం చాలా పాతవార్త అని జగన్‌ తెలిపారు.


శరద్ పవార్ ను కలవనున్న వైఎస్ జగన్:
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఆయన ఇప్పటికే 377 నిబంధన కింద లోక్‌సభలో నోటీసిచ్చారు. ఈ అంశం మంగళవారం సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.



'చిత్రావతి'ని పరిశీలించిన ఎమ్మెల్యే విజయమ్మ:
పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా): చిత్రావతి రిజర్వాయర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ రైతులతో కలిసి పరిశీలించారు. పులివెందుల తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర నీటిని విడుదల చేయాలని ఆమె అధికారులను కోరారు. నీటి విడుదలపై అధికారులు స్పందించడంలేదని రైతులు ఎస్ఇ, ఇడిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రైతులతో ఉన్నారు.



ఎక్సైజ్ మంత్రిని తొలగించాలి: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రిపై ఆరోపణలు వచ్చినందున ఆ పదవి నుంచి ఆయనని తప్పించి, విచారణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మద్యం వ్యాపారలపై దాడులు రాజకీయ గుత్తాధిపత్యం కోసం ముఖ్యమంత్రి అడుతున్న నాటకం అని ఆమె విమర్శించారు. మద్యం సిండికేట్లకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఈ దాడులు జరగడంలేదన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారాలపై తక్షణం సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఎపిపిఎస్ సి గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఆమె కోరారు. అనువాద తప్పిదాల వల్ల అభ్యర్థులు నష్టపోయినట్లు తెలిపారు. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేసి, అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
Share this article :

0 comments: