04 December 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YSRCP MINORITY & BC Conveners

Written By ysrcongress on Saturday, December 10, 2011 | 12/10/2011

chebrolu odharpu images

10-12-2011 శనివారం ఓదార్పుయాత్ర

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ కళాశాల నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

10-12-2011 శనివారం

చేబ్రోలు మండలం
* విజ్ఞాన్ కళాశాల నుంచి యాత్ర ప్రారంభం
* వడ్లమూడి అడ్డరోడ్డు వద్ద వైఎస్ విగ్రహావిష్కరణ
* శేకూరు వయా గరువుపాలెం మూడు విగ్రహాల ఆవిష్కరణ
* వీరనాయకునిపాలెంలో విగ్రహావిష్కరణ
* శలపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* సుద్దపల్లిలో విగ్రహావిష్కరణ
* ఎస్సీ కాలనీ(శివారు)లో విగ్రహావిష్కరణ
* వేజెండ్లలో పర్యటన
* చర్చి సెంటర్‌లో విగ్రహావిష్కరణ
* వడ్డెర బజార్‌లో విగ్రహావిష్కరణ
* యాదవపాలెంలో విగ్రహావిష్కరణ
* బ్రహ్మంగారిదిబ్బ వద్ద విగ్రహావిష్కరణ
* మాణిక్యాలరావు కొట్టు వద్ద రెండు విగ్రహాల ఆవిష్కరణ
* ముస్లింపేటలో విగ్రహావిష్కరణ
* కొత్త వెంకటరెడ్డి కొట్టు సెంటర్‌లో విగ్రహావిష్కరణ
* ఊరబావి సెంటర్‌లో విగ్రహావిష్కరణ, బహిరంగసభ
* ఎస్సీ కాలనీలో రెండు విగ్రహాల ఆవిష్కరణ

చేబ్రోలులో ఘనస్వాగతం..

అభిమానానికి కొలమానం లేదు. అది గుండె లోతుల్లోంచి పుడితే దాని విలువ లెక్కించతరం కాదు. ఆ మహానేత తనయుడు ఓదార్పు యాత్రలో పల్లె తలుపులు తడుతున్న సమయంలో కనిపిస్తున్నది అదే! ఆత్మీయ తోరణాలు కట్టిన ఊరూరా.. పూలదారిలో నడిపించాలని.. జననేతను కళ్లారా చూడాలని.. నోరారా పలకరించాలని.. ఒక్కసారి చేతిని తాకాలని.. ఏదైనా తినిపించాలని.. ఆ జ్ఞాపకాన్ని పదిలం చేసుకోవాలని.. తమ సమస్యలు విన్నవించాలని.. పసిపిల్లల నుంచి పండుటాకుల వరకు ఒక్కొక్కరు ఒక్కోలా పడుతున్న ఆతృతను ఏమని వర్ణించగలం. ఎంతని చెప్పగలం! ఆ అవినా‘భావం’ అనుభవపూర్వకంగానే అర్థమవుతుంది.

చేబ్రోలు, న్యూస్‌లైన్ : అడుగడుగునా జన నీరాజనాల నడుమ శుక్రవారం ఓదార్పు యాత్ర కొనసాగింది. చేబ్రోలు మండలంలో 30 కిలోమీటర్లు ప్రయాణించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 14 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఉదయం విజ్ఞాన్ కళాశాల నుంచి ఆయన ఓదార్పు యాత్రకు పయనమయ్యారు. తొలుత వడ్లమూడి మెయిన్ సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం గ్రామంలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జెండా చెట్టు సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చేబ్రోలులో ఘనస్వాగతం..
చేబ్రోలు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. వరికుప్పలు వేస్తున్న కూలీలతో జగన్ మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేబ్రోలు ప్రధానసెంటర్‌లో జగన్ ప్రసంగించారు. తర్వాత చీలిపాలెం చేరుకుని ఎస్సీకాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హోసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పాతరెడ్డిపాలెం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. జోసఫ్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్థానిక లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. తర్వాత రిటైర్డు కండక్టర్ గుంటూరు వెంకటేశ్వరరెడ్డి ఇంటికి అల్పాహార విందుకు హాజరయ్యారు. 

కొత్తరెడ్డిపాలెం చేరుకుని.. 
కొత్త రెడ్డిపాలెం చేరుకున్న జగన్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తదనంతరం యంగ్‌ఇండియా కాన్వెంట్ నిర్వాహకులు చల్లా వెంకటేశ్వరరెడ్డి ఏర్పాటుచేసిన అల్పాహార విందు కు హాజరయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీతారామస్వామి దేవస్థానంలో, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత మాదిగపల్లి చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత చెన్నారెడ్డి కాలనీలో మరో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడినుంచి సుగాలి కాలనీ చేరుకుని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. షెడ్యూల్‌లో లేనప్పటికీ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు చెరువులపాలెం చేరుకుని అక్కడ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గొడవర్రు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడినుంచి గుండాలవరం మీదుగా నారాకోడూరు చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎస్సీకాలనీ చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత స్థానిక చర్చిలో ప్రార్థనలు చేసి, మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి వడ్లమూడిలోని విజ్ఞాన్ కళాశాలలోని అతిథి గృహానికి రాత్రిబసకు చేరుకున్నారు. 

పాల్గొన్న పార్టీ నేతలు..
విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ, ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలసిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, నగర కన్వీనర్ అప్పిరెడ్డి, పార్టీ నాయకులు మారుపూడి లీలాధర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ యాసిన్, రూత్‌రాణి, దాసరి నారాయణరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, మహ్మద్ నజీర్, ఆళ్ల శ్రీనివాసరెడ్డి పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కోతకొచ్చిన వరి కోయాలంటేనే రైతు భయపడుతున్నాడు

*కోతకొచ్చిన వరి కోయాలంటేనే రైతు భయపడుతున్నాడు
*గిట్టుబాటు లేని పంటనమ్మి అప్పులెలా కట్టాలని కన్నీళ్లు పెడుతున్నాడు
* పొద్దు పొడవక ముందే పనికి పోయినా రైతు కూలీలకు రూ.100 గిట్టట్లేదు
* వారి కోసం అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు ఆ విషయంపై మాట్లాడింది గోరంత
* మహానేతను అప్రదిష్టపాలు చేయడానికి మాట్లాడింది కొండంత
*మా ఎమ్మెల్యేలు రైతన్నకోసం పదవుల త్యాగానికీ సిద్ధపడ్డారు


ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవాళ బస్తా వరి ధాన్యానికి రూ.720 మించి పలకడం లేదు.. కోతకొచ్చిన వరిని కోయాలంటేనే రైతన్నలు భయపడిపోతున్నారు. రూ.720కు వడ్లు అమ్ముకొని అప్పులెలా కట్టాలి? పిల్లలను ఎట్టా చదివించుకోవాలి దేవుడా! అని రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారు? ఒక్క వరి రైతులే కాదు.. పొగాకు.. చెరుకు.. పసుపు.. పత్తి... ప్రతి రైతుదీ ఇదే దారుణమైన పరిస్థితి. సాగు చేసిన రైతులకు కష్టాలు, నష్టాలు, అప్పులే మిగులుతున్నాయి. చావే దిక్కవుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

అక్కా చెల్లెమ్మలు సూర్యుడు లేవక ముందే లేచి పొలానికి పోయి రాత్రి 7 గంటల వరకు నడుములు విరిగేలా పనిచేసినా రూ.100 కూడా కూలీ గిట్టని అధ్వాన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్ర 37వ రోజు శుక్రవారం ఆయన చేబ్రోలు మండలంలోని పల్లెల్లో పర్యటించారు. 12 వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు.

పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
రైతుల గురించి బాబు మాట్లాడింది ఇంత..: అసెంబ్లీ జరిగితే చంద్రబాబు నాయుడుగారు రైతుల కోసం అవిశ్వాసం పెడతానని గొప్పగా చెప్పారు. మొన్ననే అసెంబ్లీ జరిగింది. ఆశగా అందరం చూశాం. అవిశ్వాసం పెట్టడానికి ముందు ఆయన ఏం మాట్లాడుతారో? అని నిద్రాహారాలు మానుకొని అందరం టీవీల ముందు కూర్చొని అర్ధరాత్రి వరకు చూశాం. తీరా చూస్తే ఆయన రైతుల గురించి మాట్లాడింది.. ఇంత(వేలుతో అంగుళం చూపిస్తూ)! దివంగత నేత వైఎస్సార్‌ను అప్రదిష్టపాలు చేయడానికి మాట్లాడింది ఇంత(చేతులు బారుగా చాచి)! చంద్రబాబు గారి నైజమే అటువంటిది. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాలే ఆలోచన చేస్తారు. ఏ పని చేసినా దానివల్ల నాకేంటి లాభం అనే ఆలోచనతోనే ఆయన రాజకీయాలు ముందుకు పోతాయి. సొంత కూతురును ఇచ్చిన మామ ఎన్టీ రామారావునే పదవుల కోసం.. అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారి గురించి అంతకంటే ఎక్కువ ఆలోచన చేయలేం.

తులసి మొక్కల్లా పెరుగుదాం అని చెప్పా..: చంద్రబాబు గారు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా కూడా.. నేనైతే ఇక్కడి నుంచి(గుంటూరు) వెళ్లేటపుడే చెప్పి పోయా. జరుగుతున్నది అవిశ్వాస తీర్మానం. నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు తెలిపితే డిస్‌క్వాలిఫై అవుతారు. డిస్‌క్వాలిఫై అయితే ఉప ఎన్నికలు జరగుతాయి. ఇవి అన్నీ తెలిసి కూడా నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లా.. వాళ్లను పిలిపించుకొని మాట్లాడా! ప్రతి ఒక్కరికీ ఒక విషయం చెప్పా. ‘మనం ప్రజల్లో ఉన్నాం.. ప్రజలు మనలను చూస్తున్నారు. విలువలు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థలో ఒక తులసి మొక్కలా మనం పెరగాలి’ అని చెప్పా. ఇవాళ రైతన్న పరిస్థితి దారుణంగా ఉంది. రైతు కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీళ్ల కోసం మనం తోడుగా నిలబడలేకపోతేమటుకు ఈ రాజకీయ వ్యవస్థ ఉండటమే దండగ అని చెప్పా. నేను చెప్పిన ప్రతి మాటను కూడా ఎమ్మెల్యేలు గౌరవించారు. పదవులు పోతాయని తెలిసి కూడా... రైతన్నలకు తోడుగా, అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు.

చేబ్రోలు, న్యూస్‌లైన్ : వడ్లమూడి నుంచి చేబ్రోలు వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ని రైతులు ఆపి తమ గోడు చెప్పుకున్నారు. ఎకరానికి రూ.22 వేలు ఖర్చు పెట్టామని, ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని చేబ్రోలుకు చెందిన రైతు ఉగ్గం నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు సమస్యలు తీర్చేందుకే పనిచేస్తున్నట్టు జగన్ వారికి తెలిపారు. కూలి రేట్లు ఎలా ఉన్నాయంటూ పక్కనే ఉన్న కూలీలను అడిగారు. రోజుకు వంద రూపాయిలిస్తున్నట్టు మహిళా కూలీలు తెలిపారు. 

కూలి గిట్టుబాటవుతుందా..
వడ్లమూడి నుంచి చేబ్రోలు వస్తున్న సమయంలో జగన్ కాన్వాయ్‌ని చూసిన కూలీలు పరుగున రోడ్డుపైకి వచ్చారు. వరి కుప్ప వేస్తే ఎకరాకు ఎంత కూలి ఇస్తున్నారు.. పెరిగిన నిత్యావసరాల ధరల ప్రకారం కూలి గిట్టుబాటు అవుతుందా.. లేదా.. రోజుకూలి కుటుంబ పోషణకు సరిపోతుందా.. అంటూ జగన్ ప్రశ్నించారు. అంతంతమాత్రం ఆదాయంతోనే రోజులు నెట్టుకొస్తున్నామని కూలీలు జగన్‌కు చెప్పారు. ఈ ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని, వైఎస్ జీవించి ఉంటే బతుకులు మారేవని జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు.

అవ్వా.. ఎలాఉన్నావు
చేబ్రోలు, న్యూస్‌లైన్: చేబ్రోలు నుంచి పాతరెడ్డిపాలెం వెళ్లే దారిలో చీలిపాలెం వద్ద వృద్ధులు జననేత జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ‘నాయనా నువ్వు చల్లగా ఉండాలయ్యా.. మీ నాన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొనసాగాలంటే నువ్వు ముఖ్యమంత్రివి కావాలి..’ అని దీవించారు. జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి కొద్దిసేపు మాట్లాడారు.

మా ఊరికి రావాల్సిందే..
చేబ్రోలు, న్యూస్‌లైన్: కొత్తరెడ్డిపాలెం నుంచి చేబ్రోలు వైపు వెళుతున్న జగన్ కాన్వాయ్‌ను గొడవ ర్రుకు చెందిన వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు నిలిపివేసి తమ గ్రామానికి రావాలని పట్టుబట్టారు. మూడు ట్రాక్లర్లలో వచ్చిన వారంతా కాన్వాయ్ ముందు బైఠాయిం చారు. ఆ గ్రామానికి వెళ్లేందుకు జననేత అంగీకరించడంతో అభిమానులు కేరింతలు కొట్టి జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

అభిమానమంటే అదే..
చేబ్రోలు, న్యూస్‌లైన్: కొత్తరెడ్డిపాలెం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చల్లా వెంకటేశ్వరరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు అక్కడికి చేరుకుని జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. జననేత అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అదే గ్రామంలో అభిమానుల కోరిక మేరకు జగన్ ఎండ్లబండి ఎక్కారు. 

ఆకట్టుకున్న వైఎస్ వేషధారి
చేబ్రోలు, న్యూస్‌లైన్: చేబ్రోలులోని పాతరెడ్డిపాలేనికి చెందిన మంచాల బిక్షాలు, వైఎస్ వేషధారణతో ఆకట్టుకున్నాడు. అభివాదం చేస్తూ పిల్లలను, వైఎస్ అభిమానులను ఎంతగానో ఆకర్షించాడు. వైఎస్సార్ పుట్టినరోజునే తన పుట్టినరోజు కూడా అని బిక్షాలు చెప్పాడు. ఓదార్పుయాత్ర జరిగే ప్రాంతాల్లో తాను వైఎస్ వేషధారణలో పాల్గొంటున్నట్లు తెలిపాడు.

మాదీ పులివెందులే..
చీలిపాలెం (చేబ్రోలు), న్యూస్‌లైన్: జననేత జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు చీలిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డుకిరువైపులా నిలబడ్డారు. జగన్ తన కాన్వాయ్‌ను ఆపించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయిని జగన్‌నుద్దేశించి ‘అన్నా! నాదీ పులివెందులే..’ అని చెప్పారు. స్పందించిన జననేత.. విద్యార్థులు బాగోగులను తెలుసుకుని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆమెకు సూచించారు.

జగనన్నను చూశాం..
చేబ్రోలు, న్యూస్‌లైన్: కొత్తరెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు విద్యార్థులు ప్రహరీలు, దేవాలయం గేట్లు ఎక్కారు. జై జగన్ అంటూ.. తమ అభిమానం చాటుకున్నారు. జగన్ అభివాదం చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. జగనన్నను చూశాం.. అంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. చేబ్రోలు నుంచి పాతరెడ్డిపాలెం వెళ్తున్న జగన్ మోహన్‌రెడ్డిని చూసేందుకు ఏబీఎం పాఠశాల, ఆర్సీఎం పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు రోడ్డుకిరువైపులా బారులు తీరారు. జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. అడిగిన వారందరికీ ఆటోగ్రాఫ్‌లిచ్చారు.

భక్తిప్రపత్తులు
వడ్లమూడి (చేబ్రోలు), న్యూస్‌లైన్: కొత్తరెడ్డిపాలెంలోని శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు జగన్‌కు స్వాగతం పలికి ఆలయానికి తీసుకెళ్లారు. స్వామి దర్శనం అనంతరం జననేత సమీపంలో ఉన్న గ్రామ బొడ్రాయి వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చర్చి, మసీదుల్లో.. వడ్లమూడిలోని దర్గాలో శుక్రవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పాత రెడ్డిపాలెం ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చిలో ఫాదర్ మణిబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి జననేతకు ఆశీర్వచనాలు అందించారు.

స్థానిక సమస్యలు జననేత దృష్టికి..
చేబ్రోలు, న్యూస్‌లైన్: చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త, పాతరెడ్డిపాలేల్లో పర్యటించినప్పుడు గ్రామ ప్రత్యేక అధికారుల పనితీరుపై జగన్‌మోహన్‌రెడ్డి ఆరాతీశారు. పలుచోట్ల కాన్వాయ్‌ని ఆపి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి.. తాగునీరు సక్రమంగా అందుతుందా.. లేదా.. అంటూ ప్రశ్నించారు. కాలువలు పాడయిపోవడంతో ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మహిళలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. 

ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి
చేబ్రోలు, న్యూస్‌లైన్: కొత్తరెడ్డిపాలెంలో జగన్ పర్యటిస్తున్న సమయంలో ప్రధాన రహదారుల్లో పలువురు మహిళలు కాన్వాయ్‌కి ఎదురొచ్చి గుమ్మడికాయలతో జగన్‌కు దిష్టి తీశారు. మంగళహారతులిచ్చి జేజేలు పలికారు. రేయనక, పగలనక అలుపెరగకుండా ఓదార్పుయాత్ర నిర్వహిస్తున్న జగనన్నను దేవుడు చల్లగా చూడాలంటూ దీవించారు.

బిడ్డా గెలుపు నీదే..
చేబ్రోలు, న్యూస్‌లైన్: ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేబ్రోలు సుగాలి కాలనీకి చేరుకున్నారు. అక్కడ కాలనీకి చెందిన పాలకొల్లు గౌరీశ్వరమ్మ (76) జననేతను వద్దకు వెళ్లి ‘బిడ్డా.. వచ్చే ఎన్నికల్లో గెలుపు నీదే.. మేమంతా నీకు అండగా ఉంటాం.. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలి..’ అంటూ దీవించింది. ఆప్యాయతతో ఆ అవ్వను నుదుటిపై ముద్దాడి జననేత ముందుకు కదిలారు.

జననేత సమక్షంలో జన్మదిన వేడుక 
చేబ్రోలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారూరి రామలింగారెడ్డి శుక్రవారం తన పుట్టినరోజును వైఎస్ జగన్ సమక్షంలో జరుపుకొన్నారు. విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆయన జననేతను కలిశారు. ఆయన రామలింగారెడ్డికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రామలింగారెడ్డి వెంట ఆయన సతీమణి శైలజ, పార్టీ నాయకుడు నరసింహారావు తదితరులున్నారు.

బాబు అక్రమాస్తుల కేసులో మరో మలుపు

మరో ధర్మాసనానికి అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తికి నివేదన
జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగింత, సోమవారం విచారణ
‘నాట్ బిఫోర్’పై విజయమ్మ తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ అభ్యంతరం
ఆ విధానం రాజ్యాంగ విరుద్ధం, ఏ అధికరణ కింద అమలు చేస్తున్నారు?
దానివల్లే కేసు మీ ముందుకొచ్చింది, అందుకే మీ ముందు వాదించను
సీబీఐ విచారణకు ఉత్తర్వులిచ్చిన ధర్మాసనమే కేసును విచారించాలి
జస్టిస్ ఈశ్వరయ్య ధర్మాసనానికి సుశీల్‌కుమార్ స్పష్టీకరణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమాస్తుల కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ బాబు, ఆయన బినామీలు వేర్వేరుగా దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్లను విచారించేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కూడా నిరాకరించింది. కేసును మరో ధర్మాసనానికి నివేదించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.లోకూర్‌కు విజ్ఞప్తి చేసింది. దాంతో న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనానికి ఈ కేసు విచారణ బాధ్యతలను సీజే అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం గం. 2.15కు విచారణ జరగనుంది. బాబు కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన రిలయన్స్‌లో తనకు వాటాలున్నాయని సీజే పేర్కొనడం, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నుంచి వైదొలగడం, జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి కేసును అప్పగించడం తెలిసిందే. దాంతో బాబు అక్రమాస్తుల కేసు శుక్రవారం ఉదయం జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, జస్టిస్ కె.ఎస్.అప్పారావులతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. విజయమ్మ పిటిషన్ దాఖలు నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ ధర్మాసనం ముందుంచారు. ‘‘నిజానికి ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన (జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన) ధర్మాసనమే వాటి రద్దు పిటిషన్‌ను పరిశీలించాలే తప్ప, మరో ధర్మాసనం కాదు. పైగా సీబీఐ విచారణ ఉత్తర్వులపై రామోజీరావు, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా కోర్టు వారికి స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు ఉత్తర్వులిచ్చిన ధర్మాసనం ముందుకు వెళ్లి తేల్చుకోవాలని చెప్పిందే తప్ప, మరో ధర్మాసనం వద్దకు వెళ్లమనలేదు’’ అని చెప్పారు. జస్టిస్ ఈశ్వరయ్య, సుశీల్‌కుమార్‌ల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన సంభాషణలు ఇలా ఉన్నాయి...

జస్టిస్ ఈశ్వరయ్య: ఈ రోజు ఓ పత్రికలో (సాక్షి) వార్తా కథనం ప్రచురితమైంది. నేను దాన్ని చదివాను. మీరు దానిని చదివారా? మీ వాదనలు ఆ కథనానికి కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. ఈ కేసును మా ధర్మాసనానికి ఎందుకు నివేదించారన్న విషయం మీకు తెలుసా?

(టీడీపీతో జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబానికున్న ప్రత్యక్ష సంబంధాలను గురువారం నాటి ఆ కథనంలో సాక్షి ప్రచురించింది. ఆయన భార్య శ్యామలాదేవి గతంలో టీడీపీ జడ్పీటీసీగా, మహిళా అధ్యక్షురాలిగా చేయడాన్ని, ఆయన కుటుంబ సభ్యులు పలువురు ఇప్పటీకీ నల్లగొండ జిల్లాలో పార్టీలో క్రియాశీలంగా ఉండటాన్ని ప్రస్తావించింది).

సుశీల్‌కుమార్: ఆ వార్తా కథనాన్ని నేను చదవలేదు. దాని గురించి ఇప్పుడే ఎవరో చెబితే విన్నాను. వాస్తవానికి నాకు తెలుగు రాదు. నేను ఆంగ్ల పత్రికలు మాత్రమే చదువుతాను. ఈ కేసు ఈ ధర్మాసనం ముందు విచారణకు రాబోతోందని రెండు ఆంగ్ల పత్రికలు చదివాకే తెలిసింది. కేసును మరో ధర్మాసనానికి నివేదిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న (గురువారం) చెప్పారు. అందుకు గల కారణాలకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు.

జస్టిస్ ఈశ్వరయ్య: ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల వల్ల ఈ కేసు మా ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ కేసుతో సంబంధమున్న న్యాయవాదులు పలు ధర్మాసనాల్లోని న్యాయమూర్తుల ముందు నాట్ బిఫోర్‌గా ఉండటంతో మా ధర్మాసనానికి నివేదిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సుశీల్‌కుమార్: ఒక న్యాయమూర్తి ముందు నాట్ బిఫోర్ అన్న కారణంతో సదరు న్యాయవాది కేసును విచారించబోమనడం రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదు. నా ఉద్దేశం ప్రకారం అది రాజ్యాంగ విరుద్దం. అసలు రాజ్యంగంలోని ఏ అధికరణ కింద ఈ నాట్‌బిఫోర్ విధానం అమలవుతోంది? ఈ విధానానికి చట్టపరంగా ఎలాంటి విలువా లేదు.

జస్టిస్ ఈశ్వరయ్య: మీరు ప్రధాన న్యాయమూర్తిని నిందిస్తున్నారా? ఏ కేసును ఎక్కడ వేయాలన్న విషయంలో ఆయనదే అంతిమ నిర్ణయమని మీకు తెలుసు కదా!

సుశీల్‌కుమార్: ప్రధాన న్యాయమూర్తిని నేను నిందించడం లేదు. అలా ఎన్నటికీ చేయను. ఏ కేసును ఎక్కడ వేయాలన్న అంతిమ నిర్ణయం ఆయనదేనని నాకు తెలుసు. కానీ నాట్ బిఫోర్ విధానం ఆధారంగా కేసులను ధర్మాసనాలకు నివేదించరాదు. అలా చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. ఈ విషయాన్ని ఎన్నిసార్లైనా చెప్పగలను.

జస్టిస్ ఈశ్వరయ్య: సీజే ఈ కేసును పాలనపరమైన ఉత్తర్వుల ద్వారా పారదర్శకంగా మా ముందుంచారు.

సుశీల్‌కుమార్: ఈ కేసును విచారిస్తామని మీరంటే అందుకు మాకు అభ్యంతరం లేదు. మా వాదనలు వినిపించే ముందు నాట్ బిఫోర్ విధానాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం. పిటిషనర్ రూ.2 వేలు డిపాజిట్ చేస్తే తప్ప కేసును విచారించరాదని 1963కు ముందు సుప్రీంకోర్టులో ఓ నిబంధన ఉండేది. దాన్ని సవాలు చేయగా, ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టే దాన్ని కొట్టివేసింది. ఈ ధర్మాసనం ఇప్పటికీ నాట్ బిఫోర్ విధానాన్ని సమర్థించుకుంటే, నేను మీ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించను.

జస్టిస్ ఈశ్వరయ్య: మీరు నన్ను భయపెడుతున్నారు?

సుశీల్‌కుమార్: లేదు, లేదు. నేను భయపడుతున్నాను. నా కేసు గురించి, నా హక్కుల గురించి మీకు వివరిస్తున్నాను. ఈ కేసును మీ ముందు వాదించబోనని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. రాజ్యాంగ నిబద్ధత గురించే నేను ఆందోళన చెందుతున్నాను. నాట్ బిఫోర్ విధానం రాజ్యాంగ విరుద్ధం. అంతర్గత సౌలభ్యం కోసమే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీబీఐ విచారణ ఉత్తర్వులను బాబు తదితరులు సవాలు చేస్తున్నారు. మొదట ఈ కేసును విచారించి ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనమే తన ఉత్తర్వుల్లోని తప్పొప్పులను నిర్ణయించగలదు. అలాంటప్పుడు ఆ ధర్మాసనమే విచారించాలి. అంతేకానీ రోస్టర్ ద్వారా కాదు. రెండు రోజుల క్రితం 2జీ స్పెక్ట్రం కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వచ్చింది. వెంటనే ఆయన ఆ కేసును అంతకు ముందు విచారించిన ధర్మాసనానికే నివేదించాలని రిజస్ట్రీని ఆదేశించారు. మరోసారి చెబుతున్నాను.. నాట్ బిఫోర్ విధానం రాజ్యాంగ విరుద్ధం. ఒకసారి వాదనలు విని ఉత్తర్వులు జారీ చేసిన తరువాత, మరోసారి మరో ధర్మాసనం ముందు కారణం లేకుండా వాదనలు వినిపించడం ఎంతమాత్రం సరికాదు. కావాలంటే రిట్ నిబంధనలు చూసుకోండి.

దీంతో జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం దాదాపు 10 నిమిషాల పాటు ఉత్తర్వులు వెలువరించింది. కేసును తామెందుకు విచారించడం లేదో వాటిలో వివరించింది. కేసును మరో ధర్మాసనానికి నివేదించాలని సీజేను కోరుతున్నట్టు అనంతరం ఇరుపక్షాల న్యాయవాదులకు తెలిపింది. తరవాత కేసు ఫైళన్నింటినీ రిజిస్ట్రీ వర్గాలు సీజే ముందుంచాయి. విచారణ బాధ్యతలను జస్టిస్ రోహిణి ధర్మాసనానికి ఆయన అప్పగించారు.

పిఆర్ పి విప్ జారీచేయడం ఏమిటి?: శోభానాగిరెడ్డి

Written By ysrcongress on Friday, December 9, 2011 | 12/09/2011

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వ్యక్తులు తనకు విప్ ఎలా ఇస్తారని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాము ఓటింగ్ కు వెళ్లామని ఆమె చెప్పారు. తనకు పిఆర్ పి విప్ జారీ చేయడం హాస్యాస్పదమన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వంగా గీత కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యురాలని, ఆమె పిఆర్ పి పేరుమీద తనకు విప్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అన్నిటికీ సిద్ధమయ్యే శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమె చెప్పారు. 

పిఆర్ పి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన సమయంలో తనకు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఇష్టంలేదని ఎన్నికల సంఘానికి తెలిపినట్లు ఆమె చెప్పారు. తనని స్వతంత్ర శాసనసభ్యురాలిగా గానీ లేదా పిఆర్ పి సభ్యురాలిగా గానీ ఉండనివ్వమని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆమె వివరించారు. తన పిటిషన్ ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లో ఉందన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీసెల్ కన్వీనర్ గా రెహ్మాన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్సీ హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ ని నియమించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నియామక పత్రాన్ని పార్టీ కార్యాలయంలో ఈరోజు రెహ్మాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడారు. పేదలకు, విద్యార్థులకు, మైనార్టీలకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
Habeeb Abdul Rahman Al-Attas
చేబ్రోలులో మహానేత విగ్రహావిష్కరణ


గుంటూరు: చేబ్రోలులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పుయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు, రైతు కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. పేదలు, విద్యార్థులు ఎవరినోట విన్నా ఆ మహానేత డాక్టర్ వైఎస్ బతికి ఉంటే బాగుండేదని వినిపిస్తోందన్నారు. సమయం లేనందు ఎక్కవసేపు మాట్లాడలేనని, అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కొత్తరెడ్డిపాలెంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ


గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది.

Popular Posts

Topics :