11 December 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్రవ్యాప్తంగా రైతు సదస్సులు

Written By news on Saturday, December 17, 2011 | 12/17/2011

ఈ నెల 23న జాతీయ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లోటస్ పాండ్ లో జరిగిన ఆ పార్టీ కేంద్ర పాలక మండలి(సిజిసి) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తరువాత పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

ప్రభుత్వం కళ్లు తెరిచేలా రైతు సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు.విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై వచ్చే నెల 4వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఒంగోలులో జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాల్గొంటారు.స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని అంబటి తెలిపారు. 108,104 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

odharpu 16/12/11

రెండో విడత ఓదార్పు యాత్ర శుక్రవారంతో పూర్తయింది.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత ఓదార్పు యాత్ర శుక్రవారంతో పూర్తయింది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 44 రోజులపాటు 1146.5 కిలోమీటర్లు పర్యటించిన జననేత.. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన 22 మంది అభిమానుల కుటుంబాలను ఓదార్చారు. అలాగే 389 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్టోబర్ 16న మంగళగిరి నియోజకవర్గంలోని సీతానగరంలో ప్రారంభమైన తొలివిడత యాత్ర దీపావళి సందర్భంగా ఒకరోజు విరామంతో నవంబర్ 2న రేపల్లె వరకు సాగింది. తిరిగి నవంబర్ 16న రెండో విడత యాత్ర రేపల్లె నుంచి ప్రారంభమై శుక్రవారం తాడికొండ మండలం సిరిపురంలో ముగిసింది. సర్కారుపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రెండో విడతలో వైఎస్ జగన్ డిసెంబర్ 3 నుంచి 6 వరకు యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. మొత్తం రెండు విడతల షెడ్యూల్‌లో మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు, ప్రత్తిపాడు(ప్రత్తిపాడు మండలం మినహా), తాడికొండ(ఫిరంగిపురం మండలం మినహా) నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర పూర్తయింది.న్యాయానికీ.. ధర్మానికీ గోరీ: జగన్

కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలసికట్టుగా వైఎస్‌పై కుట్ర చేస్తున్నారు: వైఎస్ జగన్*కలిసి కోర్టుల దాకా వెళ్లి కోర్టుల్లో కేసులు కూడా వేశారు
*చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట.. బతికున్న చంద్రబాబుకు ఒక న్యాయమట!
* ఇంత దుర్మార్గమైన పరిపాలన చూస్తుంటే బాధనిపిస్తోంది

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: 
‘‘ఇవాళ కాంగ్రెస్ పెద్దలు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై న్యాయానికీ, ధర్మానికీ, రాజకీయ విలువలకూ గోరీ కడుతున్నారు. వైఎస్సార్‌పై బురదజల్లేందుకు కలసికట్టుగా కుట్రలు చేస్తూ పట్టపగలే అధికార దుర్వినియోగం చేస్తున్నారు. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయమట.. బతికున్న చంద్రబాబుగారికి ఒక న్యాయమట.. ఇంత దుర్మార్గమైన పరిపాలనను చూస్తుంటే బాధనిపిస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 44వ రోజు శుక్రవారం ఆయన మేడికొండూరు మండలంలోని మూడు గ్రామాల్లో పర్యటించారు. 12 వైఎస్సార్ విగ్రహాలను(ఒక్క మందపాడులోనే ఆరు) ఆవిష్కరించారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికొన్ని గ్రామాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ ప్రజలు ఆయనతో కరచాలనం చేసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ఎక్కడికక్కడ పోటీ పడటంతో యాత్రలో ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో షెడ్యూల్‌లో ఓ గ్రామ పర్యటన రద్దు చేశారు. అనంతరం జగన్ హైదరాబాద్ బయల్దేరారు. పలు గ్రామాల్లో జగన్ చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

విలవల్లేని రాజకీయం 
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. ఆయన చనిపోయిన తరువాత ఇదే వైఎస్సార్‌ను అప్రతిష్టపాలు చేయడానికని నైతిక విలువలన్నీ పక్కనబెట్టి చివరకు చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కుళ్లుతో కుతంత్రాలు పన్ని కలిసి కోర్టుల దాకా వెళ్లి కేసులు వేశారు. చనిపోయిన వ్యక్తిని అప్రతిష్టపాలు చేయడానికి వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ... ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ఇలాంటి విలువలులేని, విశ్వసనీయతలేని, ధర్మంలేని, న్యాయంలేని రాజకీయాలు చూస్తున్నపుడు బాధనిపిస్తోంది. చాలా చాలా బాధనిపిస్తోంది.

ఆ రోజే నిజమైన స్వాతంత్య్రం 
మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక స్వప్నాన్ని చూశారు. ఆ స్వప్నం పేరు రచ్చబండ. ఎవరికీ చెప్పకుండా ఏ పల్లెకైనా వెళ్లి అక్కడ రచ్చబండ మీద నిలబడి ఆ ఊరి గ్రామస్తులందరినీ ఆయన ఒక మాట అడగాలనుకున్నారు. ‘మీలో అర్హులై ఉండి పెన్షన్, ఇల్లు, బియ్యం కార్డు లేనివారు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందనివారు ఎవరైనా ఉన్నారా?’ అని అడగాలనుకున్నారు. అలా అడిగితే.. ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదని, అలాంటి రోజే నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు అని వైఎస్సార్ నమ్మారు. ఈ పాలకులు పేరుకు మాత్రం అదే రచ్చబండ అని పెట్టారు. అయితే వీరు పల్లెలకు పోరట. కేవలం మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో రచ్చబండలు పెట్టి వాళ్లకు తోచినట్లుగా ఇదిగో తీసుకో అని భిక్షమేసినట్లుగా వేస్తారట. ఇటువంటి పరిస్థితిలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. నా రాష్ట్రం ఇలాంటి పాలకుల చేతిలో ఉందా.. అని చాలా చాలా బాధనిపిస్తోంది.

షెడ్లలో లక్ష కోట్ల వ్యాపారం?

100 డాలర్ల ఈక్విటీ సంస్థకు 3 కోట్ల డాలర్ల రుణం ఇచ్చారట! 
మారిషస్ మార్గంలో నల్లధనం తీసుకొస్తున్న సుజనా గ్రూపు సంస్థలు 
విదేశీ సబ్సిడరీల నుంచి మాతృ సంస్థలకు రూ. 850 కోట్లు బదిలీ 
ఆ సంస్థల టర్నోవర్, విదేశీ బ్యాంకులు, రుణమూ అన్నీ బూటకమే! 
రుణం పేరుతో నల్లడబ్బు తెచ్చి తెల్లడబ్బుగా చలామణి చేస్తున్న వైనం
బినామీ బంధం: సుజనా సంస్థ కోసం చంద్రబాబు హెరిటేజ్ భూమి తాకట్టు..
చౌదరి ‘సేవలకు’ ప్రతిఫలంగా రాజ్యసభ సీటు.. దీని భావమేమి?

నిర్జీవ పదార్థం నుంచి జీవం పుట్టిందని సైన్స్ చెప్తుంది! కానీ.. ఆయన శూన్యం నుంచి వేల కోట్ల రూపాయల సొమ్ములు సృష్టించారు. శూన్యం నుంచే లక్ష కోట్ల రూపాయల రుణాలు పుట్టించారు. అదే శూన్యం నుంచి లక్ష కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు. ఆ శూన్య సామ్రాజ్యాన్ని విదేశాలకూ విస్తరించారు. అలా.. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశంలోకి తెల్లధనంగా ప్రవహింప చేసుకోవటానికి రాజమార్గం వేసుకున్నారు. ఆ మార్గంలో వందలు, వేల కోట్ల రూపాయలు రప్పిస్తున్నారు కూడా! ఇంత మేజిక్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరైనా కొమ్ములు తిరిగిన మెజీషియనా అంటే.. కాదు. కేవలం కాగితాలపై రాతలతో ఇంత గిమ్మిక్కు చేస్తున్న సదరు మహా మాయావి మరెవరో కాదు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా.. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబుకు బినామీగా జనమెరిగిన సుజనాచౌదరి! చంద్రబాబుకు చేస్తున్న ‘సాయానికి’ ప్రతిఫలంగా టీడీపీ నుంచి రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్న సుజనా చౌదరి.. అన్ని రకాల చట్టాలనూ తుంగలో తొక్కుతూ.. సెబీని, స్టాక్ ఎక్స్ఛేంజీలను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను ఏమారుస్తూ.. ఏళ్ల తరబడి నిరాఘాటంగా సాగిస్తున్న ఘరానా మోసమిది.

సుజనా గ్రూపు మాయాజాలంపై చాలా కాలం కిందటే అనేక దర్యాప్తు సంస్థల కన్నుపడింది. పలు సంస్థల నుంచి నోటీసులు, సమన్లు అందుకున్న చరిత్ర కూడా సుజనా వారికి ఉంది. అలా అందిన వాణిజ్య పన్నుల శాఖ నోటీసులకు గతంలో సమాధానం ఇస్తూ.. తాము చేసే వ్యాపారమంతా ఉత్తుత్తి వ్యాపారమేనని, కేవలం కాగితాలపై ఘనంగా చూపించుకోవటానికి రాసుకున్న బూటకపు పద్దులు మాత్రమేనని సుజనా గ్రూపు సంస్థలు స్వయంగా వెల్లడించాయి. కానీ.. ఏ దర్యాప్తు సంస్థ చర్యలూ కాగితాల పరిధి దాటలేదు. 

డి. శివరామిరెడ్డి, బిజినెస్ బ్యూరో: 

సత్యం కంప్యూటర్స్ మంచి వ్యాపారమే చేస్తుండగా.. దానిని మరింత పెద్దదిగా చూపేందుకు ఆ సంస్థ అధినేత రామలింగరాజు కాగితాల్లో టర్నోవర్ పెంచి చూపించారు. ఆ నేరానికి ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉన్నారు. ఇంకా ఆ కేసు కొనసాగుతోంది. కానీ.. సుజనాచౌదరి అసలు ఏ వ్యాపారమూ లేకుండానే.. పదుల సంఖ్యలో బోగస్ సంస్థలు సృష్టించి, ఆ సంస్థల మధ్యే లక్ష కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్లు టర్నోవర్ చూపించారు. విదేశాల్లో తమ సబ్సిడరీ సంస్థలకు కూడా ఇలాంటి బూటకపు టర్నోవర్ చూపి.. అక్కడి బ్యాంకులు తమకు రుణాలు ఇచ్చాయంటూ కోట్లాది రూపాయల నల్లధనాన్ని దర్జాగా తెల్లధనంగా దేశంలోకి తెస్తున్నారు. ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూసిన సుజనా మాయాజాలం వివరాలివీ... 

రూ. 5 వేల సంస్థలకు.. రూ. 850 కోట్ల రుణాలట! 

సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనా టవర్స్, సుజనా మెటల్స్.. అనే సంస్థలు సుజనాచౌదరిగా తెలిసిన వై.సత్యనారాయణచౌదరివి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదైన ఈ సంస్థలు ప్రధానంగా చేసే వ్యాపారం.. ఇనుము కొని అమ్మటం. అది కూడా రాష్ట్రంలోను, తమిళనాడులోనూ గల తమ గ్రూపు సంస్థలతోనే. ఆ సంస్థల వార్షిక నివేదికలు చూస్తే ఈ విషయం వెల్లడవుతుంది. సుజనా యూనివర్సల్‌కు వంద శాతం సబ్సిడరీ సంస్థగా 2007లో మారిషస్‌లో హెస్తియా హోల్డింగ్స్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేశారు. హెస్తియాలో సుజనా యూనివర్సల్‌కు ఒకే ఒక్క వాటా ఉంది. ఆ వాటా ముఖ విలువ 100 అమెరికన్ డాలర్లు. అంటే.. ఇది మన కరెన్సీలో 5,200 రూపాయలకు సమానం. ఈ 100 డాలర్ల విలువైన సంస్థకు.. మూడు విదేశీ బ్యాంకులు మూడు కోట్ల డాలర్లు (సుమారు రూ.150 కోట్లు) రుణం ఇచ్చాయని చెప్తున్నారు. ఇందులో.. కోటి డాలర్ల రుణాన్ని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), మరో రెండు కోట్ల డాలర్ల రుణాన్ని స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా)లు అందించాయట. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది. 

మాతృ సంస్థల ఖాతాలకు మళ్లింపు... 

హెస్తియా హోల్డింగ్స్ 2011 మార్చి నాటికి రూ. 46.33 కోట్ల వ్యాపారం చేసిందని టర్నోవర్ నమోదు చేశారు. నిజానికి దేశీయంగా తమ కంపెనీలు నమోదు చేసిన టర్నోవరే ఉత్తుత్తిదని సుజనా సంస్థలు అధికారికంగా అంగీకరించాయి. అలాంటిది వారు విదేశాల్లో నెలకొల్పిన సంస్థలు స్వదేశంలోని వారి బోగస్ కంపెనీలతో ఏ వ్యాపారం చేస్తాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంటే.. విదేశాల్లోనూ బూటకపు టర్నోవర్ చూపారన్నది స్పష్టమవుతోంది. హెస్తియా నమోదు చేసిన రూ. 46 కోట్ల టర్నోవర్ చూసి.. విదేశీ బ్యాంకులు రూ. 150 కోట్లు రుణంగా ఇచ్చాయని సుజనా సంస్థలు చెప్తున్నాయి. ఇదే తరహాలో సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ సంస్థలకు సబ్సిడరీ కంపెనీలుగా ఏర్పాటైన సుజనా హోల్డింగ్స్ (దుబాయ్), ఆల్ఫా వెంచర్స్ (కేమాన్ ఐలాండ్స్) కూడా విదేశీ బ్యాంకుల నుంచి రూ. 400 కోట్లు రుణం తీసుకున్నాయి. ఆ విదేశీ రుణానికి మాతృసంస్థలైన సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చాయి. ఆల్ఫా వెంచర్స్ సంస్థ మారిషస్ బ్యాంకు నుంచి మరో రూ. 300 కోట్లకు పైగా రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజనా టవర్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది. మొత్తం కలిపితే.. దాదాపు రూ. 850 కోట్లకు పైగా సొమ్ము విదేశీ రుణం పేరుతో సుజనా సంస్థల సబ్సిడరీ కంపెనీల ఖాతాల్లో చేరింది. ఆ సొమ్ము.. అక్కడి నుంచి.. గ్రూపు సంస్థల మధ్య క్రయవిక్రయాల పేరుతో హైదరాబాద్‌లోని మాతృ సంస్థలకు వచ్చి చేరింది. 

అది రుణమా? నల్లధనమా? 

విదేశీ రుణాల పేరుతో అక్కడి సబ్సిడరీ సంస్థలకు.. అక్కడి నుంచి లావాదేవీల పేరుతో స్వదేశంలోని మాతృ సంస్థలకు వచ్చి చేరుతున్నది.. నల్లడబ్బు అని, అది క్రయవిక్రయాల రూపంలో రావటంతో తెల్లడబ్బుగా మారిపోయిందని ఇట్టే అర్ధమవుతుంది. ఎందుకంటే.. కేవలం వంద డాలర్ల ఈక్విటీ ఉన్న సంస్థకు.. ఏకంగా మూడు కోట్ల డాలర్ల రుణాలు జారీ చేసినపుడు.. మారిషస్ బ్యాంకులు కనీస నిబంధనలు కూడా పాటించిన దాఖలాలు లేవు. ఏదైనా సంస్థ తమ గ్రూపులోని ఇతర సంస్థలకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తు (కార్పొరేట్ గ్యారంటీ) ఇవ్వాలంటే.. ముందుగా వాటాదారుల అనుమతి తీసుకోవాలి. కంపెనీల చట్టం 1956 లోని సెక్షన్ 372ఎ ప్రకారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా ఈ తీర్మానం ప్రతి ఆధారంగానే సదరు సంస్థకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయి. అయితే.. మారిషస్ బ్యాంకులు ఇలా వాటాదారుల అనుమతి సూచించే తీర్మానం లేకుండానే సుజనా సబ్సిడరీ సంస్థలకు దాదాపు రూ. 850 కోట్ల రుణాన్ని మంజూరు చేశాయట. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా) నుంచి హెస్తియా హోల్డింగ్స్ రూ. 150 కోట్ల రుణం తీసుకోవటానికి కార్పొరేట్ గ్యారంటీ సుజనా యూనివర్సల్ ఇచ్చింది. కానీ ఆ సంస్థ ఈ గ్యారంటీకి సంబంధించి తన వాటాదారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోలేదు. దానికి సంబంధించిన తీర్మానమూ చేయలేదు. రుణం మంజూరయిన తర్వాత సుజనా యూనివర్సల్ దానికి అనుమతి కోరుతూ వాటాదారుల తీర్మానం కోరటమే దీనికి సాక్ష్యం. సుజనా టవర్స్, సుజనా మెటల్స్ కూడా ఇలాగే వ్యవహరించాయి. అంటే.. ఆయా సంస్థల గ్యారెంటీకి సంబంధించి వాటాదారుల ముందస్తు అనుమతి, తీర్మానం లేకుండానే విదేశీ బ్యాంకులు రుణాలు ఇచ్చేశాయట! 

ఆ బ్యాంకులూ బోగస్సేనా? 

ఇదంతా చూస్తే.. అసలు వంద డాలర్లు, రెండు వందల డాలర్లు ఈక్విటీ గల సంస్థలకు.. ముందూ వెనుకా చూడకుండా కోట్లకు కోట్లు రుణాలిచ్చేసే బ్యాంకులు ఉన్నాయా అన్న అనుమానం కలగకమానదు. సదరు సంస్థలు చూపుతున్న టర్నోవర్ వాస్తవమైనదా కాదా అన్నది పరిశీలించుకోకుండానే.. చూపిన టర్నోవర్‌కూ మూడింతలు రుణాలు మంజూరు చేసే బ్యాంకులూ ఉంటాయా అన్న ఆశ్చర్యం కలగక మానదు. దీనినిబట్టి చూస్తే.. ఇక్కడ రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి.. సుజనా సంస్థలు చూపిన టర్నోవర్ లాగానే.. అవి చెప్తున్న విదేశీ బ్యాంకులు కూడా బోగస్‌వై ఉండాలి. అంటే.. లేని బ్యాంకులు ఉన్నట్లుగా చూపి.. ఆ బ్యాంకులు ఇవ్వని రుణాన్ని ఇచ్చినట్లుగా చూపి.. నల్లధనాన్ని రుణం పేరుతో చెలామణిలోకి తెచ్చుండాలి. లేదంటే.. ఒకవేళ అలాంటి బ్యాంకులంటూ ఉంటే.. అవికూడా నల్లడబ్బు లావాదేవీలకు, దళారీతనానికి కేరాఫ్ అడ్రస్‌లై ఉండాలి. నల్లధనానికి అడ్డాలైన కేమాన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్స్‌లలోని బ్యాంకుల్లో నల్లధనం దాచి.. ఆ బ్యాంకులతో కుమ్మక్కై.. ఆ నల్లధనాన్నే తమ సంస్థలకు రుణం రూపంలో తెచ్చుకుంటూ ఉండాలి. ఈ రెండు రకాలుగా కాకుండా.. సుజనా బోగస్ సంస్థలకు అన్ని వందల కోట్ల రూపాయలు రుణం లభించే అవకాశమే లేదు. ప్రస్తుతం ‘సాక్షి’ దృష్టికి వచ్చిన ఉదంతంలో రూ. 850 కోట్లు ఇలా విదేశాల నుంచి సుజనా సంస్థల్లోకి ప్రవహించినట్లు వెల్లడైంది. అయితే.. ఇలాంటి ‘నల్ల’కోణాలు మరిన్ని ఉన్నాయని.. వేల కోట్ల రూపాయలు ఈ మార్గం ద్వారా సుజనా సంస్థల్లోకి ప్రవహిస్తోందని సమాచారం. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించి, లోతుగా దర్యాప్తు చేస్తే కానీ.. ఎన్ని వేల కోట్ల నల్లధనానికి ఇలా తెలుపు రంగు వేసుకుని తెచ్చారన్నది తేటతెల్లంకాదు.


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సుజనాచౌదరిల మధ్య గల బంధం ఎలాంటిదో.. హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆ సంస్థ ఆస్తులను ఏ విధంగా కాజేశారో.. గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు అనుబంధ సంస్థగా హెరిటేజ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ అనే సబ్సిడరీ కంపెనీని సృష్టించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో హెరిటేజ్ ఫుడ్స్‌కు ఉన్న విలువైన 3.42 ఎకరాల భూమిని కేవలం రూ.2.73 కోట్లకు హెరిటేజ్ ఇన్‌ఫ్రాకు బదలాయించారు. ఈ వ్యవహారం జరిగే రోజుల్లో అంటే 2005 ప్రాంతాల్లో కొండాపూర్‌లో ఎకరా భూమి విలువ రూ.12 కోట్లు పైమాటే. అయితే హెరిటేజ్ ఇన్‌ఫ్రాలో చంద్రబాబు భార్య భువనేశ్వరికి 49 శాతం వాటా ఉంది. అందుకే కారుచౌకగా హెరిటేజ్ భూమిని ఇన్‌ఫ్రాకు బదలాయించారు. ఇక సుజనాచౌదరికి చెందిన శ్రీచక్ర మర్కండైజింగ్ లిమిటెడ్ పెద్దగా కార్యకలాపాలు లేని సంస్థ. తమిళనాడులో రూ.600 అద్దె దుకాణమే దీని కార్యాలయం. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక రుణాల సంస్థ సికామ్ లిమిటెడ్ దగ్గర సుజనా రూ.60 కోట్లు అప్పు తీసుకుంది. దీనికి హామీగా హెరిటేజ్ ఇన్‌ఫ్రా తన దగ్గరున్న 3.47 ఎకారాలను హామీగా పెట్టింది. అంటే.. హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన భూమిని.. సుజనా సంస్థల కోసం.. చంద్రబాబు తన సతీమణి ద్వారా తాకట్టుపెట్టించారన్న మాట. భూమి విలువ కూడా హెరిటేజ్ ఇన్‌ఫ్రా ఖాతాల్లో ఉన్నంత వరకు రూ.2.73 కోట్లుగా పేర్కొని, రుణ సంస్థ సికామ్ లిమిటెడ్ వద్ద తాకట్టు పెట్టినపుడు భూమి విలువను రూ. 85 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం తర్వాతే సుజనాచౌదరికి చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇచ్చారు. అంటే.. ఆ 60 కోట్లు ఎక్కడికి చేరాయో.. సుజనాచౌదరికి రాజ్యసభ సభ్యత్వం ఏ సేవకు ప్రతిఫలమో అర్థం చేసుకోవచ్చు!


మా టర్నోవర్ అంతా బూటకమే

వాణిజ్య పన్నుల శాఖ ఎదుట సుజనా గ్రూపు అంగీకారంచిన్న చిన్న షెడ్లలో మామూలు మెషీన్లు పెట్టుకుని నట్లు, బోల్టులు, టీఎంటీ బార్లు వంటి ఉక్కు ఉప ఉత్పత్తులను తయారు చేసుకునే సుజనా గ్రూప్ సంస్థలు.. రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు కర్మాగారమైన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీతో పోటాపోటీగా వ్యాపారం చేస్తున్నట్లు పద్దులు సృష్టించాయి. 2011 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సుజనా గ్రూపు సంస్థలైన సుజనా యూనివర్సల్, సుజనా మెటల్, సుజనా టవర్స్ అనే మూడు సంస్థల మొత్తం టర్నోవర్ రూ. 10,000 కోట్లు దాటినట్లు చెప్తున్నాయి. వైజాగ్ స్టీల్‌తో పోలిస్తే.. ఏ మూలకూ సరితూగని ఈ సుజనా సంస్థలకు అన్ని వేల కోట్ల టర్నోవర్ ఎలా సాధ్యమైంది? ఆ సంస్థల 2011 బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తే.. కంపెనీల సంస్థాపక సామర్థ్యానికి, అవి నమోదు చేసిన టర్నోవర్లకు ఎక్కడా పొంతన లేదు. ఉదాహరణకు.. సుజనా యూనివర్సల్ సంస్థలో బేరింగ్స్ స్థాపక సామర్థ్యం కోటి బేరింగ్‌లుగా ఉంటే.. నిజానికి ఒక్క బేరింగ్ కూడా ఉత్పత్తి చేయలేదు. స్టీల్ ఉత్పత్తుల విషయంలో ట్రేడింగ్ ద్వారా పది లక్షల టన్నుల వ్యాపారం చేసినట్లు లెక్కచూపారు. ఇతర ఉత్పత్తులు అంటూ మరో 40 లక్షల టన్నులు నమోదు చేశారు. ఈ ఇతర ఉత్పత్తులు ఏమిటనేది ఎవరికీ అంతుపట్టనిది. నిజానికి తాము కాగితాల్లో చూపే వ్యాపారమంతా ఉత్తుత్తిదేనని సుజనా సంస్థలే గతంలో స్వయంగా వాణిజ్య పన్నుల శాఖ వద్ద అంగీకరించాయి. ఈ విషయాన్ని హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ తన కౌంటర్ అఫిడవిట్‌లో వెల్లడించగా.. 2009లో ఇచ్చిన ఆ కేసు తీర్పులోనూ ధర్మాసనం యథాతథంగా ప్రస్తావించింది. ‘‘... షోకాజ్ నోటీస్‌కు పిటిషనర్ (సుజనా గ్రూపు సంస్థలు) సమాధానం ఇస్తూ.. తమ కొనుగోళ్లు, అమ్మకాలు కేవలం ఊహాజనితమని.. మంచి ఫలితాలు చూపటానికి, కంపెనీ టర్నోవర్‌ను పుస్తకాల్లో ఎక్కువగా చూపటానికి చేసిందేనని అంగీకరించారు. అంతేకాకుండా.. తాము వాణిజ్య పద్దు పద్ధతిని అనుసరిస్తామని.. ఎలాంటి విక్రయాలు జరగకుండానే, సరకుల రవాణా లేకుండానే అమ్మకపు బిల్లులు జారీచేస్తామని కూడా పేర్కొన్నారు. తమ కంపెనీలు ప్రకటించిన వ్యాపార సామర్థ్యాన్ని అందుకున్నట్లు చూపించేందుకు, తమ సంస్థల ఈక్విటీలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు.. వాస్తవంగా ఎలాంటి సరకులు తెచ్చిందీ, పంపించిందీ లేకపోయినా.. కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినట్లు లావాదేవీలు నమోదు చేశామని వారు వెల్లడించారు’’ అన్న విషయాన్ని ఉటంకించింది. సుజనా గ్రూపు సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించి కోట్ల రూపాయల్లో వాణిజ్య పన్నులు ఎగవేశాయని సంబంధిత శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులపై.. ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ విషయాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ అఫ్జల్‌పుర్కార్‌లతో కూడిన ధర్మాసనం 2009 జనవరిలో సుజనాచౌదరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వటం కొసమెరుపు!
 
లక్ష కోట్ల రెడీ క్యాష్..!

విదేశాల నుంచి రుణాల పేరుతో నల్లధనం తెచ్చుకుంటున్న సుజనాచౌదరి.. బోగస్ సంస్థలు, బూటకపు వ్యాపారాలతో స్వదేశంలోనూ బ్యాంకులకు లక్ష కోట్ల రూపాయల మేర టెండర్ పెట్టారు! వ్యాపార రుణాల పేరుతో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సమకూర్చుకున్నారు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని వందల కోట్లు కావాలంటే అన్ని వందల కోట్లు బ్యాంకుల నుంచి సమకూరేలా నెట్‌వర్క్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. అదెలాగంటే... 

సుజనా గ్రూపు సంస్థలు వాస్తవ లావేదేవీలేవీ లేకుండానే.. మొత్తం లక్ష కోట్ల మేర టర్నోవర్‌ను సృష్టించాయి. ఈ లావాదేవీలన్నీ కూడాగ్రూపులోని దాదాపు పాతిక సంస్థల మధ్యే నడిచినట్లు చూపాయి. ఈ సంస్థలన్నీ బోగస్ సంస్థలే. వాటికి వేర్వేరు చిరునామాలున్నా కూడా.. అన్ని సంస్థల కార్యకలాపాలు సుజనా గ్రూప్ కార్పొరేట్ కార్యాలయం నుంచే జరుగుతాయి. అంటే.. ఒక సంస్థ ఉత్పత్తులు తయారు చేయటానికి అవసరమైన ముడి సరుకును.. తన గ్రూపులోని మరో సంస్థ నుంచి కొన్ని వందల కోట్లు వెచ్చించి కొన్నట్లు కొనుగోలు బిల్లులు సృష్టిస్తారు. తయారు చేసిన ఉత్పత్తులను తమ గ్రూపులోనిదే మరో సంస్థకు విక్రయించినట్లు అమ్మకం బిల్లులు సృష్టిస్తారు. ఇదంతా ఒకే కార్యాలయంలో జరిగిపోతుంది. ఇలా లక్ష కోట్ల టర్నోవర్ చూపించారు. మంచి వ్యాపారం చేసే సంస్థలకు.. వాటి టర్నోవర్‌కు సరిసమానంగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. అంటే.. లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ చూపుతున్న సుజనా గ్రూపు సంస్థలకు.. అంత మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. అంటే.. సుజనా వారికి ఎప్పుడైనా ఓ వంద కోట్ల రూపాయలు కావాలంటే.. నేరుగా నడుచుకుంటూ వచ్చేస్తాయన్నమాట! అందుకు చేయాల్సిందల్లా.. తమ కంపెనీల మధ్య వంద కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు సింపుల్‌గా బిల్లులు పుట్టించటమే. వాటిని బ్యాంకులకు చూపి.. ఆ మొత్తాన్ని రుణం పేరుతో తెచ్చేసుకోవచ్చు. దానిని తీర్చాలంటే.. గడువు సమయానికల్లా మరో వంద కోట్ల రూపాయలకు బిల్లు పుట్టించి, ఆ బిల్లుతో మరో బ్యాంకు నుంచి వంద కోట్ల రుణం తెచ్చుకుని తీర్చేయవచ్చు. ఇలా మొత్తం లక్ష కోట్ల రూపాయల రెడీ క్యాష్! ఇది రిజర్వ్ బ్యాంకుకు కూడా అసాధ్యం. కానీ సుజనా వారికి అది జస్ట్.. కొన్ని బిల్లుల పని..! 
 
నాలుగేళ్ల కిందటే బయటపడ్డ బండారం...

సుజనా గ్రూపు బోగస్ సంస్థలను సృష్టించి.. వాటితో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసినట్లు నకిలీ పద్దులు రూపొందించి.. వాటితో బ్యాంకులను బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వైనాన్ని ప్రాంతీయ ఆర్థిక నిఘా మండలి నాలుగేళ్ల కిందటే కనిపెట్టింది. అలాంటి ఒక బ్యాంకు రుణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) స్థానిక అధికారులు కూడా తమ వంతు ‘సాయం’ అందజేసిన విషయమూ బయటపడింది. సుజనా గ్రూపుకు చెందిన హెండమ్ ఇండస్ట్రీస్ అనే సంస్థకు నిధులు సమకూర్చేందుకు నాఫెడ్ హైదరాబాద్ శాఖ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. హెండమ్ కోసం ఒమిక్రాన్ బయోజెనిసిస్, గోదావరి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థల (ఇవీ కూడా సుజనా గ్రూపువే) నుంచి ఇనుము, ఉక్కు కొంటున్నట్లు నాఫెడ్ రికార్డులు చూపింది. అలా నాఫెడ్ ‘సహకారం’తో సుజనా గ్రూపు సంస్థలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (మెయిన్ బ్రాంచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (అబిడ్స్), ఐసీఐసీఐ (బేగంపేట), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సైఫాబాద్)ల నుంచి దాదాపు రూ. 300 కోట్ల వరకూ రుణం కొట్టేశాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ప్రాంతీయ ఆర్థిక నిఘా మండలి నోడల్ అధికారుల సమావేశంలో తీవ్ర చర్చ కూడా జరిగింది. దీనిపై సీఐడీ దర్యాప్తు జరపాలని కూడా ఆ మండలి కోరింది. సుజనా మోసాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లూ వర్తాలొచ్చాయి. 
 
సర్కారు సొమ్మునూ దోచుకున్నారు...

సుజనా గ్రూపు సంస్థలు వేల కోట్లలో టర్నోవర్ చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించటం ద్వారా సర్కారును కూడా మోసం చేసి.. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో దాదాపు రూ. 600 కోట్లకు పైగా సొమ్ము కాజేశాయని అప్పట్లోనే వాణిజ్య పన్ను శాఖ అధికారులు బట్టబయలు చేశారు. అలా మోసం చేసి కొట్టేసిన సొమ్మును తక్షణమే తిరిగి చెల్లించాలని ఆ సంస్థలకు తాఖీదులు కూడా జారీచేశారు. అంతేకాదు.. ఇలా సర్కారును మోసం చేసినందుకు అంతకు రెండింతలు.. అంటే దాదాపు రూ. 1,200 కోట్లు జరిమానా కూడా ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. వాణిజ్య పన్నుల శాఖ నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన సుజనా సంస్థలు.. వాటిపై స్టే తెచ్చుకోగలిగాయి. ఇక సుజనా గ్రూపు సంస్థ అయిన హెండమ్ ఇండస్ట్రీస్ సర్కారు కన్నుగప్పి ఉక్కు దిగుమతులపై కోట్ల రూపాయల్లో పన్నులు ఎగవేసిందని, ఆ పన్నును మొత్తం వడ్డీతో సహా చెల్లించటంతో పాటు.. అదే స్థాయిలో జరిమానా కూడా కట్టాలని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్న సుజనాచౌదరికి రూ. 25 లక్షల జరిమానా కూడా విధించింది.
 
సుజనాగ్రూపు సంస్థలు వాస్తవంగా లేని క్రయవిక్రయాలు పద్దుల్లో చూపుతూ, బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణం తీసుకోవటం, సర్కారు నుంచి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందటం వంటి వ్యవహారాల్లో.. వాణిజ్య పన్నుల శాఖ, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీఐడీ, సీబీఐ వంటి సంస్థలన్నీ ఏదో ఒక స్థాయిలో చర్యలు, దర్యాప్తులు మొదలుపెట్టాయి. కానీ.. ఏ చర్యా తీసుకోలేకపోయాయి. కొన్ని అంశాలపై సుజనా సంస్థలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ.. సీఐడీ, సీబీఐ దర్యాప్తు వంటివి ఎటుపోయాయో, ఎందుకు ఆగిపోయాయో ఎవరికీ తెలియదు! ఉన్న వ్యాపారాన్నే ఎక్కువగా చూపిన సత్యం రామలింగరాజు.. దాదాపు రెండేళ్ల పాటు బెయిల్ కూడా దొరక్క జైలులోనే ఉన్నారు. సుజనాచౌదరికి మాత్రం.. రాజ్యసభ సభ్యత్వం వంటి అందలాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనాచౌదరి అన్న విషయం బహిరంగ వాస్తవం. టీడీపీలో కనీసం సభ్యత్వం లేని సుజనాచౌదరిని.. చంద్రబాబు ఏకంగా ఎంపీని చేశారు. నిజానికి బాబు ప్రాభవంతో పాటే సుజనాచౌదరి ప్రాభవం పెరిగింది. బాబుకు ఆయన బినామీ అని.. చౌదరి లావాదేవీలన్నీ చంద్రబాబు సృజనేని జనంలో నాటుకుపోయింది. సుజనా గ్రూపు లావాదేవీలన్నింటిపై.. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు నిగ్గుతేలవు. 
 
 

వాస్తవంగా కూడా.. సుజనా గ్రూపు సంస్థలకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యూనిట్లలో.. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోసం ఔత్సాహిక యువ పారిశ్రామికవే త్తలు నిర్వహించే కొన్ని వర్క్‌షాప్‌ల వంటి షెడ్లు కనిపిస్తాయే తప్ప ఫ్యాక్టరీ స్థాయి నిర్మాణాలేవీ కనిపించవు. నిజానికి ఫ్యాక్టరీ నిర్మాణం అవసరం కూడా ఆ సంస్థలకు లేదు. ఎందుకంటే అవి చేసేది కేవలం ద్వితీయ మార్కెట్‌లో స్టీల్ కొనుగోలు చేయటం, విక్రయించటం. సంస్థ తాజా ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. టర్నోవర్‌లో 80 శాతం స్టీల్ ట్రేడింగ్ ద్వారా సమకూరగా, కేవలం 20 శాతం మాత్రమే స్టీల్ ఉత్పత్తుల విక్రయాల ద్వారా సమకూరింది. అయినా బ్యాంకులు లోన్లు ఇస్తూనే ఉన్నాయి. 

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదైన సంస్థ చేస్తున్న ప్రధాన వ్యాపారం కేవలం ట్రేడింగ్! తయారీ రంగం కోసం మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన సుజనా యూనివర్సల్.. తన ప్రధాన వ్యాపార లక్ష్యాన్ని విస్మరించి కేవలం ట్రేడింగ్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవటం నిబంధనలకు విరుద్ధం. అలా చేసే సంస్థ మార్కెట్ నుండి నిధులు సమీకరించకుండా చట్టప్రకారం నిషేధం విధించవచ్చు. కానీ అలా జరగదు. కారణం.. సుజనా వారికి గల రాజకీయ పలుకుబడేనన్నది జగమెరిగిన సత్యం! 
 

ప్రారంభమైన వైఎస్ఆర్ సీజీసీ

రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి, రైతు సమస్యలను చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. 

ఈ భేటీలో ఉపఎన్నికలొస్తే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అంశం ప్రస్తావనకు రానుంది. సీజీసీ సమావేశం తర్వాత ఆదివారం వైఎస్‌ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో జగన్‌ భేటీ అవుతారు.

మంత్రి శంకర్రావును అరెస్ట్ చేయాలంటూ ధర్నా

భూముల ఆక్రమణపై న్యాయస్థానం ఆదేశాల మేరకు మంత్రి శంకర్‌రావును అరెస్ట్ చేయాలంటూ బషీర్‌బాగ్‌లోని బాబుజగజ్జీవన్ రామ్‌ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు శనివారం ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఆదం విజయ్ కుమార్ తో పాటు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి శంకర్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లాల రామ్మెహన్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామ్మోహన్ ను విడుదల చేయాలంటూ పీఎస్ ఎదుట పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

జగన్ జన్మదినం సందర్భంగా నేత్రదానం

కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ఐటీ వింగ్‌ ఆధ్వర్యంలో శనివారం నేత్రదాన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దేవనార్‌ ఫౌండేషన్‌కు చెందిన అంధ విద్యార్థులు జగన్‌ బర్త్‌డే కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి స్పందన లభించిందని, భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక సేవలకు పార్టీ అనుబంధ విభాగాలు కృషి చేస్తాయని నాయకులు తెలిపారు.

ysrcp student conveners

Written By ysrcongress on Friday, December 16, 2011 | 12/16/2011


15/12/11 odharpu updates

eye donation

ysrcp committe

త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర: గట్టు


మంకమ్మతోట (కరీంనగర్), న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ బీసీ విభాగం రాష్ర్ట కన్వీనర్ గట్టు రామచంద్రారావు తెలిపారు. కరీంనగర్‌లో గురువారం ఆయ న మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టే ఓదార్పు యాత్రకు సీమాంధ్రలో కంటే ఎక్కువ ప్రజాదరణ లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. వైఎస్‌ఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని తెలిపారు. జగన్ సీఎం అయితే పుట్టగతులు ఉండవనే భయంతోనే కాంగ్రెస్.. సీబీఐతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. కేంద్రంలో పదవి ఇస్తామని సోనియా చెప్పినా.. మాట, విలువలకు కట్టుబడి జగన్ వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన టీడీపీ.. కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిందని, ప్రభుత్వం ఓడిపోదని తెలిసిన తర్వాతనే బాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ఎంతమంది విశ్వాస ఘాతకులున్నా ప్రజల పక్షాన మేమున్నామన్నామంటూ వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వా సానికి అనుకూలంగా ఓటు వేశారన్నారు.

అవ్వా, తాతలపింఛన్లు ఎలా ఊడగొడదామా అని చూస్తున్నారు


*పేదల పథకాలను ఎలా కత్తిరిద్దామా అని ఆలోచిస్తున్నారు
*అవ్వా, తాతలపింఛన్లు ఎలా ఊడగొడదామా అని చూస్తున్నారు

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మానవత్వం లేని పాలకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిరుపేదల సంక్షేమ పథకాలను ఎలా కత్తిరిద్దామా అని ఆలోచిస్తున్నారు. పదిశాతం బతికే అవకాశం ఉన్నా సరే.. డబ్బులవైపు చూడకుండా లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను సైతం ఉచితంగా చేసి పేదవాళ్లకు ప్రాణం పోయాలని వైఎస్సార్ కోరుకుంటే... ఆరోగ్యశ్రీ పథకంలోని వ్యాధులను పది శాతానికి ఎలా కత్తిరిద్దామా? అని ఈ ప్రభుత్వం కత్తెర పట్టుకొని తిరుగుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 43వ రోజు గురువారం ఆయన తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఒక్క పొన్నూరు గ్రామంలోనే ఐదు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

వైఎస్ స్వప్నం ఆరోగ్యశ్రీ
దివంగత నేత ఒక స్వప్నాన్ని చూశారు. తనకు ఆరోగ్యం బాగా లేకపోతే తాను వెళ్లి ఎంత పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుంటారో..! అదే ఆసుపత్రికి ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా వచ్చి తన బెడ్డు పక్కనే వైద్యం చేయించుకోవాలని వైఎస్సార్ కలలుగన్నారు. అందుకోసం ఆరోగ్య శ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. పేదవాడు బతికేందుకు పది శాతం అవకాశం ఉన్నా.. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ అయినా సరే.. డబ్బు కోసం వెనుకాడకుండా వెంటనే ఆపరేషన్ చేయాలని వైఎస్సార్ కోరుకున్నారు. అయితే ఈ చేతగాని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోని వ్యాధులను ఎలాంటి కారణాలు చూపించి 10 శాతానికి కుదించాలా అని ఆలోచిస్తోంది. 

మొబైల్ ఆసుపత్రులు గ్రామాలకు వెళ్లి నడువలేని వయసున్న అవ్వా తాతలకు బీపీ వచ్చినా.. షుగర్ వచ్చినా అక్కడే పరీక్ష చేసి మందులు వాళ్ల చేతిలో పెట్టే గొప్ప ఆశయంతో 104 పథకాన్ని వైఎస్సార్ అందుబాటులోకి తెచ్చారు. ఆ దివంగత నేత చనిపోయిన తరువాత ఇదే 104 వాహనానికి ఫోన్ కొడితే.. ‘మా అంబులెన్స్‌లో మందులు లేవు’... ‘మా ఉద్యోగులు అందరూ సమ్మెలో ఉన్నారు’ అనే సమాధానాలు వినపడుతున్నాయి. నా రాష్ట్రాన్ని ఇటువంటి పరిస్థితిలో చూస్తున్నపుడు బాధనిపిస్తోంది. ఈ ప్రభుత్వం 104 పథకాన్ని ఒక పక్కా పథకం ప్రకారం ఖూనీ చేస్తోంది. వృద్ధాప్యంలో అవ్వాతాతలకు అండగా నిలబడాల్సింది పోయి వారికి ఉన్న పెన్షన్ ఎలా ఊడగొడదమా? అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

పోయినేడాది ఫీజులే ఇవ్వలేదు..
విద్యార్థుల భవిష్యత్తు కోసం.. వారి చదువుల కోసం ఎందాకైనా పోవాల్సిన ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో విద్యార్థుల సంఖ్యను ఎలా తగ్గిద్దామా? అని ఆలోచిస్తోంది. నేను దారి వెంట వస్తున్నప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కలిశారు. వాళ్లు చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అనుకుంటా... వాళ్లను అడిగా.. ‘అమ్మా..! ఈ ఏడాదికి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వచ్చాయా?’ అని. ‘అన్నా మీరు ఈ ఏడాది గురించి అడుగుతున్నారు.. మాకు పోయిన ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బే రాలేదు. స్కాలర్‌షిప్పులైతే గత సంవత్సరం నుంచీ ఇవ్వడం లేదన్నా’ అని వాళ్లు చెప్పారు. వాళ్లు ఇంకో మాట కూడా నాతో చెప్పారు. అన్నా..! ‘కాలేజీయాజమాన్యం మమ్మల్ని ఒక రకంగా, ఫీజలు కట్టిన వాళ్లను ఒక రకంగా చూస్తోందన్నా..’ అని చెప్పినప్పుడు చాలా బాధనిపించింది. విద్యార్థుల మధ్య తారతమ్యాలు తెస్తున్న ఈ చేతగాని ప్రభుత్వాన్ని చూస్తే.. ఇలాంటి వాళ్లా రాష్ట్రాన్ని పాలిస్తుందని బాధనిపిస్తోంది.

సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి..
వైఎస్సార్ సువర్ణ పాలనలో రూ.6 వేలున్న పత్తి నేడు రూ.3500 కూడా పలకని అధ్వాన పరిస్థితి. ఇవాళ ఒక్క పత్తి రైతులే కాదు రాష్ట్రంలో ప్రతి రైతన్న పరిస్థితి అధ్వానంగా తయారైంది. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారికేమో వ్యవసాయంపై, రైతు సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. నష్టాల నుంచి రైతులను గట్టెక్కించి, పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ను క్రియాశీలం చేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తే పత్తికి డిమాండ్ పెరిగి గిట్టుబాటు ధర వచ్చేది.

రాబోయే ఉప ఎన్నికలు.. రైతు కూలీలకు, కుతంత్రాలకు మధ్యే!
‘‘దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. రైతన్న, రైతు కూలీలు, విశ్వసనీయత, విలువలు ఒక వైపు.. రాజకీయాల్లోని కుళ్లు, కుతంత్రాలు మరోవైపు పోటీపడబోతున్నాయి. ఇవాళ రైతన్నలు పడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తన గోడు వినమని చెప్పి రైతన్న క్రాప్ హాలిడే ప్రకటించి లక్ష ఎకరాలు బీడుగా పెట్టినా కూడా ఇవాళ్టి వరకూ ఆ రైతన్న పరిస్థితి మారిందా అంటే.. మారలేదు. ఇవాళ్టికీ వరి మీద రైతన్నకు గిట్టేది రూ.700 మాత్రమే. పత్తి రైతుకు గిట్టేది రూ.3,500, పొగాకు రైతుకు గిట్టేది రూ.6,700 మాత్రమే.. ఇలాంటి సంక్షోభంలో రైతన్న ఉన్నాడు. రైతు కూలీలకైతే కనీసం రూ. 100 కూడా గిట్టని అధ్వాన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నను, రైతు కూలీలను మర్చిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా, ఢిల్లీ పెద్దలకు కూడా వినపడేలా ప్రజా తీర్పు ఉంటుంది.’’

16-12-2011 శుక్రవారం ఓదార్పుయాత్ర

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

16-12-2011 శుక్రవారం

మేడికొండూరు మండలం
* మందపాడు నుంచి యాత్ర ప్రారంభం, ఆరు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ 
* వరగానిలో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ
* సిరిపురంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* పాలడుగులో మూడు విగ్రహాల ఆవిష్కరణ

లిక్కర్ కంపెనీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు

రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వరికి బోనస్ ఇవ్వలేని ప్రభుత్వం.. లిక్కర్ కంపెనీలకు రాయితీ కల్పించడం దారుణమన్నారు. జలయజ్ఞం దండగ అన్న బాబు బాటలోనే సీఎం కిరణ్ పయనిస్తున్నారన్నారు. వైఎస్ ఆశయ సాధనే తమ ధ్యేయమని చెబుతున్న కిరణ్ జలయజ్ఞంపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నామంటున్న సీఎం కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు వస్తే మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు నెలకొంటాయన్నారు.

13/12/11 odharpu

Written By ysrcongress on Wednesday, December 14, 2011 | 12/14/2011

ఇలాంటి చవటలా పాలించేది?

*రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు చెబుతున్నారు
*విద్యార్థుల సెమిస్టర్ పూర్తికావస్తున్నా ఫీజులుచెల్లించరా?
*ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిత మసకబారుతోంది
*చంద్రబాబూ.. నీ హయాంలో పిల్లల చదువుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా?
*ఆ పిల్లల తల్లిదండ్రుల బాధలు చూశావా?
*ఆరు నెలల కిందటే అవిశ్వాసం పెట్టి ఉంటే ఈ సర్కారు బంగాళాఖాతంలో కలిసేది

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అయ్యా.. ముఖ్యమంత్రి..! 2009-10లో మీ పాలన ఉంది.. 2010-11లో నువ్వు ఉన్నావు.. 2011-12లోనూ నీదే పరిపాలన. కనీసం నీ పరిపాలన కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను కట్టాలని నీకు అనిపించడం లేదా? ఒక సెమిస్టర్ పూర్తి చేసుకొని మూడు నెలల్లో మరో సెమిస్టర్‌లోకి అడుగుపెట్టబోతున్న విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేస్తారా? పైగా అసెంబ్లీ సాక్షిగా ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించిన సొమ్ములు చెల్లించామని అబద్ధాలు చెప్తారా? ఈ చేతగాని పాలకులతో విద్యార్థుల భవిష్యత్తు మసకబారుతోంది. ఇలాంటి చవటలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. 

గుంటూరు జిల్లాలో మంగళవారం 41వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన పెదపరిమి గ్రామంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణకు వెళ్తుండగా పరిసర గ్రామాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చి జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘అన్నా... సెమిస్టర్ అయిపోయింది. ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బులు రాలేదు. ‘ఇక ఈ ప్రభుత్వం ఫీజులు కట్టదు.. మీకు ఫీజులు కట్టలేము.. చదివింది చాలు.. కాలేజీ మానండి’ అని అమ్మానాన్నలు బలవంతం చేస్తున్నారు. చదువు మధ్యలో ఆపడం కంటే ఆత్మహత్య చేసుకోవడే మేలన్నా..’’ అని విద్యార్థులు చెప్పడంతో జగన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 

‘‘అమ్మా.. మీ పక్షాన మేం నిలబడతాం.. మీరు ధైర్యంగా చదువుకోండి’’ అని వారికి భరోసానిచ్చారు. ఇదే గ్రామం వేదిక మీద నుంచి మాట్లాడుతూ.. సర్కారు తీరుపై మండిపడ్డారు. తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో 11 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్.. పలుచోట్ల జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని అధ్వాన పరిస్థితి..
దివంగత నేత ఒక స్వప్నాన్ని చూశారు. పేద కుటుంబాలు బాగుపడాలంటే.. ఆ కుటుంబం నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరైనా.. డాక్టరో.. ఇంజనీరో.. లేదంటే కలెక్టర్ లాంటి పెద్ద చదువులు చదవాలని కలలుగన్నారు. కులాలకు.. మతాలకు..రాజకీయాలకు.. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించినప్పుడే అది సాధ్యపడుతుందని ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవానికి ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ చేతగాని ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? త్వరలో ఈ విద్యా సంవత్సరం కూడా పూర్తవుతుంది. విద్యార్థులు ఒక సెమిస్టర్‌ను పూర్తి చేసుకొని మరో సెమిస్టర్‌లోకి అడుగుపెడతారు. ఇవాళ 2011-12 సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి చవటలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అని బాధనిపిస్తుంది.

బాబూ.. నీ తొమ్మిదేళ్లలో ఒక్క రోజైనా కాలేజీలకు వెళ్లావా?
ఇవాళ చంద్రబాబు పిల్లల దగ్గరకు పోతాడు. అవినీతిపై ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్చర్ల మీద లెక్చర్లు దంచుతారు. ఇదే చంద్రబాబునాయుడు గారిని ఒక్కమాట అడుగుతున్నా.. నువ్వు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏ ఒక్క రోజైనా కాలేజీలకు వెళ్లావా? ఏ ఒక్కసారైనా ఆ పిల్లల చదువుల గురించి ఆలోచించావా? పిల్లలను చదివించుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూశావా? పోనీ ఇప్పుడైనా విద్యార్థుల సమస్యలు పడుతున్నాయా? రంగారెడ్డి జిల్లాలో ఫీజులు అందక వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫీజు రీ యింబర్స్‌మెంటు కోసం కళాశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ప్రభుత్వంతో పోరాటం చేశాయి. ఆరునెలల కిందట రోజులకూ ఈ రోజులకు పెద్దగా తేడా లేదు. అప్పుడే నువ్వు అవిశ్వాసం పెట్టి ఉంటే ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి ఉండేది.

చేలను తడిపే నీళ్లలో వైఎస్‌ను చూసుకుంటున్నాం
ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ శాఖమూరుకు వెళ్లగా గ్రామస్తులు ఊరు చివర్లోనే ఆయనను ఆపి.. ‘‘అన్నా ఈ లిప్టు దగ్గర ఒక్క కొబ్బరి కాయ కొట్టివెళ్లన్నా..!’’ అని కోరారు. ‘‘మేం టెయిల్ ఎండ్‌లో ఉన్నాం. మా పొలాకు నీళ్లు పారవు. తుళ్లూరు ఎత్తిపోతలు కట్టి నీళ్లు అందిస్తామని ఎంతో మంది నేతలు మాటిచ్చి మోసం చేశారు. మహానేత మాట తప్పలేదు. తుళ్లూరు ఎత్తిపోతల కట్టి చూపించారు. అయినా మా గ్రామానికి నీళ్లు అందకపోతే.. రూ.14కోట్లతో మాకు లిఫ్టుబావి కట్టించారు. ఇవాళ మా గ్రామానికే కాదు...చుట్టూ ఆరు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. పొలానికి వెళ్లి పచ్చపైరు వైపు చూసినప్పుడు, చేలను తడుపుతున్న ఆ నీళ్లలో మహానేతను చూస్తున్నాం. వైఎస్సార్‌తోనే లిప్టు ఓపెన్ చేయించాలని అనుకున్నాం..! మాట కాదనకన్నా..! ఈ కొబ్బరి కాయ కొట్టన్నా..’’ అంటూ పట్టుబట్టారు. దీంతో జగన్ అక్కడ కొబ్బరికాయ కొట్టి ముందుకు కదిలారు.

Popular Posts

Topics :