దళితుల సమగ్రాభివృద్ధి’ రాష్ట్ర సదస్సులో మేకపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దళితుల సమగ్రాభివృద్ధి’ రాష్ట్ర సదస్సులో మేకపాటి

దళితుల సమగ్రాభివృద్ధి’ రాష్ట్ర సదస్సులో మేకపాటి

Written By ysrcongress on Thursday, December 8, 2011 | 12/08/2011

వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు: ఎంపీ మేకపాటి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలనకు అర్హతలేని నాయకుల వల్ల రాజ్యాంగం అపహాస్యమవుతోందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నాయకత్వ లోపం వల్ల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయని, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బాపూజీలాంటి నేతల కోసం దేశం ఎదురుచూస్తోందని అన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాల సాధన కోసం ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 

భవిష్యత్తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. అంబేద్కర్ 55వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దళితుల సమగ్రాభివృద్ధి’ రాష్ట్ర సదస్సులో మేకపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే ప్రజల జీవితాలు ఎలా మెరుగుపరచవచ్చనేందుకు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాం చక్కని ఉదాహరణ అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మహానేత మరణం తర్వాత కేంద్ర, రాష్ట్ర పాలకులు తెలుగు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అల్లకల్లోలం కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కారణమని అన్నారు. 

విశ్వసనీయత లేని చంద్రబాబు మరోసారి అధికారం కోసం తాపత్రయపడటం సిగ్గుచేటని విమర్శించారు.తెలంగాణ ఇస్తారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే కాలంలో ప్రజలు విశ్వసనీయతకే పట్టం కడతారని చెప్పారు. 


జగన్‌తోనే మళ్లీ సువర్ణయుగం: బాబురావు

నిమ్న కులాల కోసం అంబేద్కర్ కన్న కలల్ని దివంగత ముఖ్యమంత్రి ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ఆచరణలో పెట్టారని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. రాజశేఖరరెడ్డి తన హయాంలో అట్టడుగువర్గాల వారందరికీ ఆర్థిక, ఆహార భద్రత కల్పించి అండగా నిలిచార న్నారు. పేదలు, దళితులకు ఉన్నత విద్యనందించే స్టడీ సర్కిళ్లను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అలా చేస్తే తాను నిరాహార దీక్ష చేస్తానని బాబురావు హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలన్నా, మళ్లీ వైఎస్సార్ నాటి సువర్ణయుగం రావాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కొల్లి నిర్మలాకుమారి, ఎం.మారెప్ప, నారాయణస్వామి, కిరణ్‌కుమార్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, వంగపండు ఉష, చల్లా మధుసూదన్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, జాన్‌వెస్లీ, బి.జనార్ధన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టగా ఆమోదించారు.

సదస్సులో తీర్మానాలివీ

వైఎస్సార్ కలలుగన్న విధంగా దళిత విద్యార్థులందరికీ కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య. ప్రతి దళితవాడలో పాఠశాల నిర్మాణానికి చర్యలు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమంతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన.

దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, అంబేద్కర్, వైఎస్ కన్న కలల్ని నిజం చేయడానికి.. విద్యారంగానికి నిధుల కేటాయింపునకు అధిక ప్రాధాన్యత.

ప్రైవేట్ రంగంలో కూడా దళితులకు రిజర్వేషన్ అమలుకు చర్యలు.
ప్రతి దళిత కుటుంబానికి రెండెకరాల సాగుభూమిని కేటాయించి ఆత్మగౌరవాన్ని కాపాడటం. 
తల్లిదండ్రుల ఆదాయంతో సంబంధం లేకుండా దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల విడుదల
సాంఘిక సంక్షేమ హాస్టళ్లను అధునీకరించి, అన్నింటికీ సొంత భవనాలు చేకూర్చాలి.

దళితుల సమగ్రాభివృద్ధికి గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించి, అందరకీ విద్య, ఉపాధి అవకాశాల కల్పన
దళిత వాడల్లో పక్కా గృహాలు, రోడ్లు, డ్రైనేజి, విద్యుత్, తాగునీరు, ఉచిత వైద్యం ఇతర వసతులతో సమగ్రాభివృద్ధికి చర్యలు. 
ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక దళిత పారిశ్రామిక విధానం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీతో రుణ సదుపాయం.

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అట్రాసిటీ చట్టం అమలుకు పటిష్ట చర్యలు.
ప్రభుత్వ రంగంలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు. ప్రతిభ కలిగిన దళిత ఉద్యోగులకు వివక్షలేని పదోన్నతులు.
వైఎస్సార్ ఆశయసాధన కోసం జౌత్సాహికులైన దళిత పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్లదాకా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రుణ సదుపాయం.
Share this article :

0 comments: