రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కనబడడం లేదని సోనియా గాంధీ మాత్రమే కనబడుతున్నారని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కనబడడం లేదని సోనియా గాంధీ మాత్రమే కనబడుతున్నారని

రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కనబడడం లేదని సోనియా గాంధీ మాత్రమే కనబడుతున్నారని

Written By ysrcongress on Monday, December 26, 2011 | 12/26/2011

 ఎస్‌పీ కుంట: రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. గిట్టుబాటు ధరలేక, పెట్టుబడులు కూడా రాక అన్నదాత ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కనబడడం లేదని సోనియా గాంధీ మాత్రమే కనబడుతున్నారని విమర్శించారు. మహానేత వైఎస్సార్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు తనతో చెప్పారని తెలిపారు. 

ఓదార్పుయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్‌పీ కుంట చేరుకున్న జగన్ ఇక్కడ ఏర్పాటు చేసిన మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కిరణ్ సర్కార్ పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. విద్యా సంవత్సరం అయిపోవస్తున్నా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రచ్చబండను రొచ్చుబండగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని జగన్ ఎద్దేవా చేశా


 వెలిగల్లు: వైఎస్సార్ జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం వెలిగల్లు చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వెలిగల్లు ప్రాజెక్టు వద్ద ఆదర్శ రైతులు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి. మోహన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జగన్ వెలిగల్లు రిజర్వాయర్‌ను పరిశీలించారు. రాయచోటి ప్రజలకు మంచినీటి వసతి కల్పిస్తున్న తీరును ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గాలివీడు మండలం వైఎస్సార్ కాలనీలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.



 గాలివీడు: అనర్హత వేటు పడుతుందని తెలిసినా తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ హ్యాట్సాప్ చెప్పారు. ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాయచోటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. భారీ మెజార్టీతో ఆయనను గెలిపించాలని కోరారు. వైఎస్సార్ జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా గాలివీడు చేరుకున్న జగన్ ఇక్కడ ఏర్పాటు చేసిన మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అశేష ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రభుత్వం పడిపోదని తెలిసిన తర్వాతే చంద్రబాబు అవిశ్వాసం ప్రవేశపెట్టారని జగన్ ఆరోపించారు. ఆరు నెలల క్రితమే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టుంటే రైతులకు, విద్యార్థులకు న్యాయం జరిగేదన్నారు. చంద్రబాబుకు రైతులు, పేదలు కనిపించడం లేదని, వైఎస్సార్‌పై ఎలా బురద చల్లాలనే ఆయన ఆలోచిస్తున్నారని అన్నారు. మహానేత చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారన్నారు. రైతు సమస్యలను కిరణ్ సర్కారు గాలికి వదిలేసిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ యూనివర్సిటీకి వీసీని నియమించలేని అధ్వాన పరిస్థితిలో ప్రభుత్వం ఉందని జగన్ దుయ్యబట్టారు.





అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతుల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని వ్యతిరేకించామన్నారు. స్పీకర్ సమక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామని గుర్తు చేశారు. అనర్హత పిటిషన్‌పై జారీ చేసిన నోటీసులకు స్పీకర్‌కు వివరణ ఇచ్చామని వారు తెలిపారు. ఈ రోజు హాజరుకాని ఎమ్మెల్యేలు ఈనెల 29లోగా స్పీకర్‌కు లిఖితపూర్వక వివరణ ఇస్తారని చెప్పారు. రైతుల ఎజెండాతో ఎన్నికలకు వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ రోజు 12 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి తమ వివరణ లేఖలు అందజేశారు.
Share this article :

0 comments: