రెండో విడత ఓదార్పు యాత్ర శుక్రవారంతో పూర్తయింది. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండో విడత ఓదార్పు యాత్ర శుక్రవారంతో పూర్తయింది.

రెండో విడత ఓదార్పు యాత్ర శుక్రవారంతో పూర్తయింది.

Written By ysrcongress on Saturday, December 17, 2011 | 12/17/2011

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత ఓదార్పు యాత్ర శుక్రవారంతో పూర్తయింది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 44 రోజులపాటు 1146.5 కిలోమీటర్లు పర్యటించిన జననేత.. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన 22 మంది అభిమానుల కుటుంబాలను ఓదార్చారు. అలాగే 389 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్టోబర్ 16న మంగళగిరి నియోజకవర్గంలోని సీతానగరంలో ప్రారంభమైన తొలివిడత యాత్ర దీపావళి సందర్భంగా ఒకరోజు విరామంతో నవంబర్ 2న రేపల్లె వరకు సాగింది. తిరిగి నవంబర్ 16న రెండో విడత యాత్ర రేపల్లె నుంచి ప్రారంభమై శుక్రవారం తాడికొండ మండలం సిరిపురంలో ముగిసింది. సర్కారుపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రెండో విడతలో వైఎస్ జగన్ డిసెంబర్ 3 నుంచి 6 వరకు యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. మొత్తం రెండు విడతల షెడ్యూల్‌లో మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు, ప్రత్తిపాడు(ప్రత్తిపాడు మండలం మినహా), తాడికొండ(ఫిరంగిపురం మండలం మినహా) నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర పూర్తయింది.



న్యాయానికీ.. ధర్మానికీ గోరీ: జగన్

కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలసికట్టుగా వైఎస్‌పై కుట్ర చేస్తున్నారు: వైఎస్ జగన్



*కలిసి కోర్టుల దాకా వెళ్లి కోర్టుల్లో కేసులు కూడా వేశారు
*చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట.. బతికున్న చంద్రబాబుకు ఒక న్యాయమట!
* ఇంత దుర్మార్గమైన పరిపాలన చూస్తుంటే బాధనిపిస్తోంది

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: 
‘‘ఇవాళ కాంగ్రెస్ పెద్దలు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై న్యాయానికీ, ధర్మానికీ, రాజకీయ విలువలకూ గోరీ కడుతున్నారు. వైఎస్సార్‌పై బురదజల్లేందుకు కలసికట్టుగా కుట్రలు చేస్తూ పట్టపగలే అధికార దుర్వినియోగం చేస్తున్నారు. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయమట.. బతికున్న చంద్రబాబుగారికి ఒక న్యాయమట.. ఇంత దుర్మార్గమైన పరిపాలనను చూస్తుంటే బాధనిపిస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 44వ రోజు శుక్రవారం ఆయన మేడికొండూరు మండలంలోని మూడు గ్రామాల్లో పర్యటించారు. 12 వైఎస్సార్ విగ్రహాలను(ఒక్క మందపాడులోనే ఆరు) ఆవిష్కరించారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికొన్ని గ్రామాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ ప్రజలు ఆయనతో కరచాలనం చేసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ఎక్కడికక్కడ పోటీ పడటంతో యాత్రలో ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో షెడ్యూల్‌లో ఓ గ్రామ పర్యటన రద్దు చేశారు. అనంతరం జగన్ హైదరాబాద్ బయల్దేరారు. పలు గ్రామాల్లో జగన్ చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

విలవల్లేని రాజకీయం 
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. ఆయన చనిపోయిన తరువాత ఇదే వైఎస్సార్‌ను అప్రతిష్టపాలు చేయడానికని నైతిక విలువలన్నీ పక్కనబెట్టి చివరకు చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కుళ్లుతో కుతంత్రాలు పన్ని కలిసి కోర్టుల దాకా వెళ్లి కేసులు వేశారు. చనిపోయిన వ్యక్తిని అప్రతిష్టపాలు చేయడానికి వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ... ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ఇలాంటి విలువలులేని, విశ్వసనీయతలేని, ధర్మంలేని, న్యాయంలేని రాజకీయాలు చూస్తున్నపుడు బాధనిపిస్తోంది. చాలా చాలా బాధనిపిస్తోంది.

ఆ రోజే నిజమైన స్వాతంత్య్రం 
మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక స్వప్నాన్ని చూశారు. ఆ స్వప్నం పేరు రచ్చబండ. ఎవరికీ చెప్పకుండా ఏ పల్లెకైనా వెళ్లి అక్కడ రచ్చబండ మీద నిలబడి ఆ ఊరి గ్రామస్తులందరినీ ఆయన ఒక మాట అడగాలనుకున్నారు. ‘మీలో అర్హులై ఉండి పెన్షన్, ఇల్లు, బియ్యం కార్డు లేనివారు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందనివారు ఎవరైనా ఉన్నారా?’ అని అడగాలనుకున్నారు. అలా అడిగితే.. ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదని, అలాంటి రోజే నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు అని వైఎస్సార్ నమ్మారు. ఈ పాలకులు పేరుకు మాత్రం అదే రచ్చబండ అని పెట్టారు. అయితే వీరు పల్లెలకు పోరట. కేవలం మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో రచ్చబండలు పెట్టి వాళ్లకు తోచినట్లుగా ఇదిగో తీసుకో అని భిక్షమేసినట్లుగా వేస్తారట. ఇటువంటి పరిస్థితిలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. నా రాష్ట్రం ఇలాంటి పాలకుల చేతిలో ఉందా.. అని చాలా చాలా బాధనిపిస్తోంది.
Share this article :

0 comments: