అనర్హులుగా ప్రకటించండి-ఎన్నికలకు మేం సిద్ధం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనర్హులుగా ప్రకటించండి-ఎన్నికలకు మేం సిద్ధం!

అనర్హులుగా ప్రకటించండి-ఎన్నికలకు మేం సిద్ధం!

Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011

రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసినందుకు తమను అనర్హులుగా ప్రకటిస్తే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో గత మేనెలలో కడప, పులివెందుల తరహా ఫలితాలే వస్తాయని బోస్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఒక వేళ ఉప ఎన్నికల్లో ఓడి పోయినా తమకు ఏమాత్రం చింత లేదనీ ఎప్పటికీ జగన్‌ను వెన్నంటే ఉండాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. తమ శాసనసభా సభ్యత్వం పోతుందని తెలిసినా ఒక సిద్ధాంతానికి, విధానానికీ కట్టుబడి తమ నాయకుడు జగన్ ఆదేశానుసారం ఓటు వేశామని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం, రైతు కూలీల బాగు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు కనుక అందుకు అనుగుణంగానే తమ పార్టీ విధానాల ప్రకారం ఓటేశామని ఆయన అన్నారు. వ్యవసాయ ప్రధానమైన ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోనసీమలో లక్షలాది ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారనీ ఈ పరిస్థితిని తాము చూస్తూ ఊరుకోలేమనీ అందుకే అవిశ్వాసం ఎవరు పెట్టారనేది తాము చూడలేదని ఆయన అన్నారు.

బొత్సది దిగజారుడు రాజకీయం...

దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ అసెంబ్లీలో తన తొలి ప్రసంగం చేస్తే బొత్స ఆమెను విమర్శించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స వ్యాఖ్యలను ఖండించడానికి తాను అసెంబ్లీలో మైక్ అడిగితే ఇవ్వలేదనీ ఆమె అన్నారు. ఆమె స్వతహాగా మాట్లాడిన ప్రసంగాన్ని కూడా ఇంకెవరో చెబితే మాట్లాడారని అనడం ఆయన సంస్కార రాహిత్యం అని కొండా అన్నారు. వై.ఎస్ చనిపోగానే జగన్ ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేయించిందెవరు? మంత్రులందరినీ తన ఇంటికి అల్పాహార విందుకు పిలిచి తామందరితో సంతకాలు చేయించింది బొత్సనే అని ఆమె అన్నారు. ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించింది అప్పటి చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అనీ ఆమె అన్నారు. జగన్ ఎవరితోనైనా ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగారా? కనీసం ఎవరికైనా ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారా? చెప్పాలని ఆమె నిలదీశారు. అంతే కాదు జగన్‌కు మద్దతు కోరుతూ చిరంజీవి వద్దకు వెళ్లిందెవరో కూడా చెప్పాల్సిన బాధ్య కూడా ఆరోపణలు చేస్తున్న వారిపైనే ఉందని ఆమె అన్నారు. జగన్ అధిష్టానవర్గాన్ని అడిగింది ముఖ్యమంత్రి పదవి కాదనీ ఓదార్పు యాత్ర చేయడానికి అనుమతి మాత్రమేనని ఆమె అన్నారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన అవిశ్వాసం చర్చ సందర్భంగా వైఎస్సార్‌నూ, ఆయనను అభిమానించే ఎమ్మెల్యేలను విమర్శించడానికే బాబు ఉపయోగించుకున్నారని ఆమె అన్నారు. తమ ఎమ్మెల్యేలు సభలో ఉన్నంత సేపూ ఒక్కొక్కరి చుట్టూ ఇద్దరేసి మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు చుట్టుముట్టి వారిని తమ వైపు లాక్కునే యత్నం చేశారని ఆమె విమర్శించారు. విప్ ఉల్లంఘించి అనర్హత వేటు పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదన్న ప్రచారాన్ని కూడా అధికార పక్షం నిస్సిగ్గుగా పుకార్లు లేపిందనీ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తాము జోక్యం చేసుకుని తమ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఇలాంటి దిగజారుడు విధానాలు తానెప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత 29 మంది ఉన్న జగన్ శిబిరం బలం ఎందుకు తగ్గింది? అని ప్రశ్నించగా కొందరు ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయి ఉండొచ్చనీ వారికేమి సమస్యలున్నాయో అని ఆమె అన్నారు. స్థానికంగా తమ నియోజకవర్గాల్లో పోలీసు వేధింపులు, ఇతరత్రా ఒత్తిడులు ఉంటాయని కొందరు జంకి ఉండొచ్చనీ అన్నింటినీ ఎదిరించిన వారే తమ వైపు నించున్నారని ఆమె అన్నారు. తమను అనర్హులుగా ప్రకటించడానికి ఇంకా తమకు గడువెందుకు? విప్‌ను ఉల్లంఘించి ఓటేశామని స్పష్టంగా అసెంబ్లీ రికార్డుల్లో ఉందికదా! అనర్హులుగా ప్రకటిస్తే మేమంతా ప్రజల వద్దకు వెళతామని ఆమె అన్నారు. 

జగన్ ఎవరినీ ఒత్తిడి చేయలేదు...

అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటేయమని జగన్ తమనెవ్వరినీ ఒత్తిడి చేయలేదని భూమా శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయమని నేనెవ్వరినీ బలవంతం చేయను...నన్ను కాదని పోయే వాళ్ల మీద కోపం కూడా లేదు, నేనేమీ అనుకోను...’ అని జగన్ ఎమ్మెల్యేలందరికీ చెప్పారనీ ఆమె అన్నారు. అసలు చంద్రబాబుకు అవిశ్వాసతీర్మానంపై చిత్తశుద్ధి అసలు లేదనేది సోమవారం నాటి పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థం అవుతోందని ఆమె అన్నారు. అవిశ్వాసం పెట్టిన నాయకుడు ఇతర పక్షాలతో సమన్వయం చేసుకుంటారని బాబు అలాంటి ప్రయత్నమే చేయలేదని ఆమె అన్నారు. పైగా అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ, తమ ఎమ్మెల్యేలనూ విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఒక దశలో వైఎస్సార్‌ను తీవ్రంగా విమర్శించి తమ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయకుండా పోవాలనే కుట్ర పన్నారని ఆమె అన్నారు. అవిశ్వాసతీర్మానాన్ని చంద్రబాబు తనను తాను పొగుడుకోవడానికీ, వైఎస్‌ను విమర్శించడానికే ఉపయోగించుకున్నారనీ ఆమె అన్నారు. అవిశ్వాసం నెగ్గాలని బాబు దానికి ప్రవేశ పెట్టలేదని ఆమె అన్నారు. 

ఆనందంగా ఉంది - ధర్మాన

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు తమకు ఆనందంగా ఉందని, కడవరకూ తాము జగన్ వెంటే ఉంటామని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. సోమవారం రోజంతా అధికారపక్షం నుంచి రకరకాల ప్రలోభాలు పెట్టారనీ అయినా తామెవ్వరిపైనా ఏమీ పని చేయలేదని ఆయన అన్నారు. ధైర్యశాలి అయిన జగన్‌కు మరింత బలం చేకూర్చాలనే ఉద్దేశ్యంతోనే తాము ఆయన వెంట నిలిచామనీ ధర్మాన అన్నారు. శాసనసభ సభ్యత్వం పోతుందనీ తమకు తెలుసుననీ ఎన్నికలకు సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. తమ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో తప్పకుండా ప్రజా విశ్వాసం చూరగొంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వై.ఎస్ బొమ్మను పెట్టుకుని గెలిచిన వారందరూ ప్రతిపక్షం ఆయనను తిడుతూ ఉంటే మౌనంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతోనే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్, ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియం పథకంలాంటి పథకాలు ప్రజల్ని ఆకర్షించాయన్నారు. వైఎస్‌ఆర్ మృతి తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిదన్నారు.


అవిశ్వాస తీర్మాన పరీక్ష సందర్భంగా అధికారపక్షం తమని ప్రలోభాలకు గురి చేశారంటూ వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యే సుచరిత మీడియాకు వెల్లడించారు. తన భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని.. ఆయనను అండమాన్ దీవులకు ట్రాన్స్‌ఫర్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపింది. కాంగ్రెస్ ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.


ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటామని వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఒకవేళ తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ కిరణ్ సర్కార్ ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 

వైఎస్ ఆశయాలతో ప్రజల్లోకి వెళతామని ఆమె తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కొంతమంది మంత్రులు టార్గెట్ చేసి బెదిరించారన్నారు. సభలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు బాధాకరమని, వైఎస్ మరణించినప్పుడు జగన్ సీఎం కావాలంటూ బొత్సానే సంతకాల సేకరణ చేశారని కొండా సురేఖ గుర్తు చేశారు
Share this article :

0 comments: