అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు

Written By ysrcongress on Friday, December 9, 2011 | 12/09/2011

హైదరాబాద్, న్యూస్‌లైన్: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు సంక్షేమ పథకాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఫీజుల చెల్లింపు, పావలా వడ్డీ, రైతుల రుణాలకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకేనని అన్నారు.

సంక్షేమ పథకాలపై చేస్తున్న ఖర్చుపైన శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తున్నామని, విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లిస్తున్నామని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమానికి సంబంధించి 13 అంశాలపై రూ.13,445 కోట్ల కోత విధించినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొన్నా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. 

‘‘ఈ ఏడాది బడ్జెట్‌లో ఫీజుల పథకానికి రూ.3,200 కోట్లు కేటాయించి రూ.990 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అలాంటప్పుడు రూ.5,500 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నిండు సభలో ఎలా చెబుతారు? ఇంత కన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తే.. ప్రభుత్వం అంటున్నట్లు అంతా పచ్చగా ఉంటే అన్నదాతలు ఎందుకు క్రాప్ హాలిడేను ప్రకటిస్తున్నారు? వరి, పత్తి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు?’’ అని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్ల మేరకు రైతులకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారనీ, అయితే సగానికి పైగా సీజన్ అయిపోయినా ఇప్పటికి వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని పద్మ తెలిపారు. 

ఇప్పటికే రూ.2,700 కోట్ల పావలా వడ్డీ రుణాల బకాయిలు చెల్లించాల్సి ఉండగా మళ్లీ కొత్తగా వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. బలహీన వర్గాల విద్యార్థుల హాస్టళ్లు, గురుకుల ఆశ్రమ పాఠశాలలకు ఇచ్చే నిధుల విషయంలో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలే చెప్పిందని అన్నారు.


అదొక చారిత్రక ఘట్టం

విప్ ధిక్కరణపై ఎంపీ సబ్బం హరి



హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజీనామా చేయమని నాయకులు అడిగితే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీవంటి పదవుల్లో ఉన్నవారే ఉన్నఫళంగా మాయమ య్యే పరిస్థితులున్న ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన శాసనసభ్యులు ఏకంగా 16మంది తాము నమ్మిన నాయకుడి వెంటే ఉంటామంటూ పదవులు కోల్పోవడానికి సిద్ధపడటం ఓ చారిత్రక ఘట్టమని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడవడం కోసమని రాష్ర్ట కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 16మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటుచేయడాన్ని విలేకరులు ప్రస్తావించినపుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లో గురువారం తనను కలిసిన మీడియా ప్రతి నిధులతో సబ్బంహరి మాట్లాడారు. అవిశ్వాస తీర్మా నం మరుసటిరోజు జగన్ మాట్లాడుతూ ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని సవాల్ చేయగా... వేటుకే మొగ్గు, రెండ్రోజుల్లో నిర్ణయం అంటూ కొందరు మాట్లాడ టం, పత్రికల్లో రాయడం విచిత్రంగా ఉందన్నారు. 

మహానేత వైఎస్ మరణించిన రోజు నుంచీ ఆ ఎమ్మెల్యేలు జగన్ వెన్నంటే ఉన్నారని, అలాంటివారిని కొన్నారని మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వెకిలిమాటల్ని కట్టిపెడితే మంచిదని హితవు పలికారు. ఎమ్మెల్యేలు అం గడి సరుకుగా మారారంటున్న తులసిరెడ్డి మూడుసార్లు పార్టీలు మారినప్పుడు ఎంతకు అమ్ముడుపోయారని ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తారని ప్రశ్నించారు. జగన్ పడగొడతానంటే మేం సర్కార్‌ని నిలబెట్టామంటున్న చిరంజీవి రాజకీయాలు మాట్లాడకుండా ఉంటే ప్రజలు హర్షిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన రాజకీయాలు మానుకుని తన వృత్తికి పరిమితమైతే బాగుంటుందని సూచించారు. 

రాష్ట్రంలో తొలిసారి సంకీర్ణం: ఆంధ్రప్రదేశ్ రాజ కీయ చరిత్రలో మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వం ఇప్పు డు నడుస్తోందని సబ్బంహరి చెప్పారు. ఉప ఎన్నికలొస్తే జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలే మళ్లీ గెలుస్తారని, కడప, పులివెందుల ఫలితాలే పునరావృతమవుతాయని అభిప్రాయపడ్డారు. జగన్‌ను సమర్థిం చిన 18మంది ఎమ్మెల్యేల్లో సగంమంది ఉప ఎన్నికల్లో ఓడిపోతారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. అలా మాట్లాడుతున్నవారెవరైనా సరే ఆ 18 స్థానాల్లో ఎక్కడినుంచైనా పోటీచేసి గెలిచి చూపాలని సవాల్ చేశా రు.
Share this article :

0 comments: