06 November 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

విజయసాయి రెడ్డి ఛాలెంజ్ ని సిబిఐ స్వీకరించాలి- జూపూడి

Written By news on Saturday, November 12, 2011 | 11/12/2011

హైదరాబాద్: ఆడిటర్ విజయసాయి రెడ్డి ఛాలెంజ్ ని సిబిఐ స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయసాయి రెడ్డి లేఖని సిబిఐ స్వీకరించాలన్నారు. డెలాయిట్ సుదర్శన్, విజయసాయి రెడ్డిలను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించగలరా? అని ఆయన సిబిఐ అధికారులను అడిగారు. 

నష్టాల్లో ఉన్న రామోజీరావు సంస్థ ఈనాడు షేర్ ని ఎక్కువ ధరకు అమ్మవచ్చు, కొత్తగా పెట్టిన సాక్షి పత్రిక షేరుని ఎక్కువ ధరకు అమ్మకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఈనాడు మిషనరీ స్క్రాప్ అని, అదే సాక్షి విషయానికి వస్తే అన్నీ ఆధునిక సాంకేతి పరిజ్ఞానంతో కూడిన కొత్త యంత్రాలని తెలిపారు. మూతబడిపోయిన పత్రికని ఒక విలేకరి కోట్ల రూపాయలతో ఎలా ప్రారంభించారని ఆయన ప్రశ్నించారు. 


సిబిఐ వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. సిబిఐ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడుల జేబు సంస్థగా మారడాన్ని తాము ఒప్పుకోమన్నారు. ఏ శాఖలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయో ఆ శాఖ మంత్రులను విచారించడంలేదన్నారు. ఆ శాఖ కార్యదర్శులను విచారించడంలేదని తప్పుపట్టారు. పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలా పదేపదే తప్పుడు ప్రచారాలు చేసింతమాత్రాన జగన్మోహన రెడ్డిని ఏమీ చేయలేరని ఆయన అన్నారు. ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం మానుకోవాలని సలహా ఇచ్చారు. కుట్రపూరితమైన ప్రచారానికి తెరదించాలన్నారు.

రాయ్ బరేలిలో సోనియాకు వ్యతిరేకత


రాయ్ బరేలీ: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలో ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే బృందం అభిప్రాయ సేకరణ చేసింది. లోక్ పాల్ బిల్లు ఆమోదించకపోతే సోనియాకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని 99 శాతం మంది చెప్పారు

edhi nijam



‘తత్కాల్’ గడువు 24 గంటలే


న్యూఢిల్లీ/సిటీబ్యూరో, న్యూస్‌లైన్: రైల్వే తత్కా ల్ రిజర్వేషన్ల బుకింగ్ దుర్వినియోగంపై రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతుండటంతో దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కీలక మార్పులు చేపట్టింది. తత్కాల్ టికెట్ల జారీని 48 గంటల నుంచి 24 గంటలకు కుదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. గుర్తింపు కార్డులు చూపిన వారికే టికెట్లు విక్రయించడం, ఒక పీఎన్‌ఆర్‌పై నలుగురు ప్రయాణికులను మాత్రమే అనుమతించడం వంటి షరతులు విధించింది. తద్వారా దళారులకు ముకుతాడు వేయనుంది. అలాగే ఖాయమైన టికెట్లపై కొన్ని మినహాయింపుల్లో తప్పితే రిఫండ్‌ను రద్దు చేసింది. రైళ్లు రద్దయినప్పుడు, ఆలస్యంగా నడుస్తున్నప్పుడు మాత్రమే రిఫండ్‌ను ఇవ్వనుంది. దీంతోపాటు టెకెట్ల జారీలో ఏజెంట్లపై విధించిన ఆంక్షలను గంట నుంచి రెండు గంటలు (ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ) పొడిగించింది. ఈ మార్పులన్నీ వారంలోగా అమల్లోకి వస్తాయని రైల్వే మంత్రి దినేశ్ త్రివేదీ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యాలను దుర్వినియోగం చేసే వాళ్ల సమాచారం అందించే వారి కోసం ఓ పథకం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. బుకింగ్ కౌంటర్లలో సీసీటీవీలను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు.

రాష్ట్రానికి వారంలో మూడు కొత్త రైళ్లు: రైల్వే మంత్రి దినేష్ త్రివేది శుక్రవారం ఢిల్లీలో ప్రకటించిన 26 కొత్త రైళ్లలో..రాష్ట్రానికి సంబంధించి మూడు కొత్త రైళ్లు వారం రోజుల్లోపు పట్టాలెక్కనున్నాయి. 12025/12026 పుణే-సికింద్రాబాదు (శతాబ్ది ఎక్స్‌ప్రెస్) డైలీ, 77676/ 77677 మిర్యాలగూడ-నడికుడి (డెమూ) వారంలో ఆరు రోజులు, 77675/ 77678 కాచిగూడ-మిర్యాలగూడ (డెమూ- వారంలో ఆరు రోజులు) రైళ్లు ఉన్నాయి

లీకులందించడమే లక్ష్యమా?: అంబటి

జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను మసకబార్చేందుకే ప్రయత్నమా?
డెలాయిట్ సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చారంటూ ఎల్లో మీడియా పిచ్చిరాతలు
విచారణంటే జగన్ ఇంటి వాస్తు చూడటమేనా?
అసలు విచారణ రహస్యంగా జరుగుతోందా లేక పత్రికల సమక్షంలో జరుగుతోందా?
బాబును సమర్థించేలా లక్షీ్ష్మనారాయణ ఎందుకు మాట్లాడారు?
‘సాక్షి’ లక్ష్యంగానే ఆ రెండు పత్రికల ప్రచారం.. రూ.1,800కోట్ల నష్టాల్లో రామోజీ కంపెనీలు 
అలాంటి సంస్థ షేరు ఒక్కోటి రూ. 5.32 లక్షలకు ఎలా కొంటారు?
ఒక పత్రికలో పనిచేసిన వ్యక్తి అదే పత్రికను ఎలా కొన్నారు?
జగన్ ఏ తప్పూ చేయలేదని అందరికీ తెలుసు 
ఏం చేయలేకనే సీబీఐని ఉపయోగించుకుంటున్నారు
రాజీనామాలు ఆమోదించరు, అవిశ్వాసం ప్రవేశపెట్టరు.. 
రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితులు


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ, పరువు ప్రతిష్టలను తగ్గించేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలుగుతోందని, అందుకు ఎల్లోమీడియా రాతలు మరింత బలం చేకూరుస్తున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ నిజాలు నిగ్గుతేల్చేందుకు జరుగుతోందా లేక ఎల్లో మీడియాకు లీకులందించి జగన్ ప్రతిష్టను దొంగదెబ్బ తీసేందుకు జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈనాడు, దాని తోకపత్రిక గురివిందల్లా ‘సాక్షి’ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సీబీఐ విచారణ జరుగుతున్న తీరు, ఎల్లో మీడియాలో వస్తున్న విష కథనాలు చూస్తుంటే ఆశ్చర్యం వే స్తోంది. డెలాయిట్ సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చారని, జగన్ చక్రబంధంలో ఇరుక్కున్నార ని పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో పిచ్చి రాతలు రాశాయి. 

ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది... త్వరలో ఏదో జరగవచ్చంటూ భయాందోళనలు కలిగే రీతిలో కథనాలు ప్రచురించాయి. సీబీఐ విచారణలో వాస్తవాలు తెలుసుకోవడంకన్నా, కేవలం పత్రికల్లో ప్రచారం చేసి జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ తగ్గించేందుకే ఎల్లో మీడియా ప్రయత్నం చేసినట్లుగా ఉంది’’ అని అంబటి దుయ్యబట్టారు. ‘‘కంపెనీల విలువ లెక్కించడంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ మొదటగా ‘సాక్షి’ విలువ రూ. 2,500 కోట్లు చేసిందని, వీళ్లు పెంచమంటే మరో వెయ్యికోట్లు పెంచిందని ఎల్లో కథనాలు చెబుతున్నాయి. కార్పొరేట్ కంపెనీ స్థాపించినప్పుడు ఎవరైనా దినదినాభివృద్ధి కోరుకుంటారే కానీ, విలువ తక్కువ చేసి చెప్పమంటారా? డెలాయిట్ సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చారంటున్నారు... అదీనూ కంపెనీ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత అది సీబీఐ విచారణలో చెప్పారంటున్నారు. ఆయన నిజంగా చెప్పారో, లేదా చొక్కాలాగి, బెదిరించి ఆ విధంగా చెప్పమన్నారో ఎవరికి తెలుసు?’’ అని ప్రశ్నించారు. డెలాయిట్ సుదర్శన్‌ను 164 సెక్షన్ కింద సీబీఐ విచారణ నిర్వహించి రికార్డు చేశారని, నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్లు శిక్ష వేస్తారని ఎల్లోమీడియానే తీర్పునివ్వడాన్ని తప్పుబట్టారు. ఏదోవిధంగా జగన్‌పై విషప్రచారం చేసి ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని తగ్గించి సర్వేలు చేసి చూపే ప్రయత్నంగా కనిపిస్తోందని అంబటి దుయ్యబట్టారు. 

సీబీఐ ఎక్కడ విచారణ చేస్తోంది?
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబమే టార్గెట్‌గా సీబీఐ విచారణ సాగుతోందని అంబటి తప్పుబట్టారు. ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో లబ్ధిపొందిన వాళ్లే జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపైనే సీబీఐ విచారణ చేయాలనుకున్నారు. అందుకే వేశారు. కానీ సీబీఐ చేస్తున్నదేంటి? లబ్ధిపొందిన వాళ్లు ఎవరు, అన్యాయం అక్రమం ఎక్కడ జరిగిందనేది తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్తారా లేక జగన్ నివాసానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా, లోపల ఏముంది, కిటికీ విలువ ఎంతని దర్యాప్తు చేస్తారా? ఇదేనా సీబీఐ చేసే దర్యాప్తు! ఆ తర్వాత ఎల్లో మీడియాకు లీకులివ్వడం, వాళ్లు దీనికి మరింత పైత్యాన్ని జోడించి ఇంట్లో బంగారు కుర్చీ ఉందని, స్విమ్మింగ్‌పూల్, విదేశీ బారు అంటూ తలాతోక లేని కథనాలు ఇవ్వడం.. ఇదేనా సీబీఐ దర్యాప్తు? జగన్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ.. కాంగ్రెస్-టీడీపీలకు లబ్ధి చేకూర్చడమే సీబీఐ లక్ష్యమా? ప్రభుత్వమంటే వైఎస్ కుటుంబం ఒక్కటేనా?’’ అని అంబటి నిలదీశారు. అన్యాయం ఎక్కడ జరిగిందో గుర్తించడానికి కాకుండా కేవలం ఎల్లోమీడియాకు సమాచారం ఇచ్చేందుకే సీబీఐ విచారణ చేస్తున్నట్లుందని విమర్శించారు. సీబీఐ విచారణ రహస్యంగా జరుగుతోందా లేదా పత్రికల సమక్షంలో బహిరంగంగా జరుగుతోందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓఎంసీ కేసుకు సంబంధించి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ అధికారులకు ఒక జీవో ఇస్తే, సీబీఐ జేడీ లక్షీ్ష్మనారాయణ నాలుగు గంటల వ్యవధిలోనే ‘హిందూ’ పత్రికతో మాట్లాడుతూ ఆ జీవోతో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయనను సమర్థించేలా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. ఓఎంసీలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొదటి నుంచి విచారణ జరిపితే తప్పేమిటని నిలదీశారు. సీబీఐ విచారణ కాంగ్రెస్-టీడీపీల వాదనకు వత్తాసు పలికేదిగా ఉందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రవర్తించి సీబీఐకున్న పవిత్రతను మసకబార్చవద్దని ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారులకు అంబటి విజ్ఞప్తి చేశారు. 

లాభాలు పొందిన వారైతే ముఖచిత్రమెందుకు?
వైఎస్‌ఆర్ హయాంలో లబ్ధిపొందిన కంపెనీలే ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయని ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని అంబటి తప్పుబట్టారు. అదే నిజమైతే పెట్టుబడులు పెట్టేవారికి వ్యాల్యుయేషన్ రిపోర్టుతో పనేముందని ప్రశ్నించారు. లబ్ధిపొందినవారే పెట్టుబడులు పెట్టారన్నప్పుడు, ఇప్పుడేదో డొల్ల అంచనాలంటూ ఎల్లో మీడియా కొత్త నినాదం వినిపిస్తుందెందుకని నిలదీశారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలని చెప్పారు. వారెవ్వరూ ఎలాంటి ఫిర్యాదు చేయనప్పుడు ఈ విషప్రచారమెందుకని ప్రశ్నించారు. ‘‘కొండారెడ్డిది ప్రధాన సాక్ష్యమంటూ ఎల్లో మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురిస్తోంది. ఇంతకూ ఆ కొండారెడ్డి ఎవరు? ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు. మా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి తండ్రి మా పార్టీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆయన జగన్‌కు అనుకూలంగా చెబుతారా? ఆ వ్యక్తి చెప్పిన మాటలు సాక్ష్యంగా స్వీకరిస్తారా? ఇదెక్కడి విడ్డూరం!’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘వై.ఎస్.జగన్ ఏ విధమైన తప్పు చేయలేదని సీబీఐతోపాటు కాంగ్రెస్-టీడీపీల వారందరికీ తెలుసు. ఇంతచేసి ఏ తప్పూ తేలకపోతే ప్రజల్లో చులకనవుతామనే దురుద్దేశంతోనే కోడిగుడ్డు మీద ఈకలు లాగుతున్నారు. జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని కాంగ్రెస్-టీడీపీలు దుర్బుద్ధితో ఏదో ఒకచోట ఇరికించి.. జగన్‌ను అభాసుపాలు చేయడం కోసం సీబీఐని ఉపయోగించుకుంటున్నారు’’ అని అంబటి ఆరోపించారు. 

రామోజీ.. నీ గురివింద నలుపు చెప్పవేం?
ఈనాడు, దాని తోకపత్రిక గురివింద గింజల్లా వ్యవహరిస్తున్నాయని అంబటి ధ్వజమెత్తారు. తమ డొల్లతనాన్ని ఏనాడూ బయటపెట్టుకోని ఆ రెండు పత్రికలూ కలిసి ‘సాక్షి’ని నిత్యం విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన సంస్థలో ఒక్కో షేరు రూ. 350 కు కొన్నారని నానా యాగీ చేస్తున్నారు. జగన్ లేటెస్టు టెక్నాలజీతో సరికొత్త మిషన్లతో పత్రిక స్థాపించారు. అది సక్సెస్ అయి ప్రతి రోజూ ఉదయానికి 15 లక్షల ఇళ్లకు చేరుతూ... కోటికి పైగా పాఠకులను సంపాదించుకుందే కానీ మూతపడలేదుగా? సాక్షి ఉజ్వల భవిష్యత్తు ఉన్న పత్రిక. మరి రామోజీ సంగతేంటి? ఆయన 15 కంపెనీలు రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉన్నాయని ఆదాయపన్ను శాఖముందు అంగీకరించారు. అలా నష్టాల్లో కూరుకుపోయిన, 30 ఏళ్లనాటి పాతమిషన్లు ఉన్న సంస్థలో ఒక్కో షేరు రూ. 5 లక్షల 32 వేలు పెట్టి కొనుగోలు చేశారంటే దాంట్లో ఉన్న మర్మమేంటి రామోజీ? అనునిత్యం కోర్టు కేసులు, అనేక భూవివాదాలు కలిగిన సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ఏవిధంగా ముందుకొచ్చారో టీడీపీ నేతలు వివరిస్తారా? సాక్షిలో కేవలం రూ.350లకు కొంటే నానాయాగీ చేస్తున్నా రామోజీ, మరి నీ గురివింద నలుపు చెప్పవెందుకు?’’ అని నిలదీశారు. ‘‘తెలుగునాట ఉన్న మరో తోకపత్రిక పేరు పలకడమే శుద్ధదండగ. 

సర్క్యులేషన్ పడిపోయి విపరీతమైన కష్టాల్లో కూరుకుపోయిన ఆ పత్రిక 2000లో మూతపడింది. రెండేళ్ల తర్వాత తుప్పుపట్టిన మిషన్‌లను కొనుగోలు చేసి మళ్లీ తెరిచారు. అలా చేసింది ఏ కార్పొరేట్ కంపెనీయో కాదు సుమా! అంతకుముందు అదే పత్రికలో పనిచేసిన ఒక రిపోర్టర్. ఆ పత్రిక మూతపడే సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆ వ్యక్తి మాత్రం కోట్లు కుమ్మరించి పేపర్‌ను తెరవడం విడ్డూరం. అందులోకి పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి? సీఎం రమేశ్, జైరమేశ్, నూజివీడు ప్రభాకర్ ఏమాశించి పెట్టుబడులు పెట్టారు? బాబు పలుకుబడి మేరకు పెట్టుబడులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ నష్టాల్లో ఉన్న ఆ సంస్థకు బాబు క్యాష్ కొట్టడం లేదా?’’ అని అంబటి ప్రశ్నించారు. ఆ రెండు పత్రికల బాగోతాలు తెలుగు ప్రజలకు తెలుసని, గిట్టనివారిపై విషం చిమ్మడమే వారి లక్ష్యమని కూడా తెలుసునని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం చిత్రమైన పరిస్థితి!
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, చాలా చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని అంబటి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అధికార పక్షానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించరు. ఎమ్మెల్యేలందరూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆమోదించరు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందంటే గవర్నర్ మాత్రం.. లేదు లేదు బ్రహ్మండమైన మెజారిటీ ఉందంటారు. ప్రధాన ప్రతిపక్షాన్ని అవిశ్వాసం పెట్టమంటే... మీరు చెబితే పెడతానా, మా ఇష్టం ఉన్నప్పుడు పెడతామంటారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్య నైతికత ఉందా?’’ అని అంబటి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పరిస్థితి మరీ విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు పోరుయాత్రలంటూ రోడ్లమీద తిరుగుతూ... ఇది పనికిమాలిన ప్రభుత్వం, దద్దమ్మ, చేతకానిది, గుండెల్లో నిద్రపోతానంటారు. తీరా అవిశ్వాసం పెట్టమంటే నేనెందుకు పెడతా? అయినా ప్రభుత్వం పడిపోతే సమస్యలు పోతాయా? అంటూ ఎదురు ప్రశ్నిస్తారు’’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నందుకే ఆయన తప్పులను కప్పిపెడుతోందని, అందుకే ఆయనపై ఆరోపణలు వస్తున్నా సీబీఐ విచారణ చేయడంలేదని అంబటి ఆరోపించారు.

కరువు ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ డిమాండ్


దీనికి అదనంగా ఎకరాకు రూ.2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలి... 
అన్నదాతలను ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి
కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా జరగలేదు
కరెంటు కోతలతో సర్కారే పంటలను ఎండబెట్టింది
జగన్‌కు గోడు వెళ్లబోసుకున్న రైతన్నలు

కడప, న్యూస్‌లైన్: పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.4 వేల ఇన్‌స్టంట్ సబ్సిడీ ఇవ్వాలని, దీనికి అదనంగా రూ.2,400 ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా లేదని మండిపడ్డారు. ఈ ప్రకటనతో రైతులకు దమ్మిడీ మేలు కూడా జరగలేదన్నారు. శుక్రవారం ఆయన వైఎస్‌ఆర్ జిల్లాలోని పోరుమామిళ్ల మండలం సూరిసుద్దుపల్లె, రాజాసాహెబ్‌పేట, బద్వేలు మండలంలో కొంగళవీడులో పర్యటించారు. కరువుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పసుపు, పత్తి, వరి పంటలు దెబ్బతిన్న రైతులు, క్రాప్ హాలిడే ప్రకటించిన అన్నదాతలతో మాట్లాడారు. నష్టపోయిన పసుపు పంటను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ పసుపు భూమితో పాటు మీకళ్ల ముందరే దెబ్బతిన్న పత్తి పంటలు కనబడుతున్నాయి. వర్షం లేక వరి ఎండిపోయింది. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటకు 22 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది. కానీ ఇక్కడ వచ్చింది 1.5 క్వింటాళ్లు మాత్రమే. ఇక ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పసుపు నాలుగైదు క్వింటాళ్లు కూడా రాని దుస్థితి ఉంది. అయినా ఈ మండలాన్ని (పోరుమామిళ్ల) కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇక్కడ కరువు కనిపించలేదా? కరువు మండలాల్లో ప్రకటన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదనడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించామని చెప్పుకునేందుకే తప్ప వీటి ప్రకటన వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగలేదు’’ అని జగన్ పేర్కొన్నారు.

కరువు కాలంలో కరెంటు కోతలా..?: అసలే వర్షాలు కురవక పంటలు ఎండి రైతులు సతమతమవుతుంటే.. ప్రభుత్వం కరెంటు కోతలు విధించి వారికి గుండెకోత మిగిల్చిందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ కోతలతో బోర్లలో కొద్దో గొప్పో నీళ్లున్నా. పంటలకు వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు వెంటనే రూ.4 వేల ఇన్‌స్టంట్ సబ్సిడీ అందించాలన్నారు. ఎకరాకు రూ.2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల రైతుకు రబీ పంటలను సాగు చేసేందుకు కనీసం పెట్టుబడి ఖర్చులయినా వస్తాయన్నారు. అన్నదాతలు కష్టాల్లో చిక్కుకోవడంతో రబీ సాగు గణనీయంగా పడిపోయిందన్నారు. మరిన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు.

రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి

వరి, పత్తి, పొగాకు, పసుపు, పత్తి పంటకు సగానికి సగం కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని జగన్ అన్నారు. ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ప్రత్యేకంగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడిని కోరారు.

ఓట్లేయలేదని నీళ్లివ్వలేదు..

ఓట్లు వేయలేదన్న కారణంతో బ్రహ్మంసాగర్ నుంచి ఆయకట్టుకు నీరు ఆలస్యంగా ఇచ్చారని, రైతులకు కరువు వచ్చేలా రాజకీయ నాయకులే చేస్తుంటే బాధేస్తోందని బద్వేలు మండలం కొంగళవీడులో జగన్ పేర్కొన్నారు. ఎందుకు ఆలస్యంగా నీరు వదిలారని రైతులను జగన్ అడగ్గా.. ‘‘మీకు ఓట్లు వేశామనే కక్ష సాధింపుతోనే’’ అని వారు సమాధానమిచ్చారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయరు నుంచి నీటిని ఆలస్యంగా విడుదల చేయడంతో కొంగళవీడు గ్రామంలోనే 384 ఎకరాల్లో పంట పొలాలు బీడుగా మారాయని జగన్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్ రాకపోవడంతో కక్షతో రైతులను పీల్చిపిప్పి చేసేందుకు మంత్రి డీఎల్ కంకణం కట్టుకున్నారన్నారు.

గ్రామాలే కదలివచ్చాయి..: జగన్ తమ ప్రాంతాల్లోని రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్నారని తెలిసి గ్రామాలు కదలివచ్చాయి. తమ సాదకబాధకాలను ఆయనకు చెప్పుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. రైతులు పొలాల వెంట బారులు తీరి తమ కష్టాలు చెప్పుకున్నారు. జగన్ పర్యటనలో బద్వేలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డీసీ గోవిందరెడ్డి, జిల్లాపార్టీ కన్వీనర్ సురేష్‌బాబు, యువజన అధ్యక్షులు వైఎస్ అవినాష్‌రెడ్డి, బద్వేలు మున్సిపల్ చైర్మన్ మునెయ్య తదితరులు పాల్గొన్నారు.

సీబీఐకి విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

ఈ విషయాన్ని మీ సమక్షంలోనే రుజువు చేస్తా 
‘డెలాయిట్’ సుదర్శన్‌తో ముఖాముఖికి అవకాశమివ్వండి
జగతి విలువ పెంపును, పాత తేదీతో నివేదికను నేనెప్పుడూ కోరలేదు.. 
నాకా అవసరమూ లేదు.. 
మీడియాలోని ప్రత్యర్థి వర్గం పన్నాగమిది
జగన్, జగతిలపై అవి విషం కక్కుతున్నాయి
నా ప్రతిష్టను దిగజార్చేలా రాస్తున్నాయి.. 
రాజ్యాంగేతర శక్తులుగా విచారణ చేస్తున్నాయి
‘డెలాయిట్’ సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలం ప్రతిని నాకివ్వండి
రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉన్న ఉషోదయా విలువను రూ.7,000 కోట్లుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ అంచనా కట్టలేదా?
దాని ఆధారంగా రూ.100 షేరును రూ.5.28 లక్షల చొప్పున రామోజీ అమ్ముకోలేదా?
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే లేఖను మీడియాకు విడుదల చేస్తున్నాను 

హైదరాబాద్, న్యూస్‌లైన్:జగతి పబ్లికేషన్స్ విలువ పెంచాలని గానీ, మదింపు నివేదికను పాత తేదీతో ఇవ్వాలని గానీ డెలాయిట్ సీనియర్ డెరైక్టర్ సుదర్శన్‌ను, వారి సంస్థకు చెందిన ఇతరులను ఎవరినీ తానెప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కనీసం అలా కోరను కూడా లేదన్నారు. ‘‘నాకు ఆ అవసరమే లేదు. పైగా డెలయిట్ నేపథ్యం, స్థాయి దృష్ట్యా అది సాధ్యం కూడా కాదు’’ అన్నారు. తన ప్రొఫెషనల్ కెరీర్లో ఎప్పుడూ సందేహాస్పద రీతిలో ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ‘‘నివేదికను పాత తేదీతో ఇవ్వాల్సిందిగా నేను ఒత్తిడి తెచ్చానన్న సుదర్శన్ వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివేదికను ఇవ్వడానికి ముందే, అంటే 2007 ఆగస్టు నుంచే మా కంపెనీలోకి పెట్టుబడుల రాక మొదలవడమే ఇందుకు నిదర్శనం’’ అని వివరించారు. సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలం, మరీ ముఖ్యంగా ఆ మేరకు ఒక వర్గం మీడియాకు అందుతున్న లీకులు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘దీనిపై నా వాదనలను విచారణలో వాద ప్రతివాదాల సందర్భంగా మాత్రమే బయట పెడతాను. అయితే చట్టానికి కట్టుబడి ఉండే పౌరునిగా సీబీఐ దర్యాప్తుకు నేను పూర్తిగా సహకరిస్తూ వస్తున్నాను. పై ఆరోపణల్లోని అసత్యాన్ని సుదర్శన్ సమక్షంలోనే రుజువు చేస్తాను. మీ దర్యాప్తులో భాగంగా, మీ కార్యాలయంలోనే అందుకు నాకు అవకాశం కల్పించండి’’ అని సీబీఐని కోరారు. ఈ మేరకు సీబీఐ విచారణాధికారికి శుక్రవారం విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలం ప్రతులను తనకు అందజేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఇలాంటి లీకు వార్తల నుంచి తనకు రక్షణ కావాలన్నారు. లేఖ సారాంశం ఆయన మాటల్లోనే...

ఉద్దేశపూర్వకంగానే లీకులు...

జగతి పబ్లికేషన్స్ విలువను రూ.2,500 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచేలా నేను ఒత్తిడి తెచ్చి బలవంతం చేశానని డెలాయిట్ టచ్ తొమట్సు ప్రైవేట్ లిమిటెడ్ (డెలాయిట్) సంస్థ డెరైక్టర్ సుదర్శన్ రైల్వే మేజిస్ట్రేట్ ముందు సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద వాంగ్మూలమిచ్చారంటూ ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు చూసి నేను విస్మయం చెందాను. పైగా నా ఒత్తిడి వల్లే ఆ నివేదికను ముందు తేదీతో ఇచ్చానని ఆయన చెప్పినట్టుగా వాటిలో వచ్చింది. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన కేసులో నేను రెండో నిందితుడినని మీకు తెలుసు. అయినా సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలాన్ని నాకు అందజేయలేదు. కానీ జగతి పబ్లికేషన్స్‌తో, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కార్పొరేట్, వ్యాపార స్పర్ధలున్న మీడియా సంస్థల యాజమాన్యంలో నడిచే వార్తా పత్రికల్లో మాత్రం సదరు వాంగ్మూలంలోని వివరాలపై వార్తలు వచ్చాయి! ఆ మీడియా సంస్థలు తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకునే లక్ష్యంతో జగతి పబ్లికేషన్స్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలపై విషం కక్కుతున్నాయి. సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలాన్ని మమ్మల్ని బాహాటంగా వ్యతిరేకించే మీడియా వర్గాలకు మాత్రమే కొన్ని స్వార్థ ప్రయోజన శక్తులు ఉద్దేశపూర్వకంగా లీక్ చేయడం నన్ను తీవ్రంగా షాక్‌కు గురి చేసింది. పైగా చెబుతున్న ఈ వాంగ్మూలం పూర్తిగా అవాస్తవం. సుదర్శన్ నిజంగానే దాన్ని ఇచ్చి ఉంటే, ఆయన కచ్చితంగా సదరు స్వార్థ ప్రయోజన శక్తుల ఒత్తిడికి లోబడే అలా చేసి ఉంటారు. ఎలాగోలా మా ఇమేజీని దెబ్బతీసి, మమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ ఆ శక్తులు వదులుకోవడం లేదు. సుదర్శన్‌కు ఆపాదిస్తూ, ఆయన వాంగ్మూలంలోని వివరాలంటూ వచ్చిన వార్తలు ఒకవేళ నిజమే అయితే.. అవన్నీ నన్ను తప్పుగా చిత్రించే ప్రయత్నాలే.

విలువ తక్కువ కట్టారు

మా సంస్థకు విలువ కట్టే విషయంలో నేను సుదర్శన్‌పై ఆధిపత్యం చలాయించే పరిస్థితిలో అసలే లేను. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెషనల్. మేం ఆయనను సంప్రదించిన క్లయింట్లం. ఓ క్లయింటు తన ప్రొఫెషనల్‌పై ఒత్తిడి తెచ్చాడనడం సహజ ప్రవర్తనకు పూర్తి విరుద్ధం. మేం కేవలం వాస్తవాలు, గణాంకాలు, అంచనాలను మాత్రమే అందించాం. ఆయన తన వృత్తిగత జడ్జిమెంటును ఉపయోగించుకుంటూ సంస్థ విలువపై స్వీయ అభిప్రాయాన్ని అందించారు. నిజానికి ఆ సమయంలో జగతి పబ్లికేషన్స్ సంస్థాగత విలువ రూ.3,900 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల దాకా ఉంటుందన్నది స్వయంగా ఒక ప్రొఫెషనల్‌ను అయిన నా నిశ్చితాభిప్రాయం. కాబట్టి సుదర్శన్ ఇచ్చిన రూ.3,050 కోట్ల విలువ నా స్వీయ మదింపు కంటే చాలా తక్కువ. పైగా డెలాయిట్ అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉన్న ప్రపంచ స్థాయి ఆడిటింగ్/కన్సల్టింగ్ సంస్థ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో నమోదై, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నియంత్రణలో పని చేస్తుంది. అలాంటి సంస్థను నేను ఒత్తిడి చేయడం అలా ఉంచి, కనీసం ప్రభావితమైనా చేయగలుగుతానా?

ఉషోదయా మాటేమిటి?

ఈనాడు వార్తా పత్రికను ప్రచురించే వ్యాపారంలోనే ఉన్న రామోజీరావు యాజమాన్యంలోని ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కార్పొరేట్ సంస్థ ఉదంతాన్ని మీ దృష్టికి తేదలచాను. దాని విలువను రూ.6,500-7,000 కోట్లుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ మా సంస్థను సుదర్శన్ విలువ కట్టేందుకు కేవలం కొద్ది నెలల ముందే లెక్కగట్టింది. కానీ ఉషోదయాకు ఆ సమయానికి రూ.1,800 కోట్ల సంచిత నష్టాలున్నాయి! అయినా ఎర్నెస్ట్ అంచనా కట్టిన విలువ ఆధారంగా ఒక్కొక్కటీ రూ.100 విలువ చేసే ఉషోదయా షేరుకు రూ.5,28,630 ప్రీమియం చొప్పున ఒక కొనుగోలుదారు చెల్లించాడు. అతనికి సంస్థలో 26 శాతం ఈక్విటీని బదలాయించారు! ఏ సంస్థ అంచనా విలువ అయినా తన కార్యకలాపాల తీరుతెన్నులు, సాధ్యాసాధ్యాలపై మార్కెట్ శక్తులకు సూచికగా ఉపయోగపడుతుంది. అంతేతప్ప దాన్ని ఎవరో చేసిన వ్యక్తిగత ఒత్తిడి యుక్తి పరిణామంగా చూడరాదు. అలా కానిపక్షంలో ప్రతి కార్యకలాపంపైనా అనుమానపు నీలినీడలు కమ్ముకుని, వాటన్నింటినీ విచారణార్హాలుగా మార్చేస్తాయి!

విషప్రచారంతో లబ్ధి ఎవరికో అందరికీ తెలుసు

కానీ జగతి, జగన్‌లకు విరోధులైన కొన్ని మీడియా శక్తులు సుదర్శన్ ఉదంతం నుంచి అనుచిత ప్రయోజనం పొందుతున్నాయి. రాజ్యాంగేతర శక్తులుగా మారి, మేమిప్పటిదాకా కట్టుబడిన చట్ట, విచారణ ప్రక్రియలను కూడా గౌరవించకుండా మాపై తమంత తాముగా విచారణ జరిపేస్తున్నాయి. ప్రజల దృష్టిలో మమ్మల్ని దోషులుగా నిర్ధారించి, శిక్షించజూస్తున్నాయి! చట్టంలోని సంక్లిష్టతలు సామాన్యులకేం తెలుస్తాయి లెమ్మన్న ధీమాతో మమ్మల్ని తప్పుగా చిత్రించి, మా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలే ఇవన్నీ. కానీ ఇలా చేయడం ద్వారా లబ్ధి పొందజూస్తున్నదెవరో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు! రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం నాకు హుందాగా జీవించే హక్కుంది. కాబట్టి ఇలాంటి లీకు వార్తల నుంచి నాకు రక్షణ కావాలి.

డిస్‌క్లెయిమరే సాక్ష్యం

నివేదికలోని 28వ పేజీలో డెలాయిట్ ఇచ్చిన డిస్‌క్లెయిమర్‌కు ఇక్కడ అత్యంత ప్రాధాన్యముంది. ‘‘ఈ నివేదికను కేవలం జగతి సంస్థ బయటి ఇన్వెస్టర్లతో తమ సంప్రదింపులకు ప్రాతిపదికను కల్పించేందుకు మాత్రమే ఇస్తున్నాం. బయటి పార్టీలు, లేదా ఔత్సాహిక ఇన్వెస్టర్లు దీనిపై ఆధారపడజాలరు. వారు విధిగా స్వీయ విచారణలు, స్వతంత్ర మదింపులు చేసుకుని మాత్రమే ఇందులో పేర్కొన్న ప్రకటనల కచ్చితత్వం, పరిపూర్ణతల విషయంలో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఈ విలువ మదింపుపై బయటి పార్టీలకు డెలాయిట్ ఏ విధంగానూ బాధ్యత వహించబోదు’’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ డిస్‌క్లెయిమర్ డెలాయిట్ మదింపు నివేదికలో అంతర్గత భాగమే. నివేదిక కేవలం జగతి బోర్డుకు నిర్దేశికగా ఉపయోగపడేందుకు మాత్రమేనని, ఇన్వెస్టర్లు దీనిపై ఆధారపడేందుకు కాదని అందులో బాహాటంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు, హెచ్చు విలువ ఇవ్వాల్సిందిగా డెలాయిట్‌ను నేను ఒత్తిడి చేయాల్సిన అవసరమేముంటుంది? దానివల్ల మాకేం ఒరుగుతుంది? వారి నివేదిక మా అంతర్గత అవసరాలకే తప్ప బయటికి చూపేందుకు కాదన్న మీడియా వార్తలు కూడా సరికావు. ఎందుకంటే అందులోని అంచనాలకు డెలాయిట్‌కు ఏ బాధ్యతా వహించబోదని డిస్‌క్లెయిమర్ స్పష్టంగా చెబుతోంది. అదీగాక మేం మిత్రులు, బంధువులు, సన్నిహితుల నుంచే వాటాలు సమీకరించాం తప్ప పబ్లిక్ ఇష్యూకు వెళ్లలేదు. ఎలా చూసినా ఇది డెలాయిట్ నివేదికను బహిర్గతపరచడం కానే కాదు. పైగా ఎంతటి ప్రతిష్టాత్మక సంస్థ ఇచ్చే మదింపు నివేదిక అయినా మహా అయితే సహేతుక అంచనా అవుతుందే తప్ప దాన్ని పూర్తిగా వాస్తవంగా భావించాలనేమీ లేదు. పైగా అలాంటి మార్కెట్ విలువ నివేదికను మాత్రమే ఏకైక ఆధారంగా చేసుకుని ఏ ఇన్వెస్టర్ కూడా ఏ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టడు. అన్ని రకాలా సాధ్యాసాధ్యాలు, లాభదాయకత, మార్కెట్ అంచనాల వంటివాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయానికి వస్తాడు. ల్యాంకో సంస్థకు చెందిన ఒక్కో షేర్ లాభం మూడేళ్లలోనే 100 శాతానికి పైగా పెరిగినా, అదే కాలానికి వాటి మార్కెట్ విలువ మాత్రం ఏకంగా 80 శాతం దాకా పడిపోయిన వైనం మనమంతా చూశాం. అలా 2007-2011 మధ్య ల్యాంకో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,000 కోట్ల నుంచి ఏకంగా రూ.4,000 కోట్లకు పడిపోయింది! ఇన్ఫోసిస్ విషయమూ అంతే. 2000-2011 మధ్య సంస్థ వ్యాపారం, లాభాలు పది రెట్లు పెరిగినా, షేర్ విలువ మాత్రం ఇదే కాలానికి రూ.8,000 నుంచి ఏకంగా రూ.2,850కి పడిపోయింది! ఇలా చాలా కంపెనీల్లో జరుగుతుంటుంది. మార్కెట్లో ఉండే ఇంతటి విసృ్తత, దారణమైన హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లందరికీ బాగా తెలుసు. అందుకే ఏ మదింపు నివేదికనైనా మార్కెట్ పరిస్థితులు తదితరాలతో బేరీజు వేసి చూసుకోవాల్సిందే. కావాలనో, మరో కారణంతోనో కొందరు మమ్మల్ని లక్ష్యం చేసుకుంటున్నారు. మా వ్యక్తిత్వాలను దెబ్బతీయజూస్తున్నారు.

ఈ లేఖను నేను మీడియాకు విడుదల చేస్తే మీరు అన్యధా భావించరనే ఆశిస్తున్నాను. అతి తక్కువ కాలంలో మా పత్రిక పాఠకుల సంఖ్య పెరుగుతున్న తీరును చూసి ఓర్చుకోలేని ఒక వర్గం మీడియా కనీవినీ ఎరగని రీతిలో చేస్తున్న దురుద్దేశపూర్వక, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అయిష్టంగానే నేనిలా చేయాల్సి వస్తోంది.

ముఖాముఖీకి సిద్ధం: విజయసాయిరెడ్డి

Written By news on Friday, November 11, 2011 | 11/11/2011

హైదరాబాద్: డెలాయిట్ కంపెనీ అంచనాలపై ఆ కంపెనీ సీనియర్ డైరెక్టర్ తో ముఖాముఖీకి సిద్ధమని 'సాక్షి' వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు. డెలాయిట్ కంపెనీ అంచనాలపై సిబిఐకి విజయసాయిరెడ్డి ఒక లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షిపై కక్షకట్టిన పత్రికల్లో వస్తున్నకథనాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డెలాయిట్ అంచనాల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేలుస్తామన్నారు. కొందరు వ్యక్తుల వత్తడికి తలొగ్గి సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చినట్లు అర్ధమవుతోందన్నారు. సుదర్శన్ సమక్షంలో అతని వాదన తప్పని నిరూపించడానికి అవకాశం ఇవ్వమని ఆయన సిబిఐని కోరారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టడానికే సిబిఐకి రాసిన లేఖని బహిరంగపరిచినట్లు ఆయన చెప్పారు. మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినట్లు చెబుతున్న వాంగ్మూలం తనకు ఇవ్వకుండా సాక్షిని వ్యతిరేకించేవారికి ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు.ఇదే డెలాయిట్ సుదర్శన్ 1800 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఈనాడుని కూడా వ్యాల్యూయేషన్ చేశారన్నారు.

డెలాయిట్ నివేదికకు, సాక్షిలోకి పెట్టుబడుల రాకకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. సాక్షిలోకి పెట్టుబడులు ఆగస్టు 2007 నుంచే వచ్చాయని, డెలాయిట్ నివేదిక నవంబర్ లో వచ్చిందని ఆయన వివరించారు.

డిసెంబరు 1 నుంచి తాగునీటి ఛార్జీల పెంపు




హైదరాబాద్: డిసెంబరు 1నుంచి తాగునీటి ఛార్జీలను పెంచాలని జలమండలి నిర్ణయించింది. వెయ్యి లీటర్లకు ఆరు రూపాయల నుంచి పది రూపాయలకు పెంచారు. ఫ్యాక్టరీలకు 25 రూపాయలకు పెంచారు. వ్యాపార అవసరాలకు వాడే నీటి పన్నుని 20 రూపాయలకు పెంచారు. నీటి ఛార్జీల పెంపుతో 20 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది.

స్ఠిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి: జగన్

కడప(వైఎస్ఆర్ జిల్లా): కరువు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు 4 వేల రూపాయల చొప్పున ఇన్ పుట్ సబ్జిడి ఇవ్వడంతోపాటు మూడు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని కరువు మండలాలో ఈరోజు ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పంట పోలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఆయనకు చెప్పుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క వ్యక్తి వల్ల కరువు వస్తుందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డ నిరూపించారన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రి డిఎల్ కి డిపాజిట్ దక్కలేదని బ్రహ్మసాగర్ నుంచి రావలసిన నీటిని అడ్డుకున్నారు. రబీ సీజన్ లో 32 లక్షల ఎకరాలు సాగు చేయవలసి ఉండగా, 17 లక్షల ఎకరాలలోనే సాగు చేసినట్లు ఆయన వివరించారు.

రచ్చబండను అడ్డుకున్న మహిళలు


హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మారింది. కరీంనగర్ జిల్లా జూలపల్లిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాన్ని మహిళలు శుక్రవారం అడ్డుకున్నారు. రూపాయికి కిలో బియ్యం తమకు వద్దని.... నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ వారు ఆందోళనకు దిగారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో మహానేత వైఎస్ఆర్ ఫోటో లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా ప్రజా సమస్యల గురించి నిలదీస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎమ్మెల్యే కమల సమక్షంలోనే పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఈ సంఘటనలో ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో ఎమ్మెల్యే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

కరువు మండలాల ప్రకటనలో జాప్యం: జగన్

కడప(వైఎస్ఆర్ జిల్లా): కరువు మండలాల ప్రకటనలో అలస్యం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. కరువు మండలాల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు. రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇంతవరకు అందలేదని చెప్పారు. రైతుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసాలేదన్నారు. సేద్యం చేసే ధైర్యం రైతుకు రావడంలేదని చెప్పారు. ఇప్పటికైనా కన్నీరు కారుస్తున్న రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి 4వేల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు.

సిబిఐ విచారణ రహస్యంగా జరుగుతుందా?: అంబటి


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తులకు సంబంధించి సిబిఐ విచారణ రహస్యంగా జరుగుతుందా? అన్న అనుమానాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబిఐ విచారణలో ఏం జరుగుతుందో ఆ రెండు పత్రికలకు ముందే తెలిసిపోతుందన్నారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు. 

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఉపయోగపడే విధంగా సిబిఐ విచారణ జరుగుతోందన్నారు. ఈనాడు తోక పత్రికకు పెట్టుబడులు ఎక్కడ నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎల్లో మీడియా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అంబటి హెచ్చరించారు.

cbn petition

cm failure

సాక్షిపై దాడులు.. బాబు ఆదేశాల మేరకే!: వాసిరెడ్డి పద్మ

15 నుంచి గుంటూరులో రెండో విడత ఓదార్పు

15 నుంచి గుంటూరులో రెండో విడత ఓదార్పు





చెరుకుపల్లి(గుంటూరు): గుంటూరు జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర ఈ నెల 15న రేపల్లె నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. గురువారం ఆయన చెరుకుపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపల్లె నుంచి బయలుదేరి తిప్పలకట్టలో బాధిత కుటుంబీకులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం నగరం మండలం వెనిగళ్లవారిపాలెం, చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామంలో కుటుంబాలను ఓదారుస్తారని తెలిపారు. జిల్లా నాయకులు ప్రకటించిన రూట్‌మ్యాప్ ప్రకారమే ఓదార్పుయాత్ర సాగుతుందన్నారు. షెడ్యూల్లో లేని గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని.. వాటిని ఆవిష్కరించలేదంటూ ప్రజలు మరో విధంగా భావించవద్దన్నారు. 

జగన్‌కు మద్దతు తగ్గనే తగ్గదు: ఎంపీ సబ్బం హరి

జగన్‌కు మద్దతు తగ్గనే తగ్గదు: ఎంపీ సబ్బం హరి





గోపాలపట్నం (విశాఖపట్నం), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందేగానీ తగ్గదని ఎంపీ సబ్బం హరి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే.. జగన్ ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడం కష్టం కాదని అన్నారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంపై ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చకూడదన్న భావనతో ఆయన ఉన్నారన్నారు. సబ్బం హరి గురువారం విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడి బయటకొచ్చినప్పటి నుంచీ జగన్‌పై పలు మీడియాల్లో నిజమైన వార్తలు రావడం లేదని గుర్తు చేశారు. ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీ, హైదరాబాద్, విజయనగరం, గుంటూరు... ఇలా వీలున్న అన్నిచోట్లా ఆయన వెంట యాత్రల్లో పాల్గొంటున్నారన్నారు.

Popular Posts

Topics :