వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన కుంజా భిక్షం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన కుంజా భిక్షం

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన కుంజా భిక్షం

Written By ysrcongress on Friday, December 30, 2011 | 12/30/2011


ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరుతున్నట్లు భిక్షం ప్రకటించారు. గిరిజనుడైన భిక్షం 1989, 1994లో రెండుసార్లు బూర్గుంపహాడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పరిశీలకుడు గున్నం నాగిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ(మర్రిగూడెం) మాలోత్ తజ్యానాయక్, మాజీ ఎంపీటీసీ బండారు శ్రీనివాస్, పీసీసీ ఎస్.టి విభాగం ప్రధాన కార్యదర్శి పద్మావతీతో పాటు పలువురు జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

3 జిల్లాలకు వైఎస్సార్ సీపీ కొత్త కన్వీనర్లు 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు జిల్లాల్లో పార్టీ అడ్‌హాక్ కమిటీలకు కొత్త కన్వీనర్లను నియమించారు. విశాఖపట్టణం జిల్లా కన్వీనర్‌గా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, విశాఖపట్టణం అర్బన్ కన్వీనర్‌గా వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు చందా లింగయ్య నియమితులయ్యారు. అలాగే పలు జిల్లాలకు కో-ఆర్డినేటర్లుగా యల్లసిరి గోపాల్ రెడ్డి (కడప-కర్నూలు), వై.విశ్వేశ్వరరెడ్డి (అనంతపురం-నెల్లూరు), శివకుమార్ (కరీంనగర్, ఆదిలాబాద్), బండారు మోహన్ రెడ్డి (నల్లగొండ-మహబూబ్‌నగర్), ఆయా జిల్లాలకు పరిశీలకులుగా మేకా శేషుబాబు (నెల్లూరు), బాలమణెమ్మ (నల్లగొండ), గౌతంరెడ్డి (కర్నూలు), రవిరాజ్ (విజయనగరం), వై.వెంకటేశ్వరరావు (విజయవాడ సిటీ), పుల్లా భాస్కర్ (కరీంనగర్)కు బాధ్యతలను అప్పగించారు. యువజన విభాగం అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లుగా ఎ.ఉదయభాస్కర్ (తూ.గో.), జి.శ్రీధర్ రెడ్డి (మెదక్), కావటి మనోహర్ నాయుడు (గుంటూరు జిల్లా), నసీర్ అహ్మద్ (గుంటూరు-అర్బన్) నియమించారు. వనమా బాల వజ్రబాబును 5 జిల్లాల యువజన కోఆర్డినేటర్‌గా నియమించారు.

జగన్‌ను కలిసిన విశ్వబ్రాహ్మణ నాయకులు: విశ్వబ్రాహ్మణ ఐక్య యువ వేదిక రాష్ర్ట అధ్యక్షుడు వెగ్గళం రాము నేతృత్వంలో ఒక బృందం శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ డిమాండ్లకు సంఘీభావం ప్రకటించాలని కోరింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు దానికి ప్రభుత్వం వంద కోట్లు కేటాయించాలనే డిమాండ్‌తో రూపొందించిన ప్రచారభేరి కరపత్రాన్ని వేదిక నాయకులు జగన్‌తో ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొల్లి నిర్మలా కుమారి, గట్టు రామచంద్రరావు పాల్గొన్నారు.

   


‘అదృష్టవంతుడు’ పుస్తకావిష్కరణ

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై శ్రీమతి పి.డి.కృపాకుమారి రచించిన అదృష్టవంతుడు అనే పుస్తకాన్ని జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ‘సేవియర్’ టీవీ ఛానెల్‌నూ, అదే సంస్థ రూపొందించిన ‘మీజగన్‌డాట్‌కామ్’ అనే వెబ్‌సైట్‌నూ జగన్ కంప్యూటర్ ద్వారా ప్రారంభించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రాలతో ఎస్.నారాయణరెడ్డి(కనిగిరి) రూపొందించిన 2012 సంవత్సరపు క్యాలెండర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. శుక్రవారం రోజంతా నాయకులనూ, సందర్శకులనూ కలుసుకున్న జగన్ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. జగన్‌ను కలుసుకున్న వారిలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళి ఉన్నారు.
Share this article :

0 comments: