18 December 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు విదేశాల్లో

Written By ysrcongress on Saturday, December 24, 2011 | 12/24/2011

 వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు విదేశాల్లో ఘనంగా జరిగాయి. అమెరికాలోని డల్లాస్, డెట్రాయిట్, ఈశాన్య అమెరికా ప్రాంతాల్లోనూ, కువైట్‌లోనూ ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. డెట్రాయిట్‌లో ఇళ్లులేని నిరుపేదలకు ఏర్పాటు చేసిన ఒక ఆశ్రమాన్ని పార్టీ మద్దతుదారులు, జగన్ అభిమానులు సందర్శించి అక్కడ తలదాచుకుంటున్న 700 మందికి ఆహారాన్ని అందజేశారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలతో స్ఫూర్తి పొంది తాము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టామని ఆ తరువాత జరిగిన సభలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ప్రవాసభారతీయులు ప్రసాదరెడ్డి మల్లు, తిరుమల్ కంభం, రమణారెడ్డి క్రిష్టపాటి, మహేష్ ఆదిభట్ల, అప్పిరెడ్డి అన్నంరెడ్డి, శ్రీధర్ కొర్సపాటి, భీంరెడ్డి ప్రతాప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ డెట్రాయిట్ విభాగం తరపున నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన నలుగురు తెలుగు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అంద జేసి తమ వితరణను చాటుకున్నారు. ఈశాన్య అమెరికాలో ఉంటున్న ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులు ‘ఫుడ్ డ్రైవ్’ను ఏర్పాటు చేశారు. అభిమానుల నుంచి ఆహారాన్ని సేకరించి న్యూజెర్సీలోని మెర్సర్ స్ట్రీట్ ఫ్రెండ్స్ అనే సంస్థకు విరాళంగా ఇచ్చారు. పేదలకు కావాల్సిన ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు వై.ఎస్ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. వైఎస్ అభిమానులు ఆళ్ల రామిరెడ్డి, మేక శివ, గంగసాని రాజేశ్వర్, డాక్టర్ రాఘవరెడ్డి, బత్తుల విజయ్, ఉయ్యూరు నాగిరెడ్డి, రమణారెడ్డి, ముక్కామల్ల నగేష్, వేల్కూరు హరి, గుడిపాటి శ్రీకాంత్, ప్రభాకర్ రెడ్డి, సురేష్‌రెడ్డి, ఆరికట్ల శ్రీనివాస్, కోటిరెడ్డి, చిన్నబాబు రెడ్డి, నరసింహారెడ్డి, సహదేవ రెడ్డి, కలకోట అశోక్, జ్యోతిరెడ్డి, మందపాటి శరత్, ఇందుపూరు సతీష్, లక్కసాగరం శ్రీకాంత్, కొల్లి రమేష్, ద్వారకానాథ్ రెడ్డి, గుదేటి శ్రీధర్, మద్దిగపు వెంకట్, కళ్లం కృష్ణారెడ్డి, కొండమడుగుల శ్రీకాంత్, బత్తుల శ్రీనివాస రెడ్డి, ఉయ్యూరు అరుణ, కొల్లి స్నేహలత, ఆళ్ల అనుపమ, కళ్లం ఉష, బత్తుల విజయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కువైట్‌లో

దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వీరాభిమాని టి.మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రవాసుల పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అడ్‌హాక్ కమిటీ కోఆర్డినేటర్ ఇలియాస్ బి.హెచ్, ఎం.బాలిరెడ్డి, గోవింద్ నాగరాజు, సి.చంద్రశేఖర్‌రెడ్డి, కడప శీను, షేక్ అన్సర్ బాష, ఎం.వి.నరసారెడ్డి, కె.సురేంద్రరెడ్డి, షేక్ ఇనాయత్, వాసు చౌదరి, ఆకుల ప్రభాకర్, ఎ.జి.భాస్కర్ రెడ్డి, నాయని మహేశ్వర్ రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, సయ్యద్ నూర్, జె.లోకేశ్వర్ రెడ్డి, షేక్ ఇక్బాల్, సుండుపల్లి భాస్కర్ రెడ్డి, ఎం.చంద్రశేఖరరెడ్డి , వాసుదేవరెడ్డి, సయ్యద్ రషీద్, షేక్ సలీం, సురేష్‌బాబు, సుబ్బయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

HAPPY CHRISTMAS

వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం జిల్లా కన్వీనర్ల నియామకం

జిల్లా కన్వీనర్ల నియామకం
పన్నెండు మందిని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం సిటీ, జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లుగా నియమించారు. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాడ మోహన్‌రావు (విజయనగరం), ముప్పిడి విజయరావు(ప.గోదావరి), గౌడిపేరు సుధీర్‌బాబు (విజయవాడ సిటీ), కంచర్ల సుధాకర్ (ప్రకాశం), దామినేని కేశవులు (చిత్తూరు), టి.రాజేంద్ర(తిరుపతి సిటీ), లింగాల రమేష్ (అనంతపురం), అక్కెనపెల్లి కుమార్ (కరీంనగర్), రాచమల్ల సిద్ధేశ్వర్ (రంగారెడ్డి), నాగదేశి రవికుమార్ (హైదరాబాద్), ఎరుగు సునీల్ కుమార్ (నల్లగొండ), మండెం జయరాజు(ఖమ్మం)ను కన్వీనర్లుగా నియమించినట్లు సూర్యప్రకాష్ ప్రకటించారు.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ దళితుల స్థితిగతులు బాగు పడాలంటే వారి కోసం ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్.సిలకు కేటాయించిన నిధులకు ఖర్చు చేయడానికి ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలని రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చినా గత 60 ఏళ్లుగా అమలుకు నోచుకోలేదన్నారు. 

దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రం తన అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి దళితుల నిధులు దారి మళ్లకుండా చూశారని సూర్యప్రకాష్ గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులకు దళితులకు మేలు చేయాలన్న సృ్పహే లేకుండా పోయిందని అన్నారు. దళితుల కోసం కేటాయించిన వందలాది కోట్ల రూపాయల నిధులను దారి మళ్లిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాము నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో దళితులకు ప్రత్యేక బడ్జెట్ ఉండాలని ఒక తీర్మానం చేశామనీ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇందుకు సమ్మతించారని ఆయన అన్నారు. 
రాష్ట్రంపై కేంద్రం సవతి ప్రేమ: జూపూడిహైదరాబాద్: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికల కోసమే ఉత్తరప్రదేశ్‌లో రెండు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా కల్పించిందని ఆయన అన్నారు. ఎప్పటినుంచో అడుగుతున్నా పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అవిశ్వాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని, మొత్తం 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించాలని జూపూడి డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రజలకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

IT Committee Xmas Celebrations at YSRCP Office

ysrcp sevadalam adhoc committe

IT Committee Xmas Celebrations at YSRCP Office

విజయనగరం పట్టణంలో దాదాపు 25 శాతం మేరకు మద్యం షాపులు

బొత్స గాంధీభవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ‘‘నేను లిక్కర్ డాన్ అని, మద్యం సిండికేట్ల నుంచి నేను డబ్బులు తీసుకున్నానని వాళ్లు చెబుతున్నారు. దీనిపై ఏ విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నా. అందులో నా ప్రమేయం ఉందని తేలినా, రూ.10 లు తీసుకున్నట్లు నిరూపించినా ప్రజల వద్ద నిలబడి సిగ్గుతో తలదించుకుంటానే తప్ప చంద్రబాబు మాదిరిగా ‘ఛీ...పో...’ అని జనం చీదరించినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వ్యక్తిని కాదు’’అని చెప్పారు. 

తన పేరిట మద్యం వ్యాపారం లేదని, అయితే కుటుంబ సభ్యులు మాత్రం విజయనగరం పట్టణంలో దాదాపు 25 శాతం మేరకు మద్యం షాపులు నిర్వహిస్తున్నారని అంగీకరించారు. వాస్తవానికి మద్యం సిండికేట్ల నుంచి డబ్బులు దోచుకునే వ్యక్తి చంద్రబాబేనని, స్వయాన ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు గతంలో ఈ మాటలు చెప్పారని గుర్తు చేశారు. తనను లక్ష్యంగా చేసుకునే ఏసీబీ ద్వారా సీఎం మద్యం సిండికేట్లపై దాడులు చేయించారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.

ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతన్నలు

ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతన్నలు

కలెక్టరేట్లు, తహశీల్దార్, ఆర్‌డీవో ఆఫీసులు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనలు
పాల్గొన్న వైఎస్సార్ అభిమాన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలను భరించలేక, అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్న రైతాంగం ఆగ్రహంతో రోడ్డెక్కింది. తమను గాలికొదిలేసిన సర్కారుపై మండిపడింది. ఇప్పటికైనా తమను ఆదుకోవాలంటూ ముక్త కంఠంతో నినదించింది. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు. లక్షలాది మంది రైతులు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందూ, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ జరిగిన ఈ ధర్నాల్లో.. అన్నదాతలు చేతగాని సర్కారుపై మండిపడ్డారు. వైఎస్‌ను అభిమానిస్తున్న ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పార్టీ ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ శ్రేణులు ధర్నాల్లో పాల్గొని అధికారులకు రైతు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పలువురు తమ సొంత జిల్లాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.

కోస్తా జిల్లాల్లో..

తూర్పుగోదావరి జిల్లాలో ధర్నాలకు అనూహ్య స్పందన లభించింది. జగ్గంపేటలో ఎడ్లబళ్లతో భారీర్యాలీ, ఎండిపోయిన చెరకు, పత్తి తదితర పంటల దుబ్బులతో వినూత్నంగా నిరసన చేపట్టారు. అమలాపురంలో ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి నేతలను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఆలమూరులో జరిగిన నిరసనల్లో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేశారు. గుడివాడలో పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఆందోళనలు జరిగాయి. నరసాపురం, పోలవరం ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం గునుపూడి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. చింతలపూడిలో నియోజకవర్గ నాయకులు మానవహారంగా ఏర్పడి సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గ కేంద్రాలతోపాటు, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. చిలకలూరిపేటలో నాలుగువేల మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. పార్టీ నాయకులు చుట్టుగుంట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ రైతు ఆందోళనలు విజయవంతమయ్యాయి. 11 కేంద్రాల్లో జరిగిన ఈ ధర్నాలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి భీమిలి, మాడుగుల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నాలు జరిగాయి. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితర ప్రముఖులు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఉదయగిరి నియోజకవర్గాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. అద్దంకి, పర్చూరు, చీరాల, త్రిపురాంతకంలలో రాస్తారోకోలు చేపట్టారు. సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. విజయనగరం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా విజయవంతమైంది. శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. తొలుత ర్యాలీలు నిర్వహించి, అనంతరం తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు.

తెలంగాణలో..
వరంగల్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించారు. హన్మకొండ ఆర్డీఓ కార్యాలయం, వరంగల్ ఎమ్మార్వో కార్యాలయం, డోర్నకల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, మంగపేట, కురవి, చేర్యాల కేంద్రాల్లో రైతులు ధర్నాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. బాల్కొండలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. బైపాస్ రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు, కార్యకర్తలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. మెదక్ జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ సహా 11 నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సిరిసిల్ల, జగిత్యాల, మంథని, పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగాయి. ఆలేరులో రాస్తారోకోతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. సత్తుపల్లి, మధిర, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలకు రైతులు భారీ ఎత్తున కదిలారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో చేపట్టిన ధర్నాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాయలసీమలో..

వైఎస్‌ఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగాయి. వేలాది మంది రైతులు ధర్నాలో పాల్గొని సమస్యలపై నినదించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పులివెందులలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు 63 మండలాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. 200మందిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు అన్ని మండలాల నుంచి అన్నదాతలు తరలివచ్చారు. నంద్యాలలో 1,500 మంది స్థానిక సిటీ కేబుల్ ఆఫీసు నుంచి శ్రీనివాస సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన భారీ ధర్నాలో 1,500 మందికిపైగా పాల్గొన్నారు.

ధర్నాలకు భారీ స్పందన: గట్టు రామచంద్రరావు

తమ పార్టీ పిలుపునిచ్చిన ధర్నాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి భారీగా స్పందన లభించిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు హైదరాబాద్‌లో వివరించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ధర్నాలు జరగడాన్నిబట్టి రైతులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోందన్నారు. సమస్యలను పట్టించుకోని ప్రభుత్వంపైన, తమ కోసం పోరాడని ప్రతిపక్ష టీడీపీపైన రైతులకు విశ్వాసం సన్నగిల్లిందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు మరో నిదర్శనమిది

వారిపై అనర్హత వేటు పడకుండా తాత్సారం చేస్తూ కాంగ్రెస్ నాటకం
ఉప ఎన్నికలు జరిగితే ఘోర పరాభవం తప్పదని నేతల ఆందోళన
వెంటనే ఉప ఎన్నికలు వస్తే రైతాంగ సమస్యలపైనే చర్చ 
జరుగుతుందని కాంగ్రెస్ భయమంటున్న పరిశీలకులు

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు మరో నిదర్శనమిది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు పడకుండా తాత్సారం చేయడం వెనుక ఉప ఎన్నికలను సాధ్యమైనంత ఆలస్యం చేయాలన్న దురుద్దేశం ఉన్నట్లు కనపడుతోంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రాకూడదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పైగా, రైతు సంక్షేమాన్ని కోరుతూ వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినందున, ఈ ఉప ఎన్నికల్లో రైతు సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని, అదే జరిగితే కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వెంటనే స్పీకర్‌కు ఫిర్యాదు చేయకుండా కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసింది. 

ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరగకూడదన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఈ నాటకమాడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈనెల ఐదో తేదీ అర్ధరాత్రి శాసన సభలో అవిశ్వాసంపై ఓటింగ్ జరిగింది. స్పీకర్ సాక్షిగా వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆరోజు అసెంబ్లీ సమావేశం ముగిసేసరికి అర్ధరాత్రి అయినందున, వీరిపై వెంటనే కాకపోయినా, మరుసటి రోజయినా కాంగ్రెస్ ఫిర్యాదు చేసి ఉండాల్సింది. ఈ ఎమ్మెల్యేలపై ఫిర్యాదుకు వేరే సాక్ష్యాలు కూడా అవసరంలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ కావాలనే అనర్హత పిటిషన్ దాఖలు చేయకుండా వారం రోజులు తాత్సారం చేసింది. తాపీగా 12వ తేదీ రాత్రి 8 గంటలకు ఆ 16మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే అనర్హత పిటిషన్ దాఖలు చేసి స్పీకర్ చర్య తీసుకొని ఉంటే, ఖాళీగా ఉన్న ఏడు స్థానాలతో పాటే 16 నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ భయపడటమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వెంటనే అనర్హత వేటు పడి, ఉప ఎన్నికలు వచ్చి ఉంటే రైతాంగ సమస్యలపై చర్చ జరగడంతో పాటు ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని, దాని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికి అనర్హత పిటిషన్‌ను ఆలస్యం చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘మామూలు సందర్భాల్లో అనర్హత పిటిషన్ దాఖలు చేయడానికి ఆధారాలు కావాలి. కానీ, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించడం స్వయంగా స్పీకర్ చూశారు. శాసన సభ రికార్డుల్లోనూ అది నమోదైంది. అందువల్ల వెంటనే ఫిర్యాదు చేసి ఉండాల్సింది’’ అని శాసన వ్యవహారాల్లో అనుభవం కలిగిన ఓ న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. వెంటనే ఎన్నికలు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం పన్నినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఈ 16 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావడం అనివార్యమనే విషయాన్ని గుర్తించే కాంగ్రెస్ కావాలని కాలయాపన చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఓ రకంగా చూస్తే కాంగ్రెస్ ఎన్నికలకు భయపడినట్లేనని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అన్నదాతను ఆదుకోండి: జగన్ డిమాండ్

కేశలింగాయపల్లి: రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. అన్నదాతకు భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పులేదని అన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లిలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉల్లి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థంకాని పరిస్థితిలో రైతు ఉన్నాడని అన్నారు. పది నెలలుగా వ్యవసాయ శాఖకు మంత్రే లేరని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్‌ఛాన్సలర్‌ను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వముందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్‌లో వచ్చే ఏడాది జనవరి 30న, మణిపూర్‌లో జనవరి 28న, గోవాలో మార్చి 3న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు జరపనుంది. 

ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది. మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి 4న ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 8, 11, 15, 19, 23, 28 తేదీల్లో మిగతా విడత ఎన్నికలుంటాయి. మార్చి 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి తెలిపారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.

ఉద్యమించిన రైతుదండు

ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతన్నలు

కలెక్టరేట్లు, తహశీల్దార్, ఆర్‌డీవో ఆఫీసులు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనలు
పాల్గొన్న వైఎస్సార్ అభిమాన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలను భరించలేక, అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్న రైతాంగం ఆగ్రహంతో రోడ్డెక్కింది. తమను గాలికొదిలేసిన సర్కారుపై మండిపడింది. ఇప్పటికైనా తమను ఆదుకోవాలంటూ ముక్త కంఠంతో నినదించింది. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు. లక్షలాది మంది రైతులు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందూ, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ జరిగిన ఈ ధర్నాల్లో.. అన్నదాతలు చేతగాని సర్కారుపై మండిపడ్డారు. వైఎస్‌ను అభిమానిస్తున్న ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పార్టీ ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ శ్రేణులు ధర్నాల్లో పాల్గొని అధికారులకు రైతు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పలువురు తమ సొంత జిల్లాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.

కోస్తా జిల్లాల్లో..

తూర్పుగోదావరి జిల్లాలో ధర్నాలకు అనూహ్య స్పందన లభించింది. జగ్గంపేటలో ఎడ్లబళ్లతో భారీర్యాలీ, ఎండిపోయిన చెరకు, పత్తి తదితర పంటల దుబ్బులతో వినూత్నంగా నిరసన చేపట్టారు. అమలాపురంలో ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి నేతలను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఆలమూరులో జరిగిన నిరసనల్లో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేశారు. గుడివాడలో పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఆందోళనలు జరిగాయి. నరసాపురం, పోలవరం ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం గునుపూడి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. చింతలపూడిలో నియోజకవర్గ నాయకులు మానవహారంగా ఏర్పడి సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గ కేంద్రాలతోపాటు, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. చిలకలూరిపేటలో నాలుగువేల మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. పార్టీ నాయకులు చుట్టుగుంట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ రైతు ఆందోళనలు విజయవంతమయ్యాయి. 11 కేంద్రాల్లో జరిగిన ఈ ధర్నాలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి భీమిలి, మాడుగుల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నాలు జరిగాయి. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితర ప్రముఖులు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఉదయగిరి నియోజకవర్గాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. అద్దంకి, పర్చూరు, చీరాల, త్రిపురాంతకంలలో రాస్తారోకోలు చేపట్టారు. సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. విజయనగరం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా విజయవంతమైంది. శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. తొలుత ర్యాలీలు నిర్వహించి, అనంతరం తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు.

తెలంగాణలో..
వరంగల్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించారు. హన్మకొండ ఆర్డీఓ కార్యాలయం, వరంగల్ ఎమ్మార్వో కార్యాలయం, డోర్నకల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, మంగపేట, కురవి, చేర్యాల కేంద్రాల్లో రైతులు ధర్నాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. బాల్కొండలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. బైపాస్ రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు, కార్యకర్తలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. మెదక్ జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ సహా 11 నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సిరిసిల్ల, జగిత్యాల, మంథని, పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగాయి. ఆలేరులో రాస్తారోకోతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. సత్తుపల్లి, మధిర, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలకు రైతులు భారీ ఎత్తున కదిలారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో చేపట్టిన ధర్నాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాయలసీమలో..

వైఎస్‌ఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగాయి. వేలాది మంది రైతులు ధర్నాలో పాల్గొని సమస్యలపై నినదించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పులివెందులలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు 63 మండలాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. 200మందిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు అన్ని మండలాల నుంచి అన్నదాతలు తరలివచ్చారు. నంద్యాలలో 1,500 మంది స్థానిక సిటీ కేబుల్ ఆఫీసు నుంచి శ్రీనివాస సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన భారీ ధర్నాలో 1,500 మందికిపైగా పాల్గొన్నారు.

ధర్నాలకు భారీ స్పందన: గట్టు రామచంద్రరావు

తమ పార్టీ పిలుపునిచ్చిన ధర్నాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి భారీగా స్పందన లభించిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు హైదరాబాద్‌లో వివరించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ధర్నాలు జరగడాన్నిబట్టి రైతులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోందన్నారు. సమస్యలను పట్టించుకోని ప్రభుత్వంపైన, తమ కోసం పోరాడని ప్రతిపక్ష టీడీపీపైన రైతులకు విశ్వాసం సన్నగిల్లిందని ఆయన అన్నారు.

ysr

Written By ysrcongress on Friday, December 23, 2011 | 12/23/2011

ys jagan in hyderabad

రైతు సమస్యలపై నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నాలు

 రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరుగనున్నాయి. ఈ నెల 17న పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేంద్ర పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆందోళనను చేపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించారు. అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేసి సాగుచేసినా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంవల్ల చాలాచోట్ల పంటలు ఎండిపోయాయి. కొద్దో గొప్పో చేతికొచ్చిన పంటకు కూడా ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించే పరిస్థితి లేకపోయింది. ఇన్ని సమస్యలతో రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి కనువిప్పు కలిగించడానికి ఈ ఆందోళనను సంకల్పించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖరీఫ్ పంట చేతికొస్తున్న తరుణంలో చేస్తున్న ఈ ఆందోళన వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడానికి దోహద పడగలదని పార్టీ భావిస్తోంది. అన్ని జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున రైతులతో పాటు పార్టీని సమర్థిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలంతా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా చురుగ్గా పాల్గొని రైతు సమస్యలను ఎలుగెత్తి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం.. నిస్పృహలో అన్నదాత

గత ఖరీఫ్‌లో 53 లక్షల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్న పంట
ఇందులో కరెంటు కోత వల్లే 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రబీలో ఇప్పటికి 50 శాతం విస్తీర్ణంలోనూ సాగు కాని దుస్థితి
రుణాల లక్ష్యం రూ. 10,700 కోట్లు.. ఇచ్చింది రూ. 3,457 కోట్లే
25 లక్షల మంది కౌలు రైతులుండగా, 5.46 లక్షల మందికే రుణ అర్హత కార్డుల పంపిణీ.. ఇచ్చిన రుణాలూ స్వల్పమే
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం.. నిస్పృహలో అన్నదాత

‘‘ఆంధ్రప్రదేశ్ భారత దేశపు ధాన్యాగారమూ.. అన్నపూర్ణ..’’.. చిన్నప్పుడు పుస్తకాల్లో మనం ఇదే విషయాన్ని చదువుకున్నాం.. ఇప్పుడు మన పిల్లలూ ఇదే విషయాన్ని చదువుకుంటున్నారు.. పాఠ్య పుస్తకంలో పదాలు కించిత్తు కూడా మారలేదు. బయట రైతన్న బతుకు మాత్రం గత రెండేళ్లలో చాలా మారిపోయింది. సాగు సంక్షోభంలో చిక్కుకుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాజులా బతికిన రైతన్న.. వ్యవసాయం దండగన్న చంద్రబాబు హయాం నాటి దుర్భర పరిస్థితులను ఇప్పుడు చవిచూస్తున్నాడు. ప్రకృతే కాదు.. ప్రభుత్వమూ దగా చేయడంతో అందరికీ అన్నం పెట్టే అన్నదాత నోట్లోకే ఐదు వేళ్లూ పోని పరిస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర సంగతి పక్కనపెడితే.. సర్కారు నిర్లక్ష్యం పుణ్యమాని కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. వందల ఏళ్ల నుంచీ వ్యవసాయం చేస్తున్నా ఏనాడూ విరామమెరుగని రైతన్న.. చరిత్రలో తొలిసారిగా లక్ష ఎకరాల్లో సాగుకు విరామమిచ్చాడు. అటు రైతుకు బాసటగా మహానేత స్ఫూర్తితో 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు సైతం తమ పదవులను తృణప్రాయంగా తలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నినదించినా గుడ్డి సర్కారు కళ్లు తెరవలేదు. రైతుకీ దుస్థితి ఏమిటి? అప్పుల భారం మోయలేక.. పంట చేలోనే ప్రాణాలు తీసుకోవాల్సిన అగత్యమేమిటి?

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం మళ్లీ సంక్షోభంలో చిక్కుకుంది. గడిచిన రెండేళ్లలో ఇటు ప్రకృతి, అటు ప్రభుత్వ చేతకానితనం రైతన్న నడ్డివిరిచాయి. 2009-10లో దుర్భర కరువు, గతేడాది అధిక వర్షాలు, వరదలతో సర్వం నష్టపోయిన అన్నదాతను ఈ ఏడాది కష్టాలు కరెంటు కోతల రూపంలో కాటేశాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వ్యవసాయం ఆధారపడ్డ 1,076 మండలాలకు గాను 865 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకుంది. సాయం సంగతే మరిచింది. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 53 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఇలా జరగడం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. అందులోనూ ఒక్క కరెంటు కోత వల్లే 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ గణాంకాలే పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు నష్టపోయిన మొత్తం రూ.10 వేల కోట్లు!

పంట రుణం.. పగటి కలే..

ఇక రైతులకు పంట రుణం అన్నది ఓ కలే. ఎందుకంటే.. ఇప్పటివరకూ ఎన్నడూ పంట రుణం తీసుకోని రైతులే రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా ఉన్నారు. అక్టోబర్‌లో ప్రారంభమైన రబీ నుంచి రైతులకు రూ.లక్ష వరకూ వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో పంట రుణాల పంపిణీ విషయంలో బ్యాంకులను కదిలించలేకపోతోంది. రబీలో రూ.10,700 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 32 శాతం(రూ.3,457 కోట్లు) మాత్రమే ఇచ్చారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతోంది. రుణ అర్హత కార్డులను 5,46,131 మందికే పంపిణీ చేశారు. రబీలో ఇప్పటివరకూ 50,785 మంది కౌలు రైతులకు రూ.78.97 కోట్ల రుణాలిచ్చారు. గతేడాది రబీలో పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన బీమా పరిహారాన్ని ఏడాదైనా ఇప్పటికీ మంజూరు చేయలేదు. ఇటు ప్రభుత్వ రుణాలు దొరకక.. అటు ప్రైవేటు అప్పుల భారం మోయలేక గత రెండేళ్లలో వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు ఖరీఫ్‌లో పంటలు వేశాక వాటిని ఎండబెట్టిన సర్కారు ఇప్పుడు రబీలోనూ నాట్లు, విత్తనాలు వేసే సమయంలోనే అడ్డగోలుగా కరెంటు కోతలు విధిస్తోంది. డెల్టాలో సైతం నీరివ్వలేమంటూ చేతులెత్తేసింది. దీంతో రబీలో కోటి ఎకరాలు సాగు కావాల్సి ఉండగా రైతుల వద్ద పెట్టుబడి లేకపోవడంతో 50% విస్తీర్ణంలో కూడా సాగు కాని పరిస్థితి నెలకొంది. 

పెట్టుబడి మరింత భారం: అటు ఎరువులు, విత్తనాల ధరలు అమాంతం పెరిగి.. పెట్టుబడి వ్యయం ఆకాశాన్ని తాకింది. కేంద్రం 2010 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చిన షోషకాల ఆధారిత సబ్సిడీ ఎరువుల విధానం సాగును మరింత భారంగా మార్చేసింది. కంపెనీలకు అనుకూలంగా ఉన్న ఈ విధానంతో ఎరువుల ధరలు నెలకోసారి పెరుగుతున్నాయి. యూరియా మినహా అన్ని ఎరువుల ధరలు రెట్టింపయ్యాయి. ఒక్కో ఎరువు బస్తా కోసం రైతులు పోలీసుల దెబ్బలు తింటూ రోజుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు కాయాల్సిన దుస్థితి. కేంద్రం డీజిల్ ధరలనూ భారీగా పెంచేయడంతో దుక్కుల కోసం ఉపయోగించే ట్రాక్టర్ బాడుగ ఖర్చు ఏడాదిలోనే రెట్టింపైంది. ఇటు రాష్ట్ర సర్కారు కూడా.. పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ.750 నుంచి 930కి పెంచింది. సబ్సిడీ వేరుశనగ విత్తనాల ధరను రూ.2,500 నుంచి రూ.3,500కు పెంచేసింది. శనగ విత్తనాల ధర గతేడాది క్వింటాల్ రూ.2,250 ఉంటే రూ.5,200కు పెంచారు. 

వ్యవసాయం దండగ నుంచి పండగ దాకా..

టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతులపై కేసులు పెట్టి.. జైల్లో పెట్టించిన ఘనత ఆయనది. 1996 సెప్టెంబరు 3న పశ్చిమ గోదావరి జిల్లా కాల్దరిలో నీటి తీరువా, విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసినందుకు అన్నదాతలపైనే కాల్పులు జరిపించారు. ఇద్దరిని బలితీసుకున్నారు. ఇక బషీర్‌బాగ్ కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. 2000 సంవత్సరంలో కరెంటు చార్జీల పెంపును ప్రశ్నిస్తూ.. బషీర్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై కర్కశంగా కాల్పులు జరిపించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. బాబు హయాంలో రైతన్న జీవితంలో వెలుగే కరువైంది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ అధికారాన్ని చేపట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కరెంటు బకాయిల మాఫీ, జలయజ్ఞం, పంట రుణాల మాఫీ, మద్దతు ధర పెంపు, గ్రామం యూనిట్‌గా బీమా వంటి పథకాలతో అన్నదాతలకు కొత్త వెలుగునిచ్చారు. దండగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. 

దేశానికి సబ్సిడీ ఇస్తున్న రైతు... 

ప్రపంచంలో ఎక్కడైనా ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు అన్నదాతలకు సబ్సిడీలు ఇస్తుంటాయి. వ్యవసాయం జీవన విధానంగా ఉన్న మన దేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. రైతు కొవ్వొత్తిగా కరిగిపోతూ.. తాను పండించిన పంటను పెట్టుబడి వ్యయం కంటే తక్కువగా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) అమ్ముకుంటున్నాడు. తద్వారా తాను నష్టపోయిన మొత్తాన్ని దేశానికి సబ్సిడీగా ఇస్తున్నాడు. ఇలా ఇస్తూ.. ఇస్తూ.. సంక్షోభంలోకి కూరుకుపోతున్నాడు. ఫలితంగా కేవలం వరి, గోధుమ, చక్కెర, పత్తి వంటి నాలుగు ప్రధాన పంటలతోనే దేశ వ్యాప్తంగా రైతులు ఏటా రూ.లక్ష కోట్లు నష్టపోతున్నారు. అన్ని పంటలు కలిపితే ఈ మొత్తం రూ.3 లక్షల కోట్లు ఉంటుంది. రాష్ట్రంలోని అన్నదాత ఇలా రూజ50 వేల కోట్లు నష్టపోతున్నాడు. అటు ప్రభుత్వాలు కూడా రైతులకు ఆసరాగా నిలవాల్సింది పోయి.. మార్కెట్‌లో డిమాండ్, సరఫరా సూత్రాలపై ఆధారపడి శాస్త్రీయత కొరవడిన లెక్కలతో పెట్టుబడి ఖర్చు కంటే తక్కువగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నాయి. ఇక ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి పంటల సాగు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ. ఈ మూడు పంటల విస్తీర్ణం రాష్ట్ర సాగు విస్తీర్ణంలో 15 శాతం వరకు ఉంటోంది. ప్రభుత్వం ఈ పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతేడాది క్వింటాల్ రూ.18 వేలు పలికిన పసుపు ధర ఇప్పుడు రూ.3 వేలకు పడిపోయింది. అలాగే మిరప రైతులకు గతేడాది క్వింటాల్‌కు రూ.9 వేలు రాగా ఇప్పుడు రూ.4 వేలు రావడం కష్టంగా మారింది. ఉల్లి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ.4 వేలు రాగా ఇప్పుడు కేవలం రూ.400కు పడిపోయింది. పొగాకు రైతుల పరిస్థితీ ఇలాగే ఉంది. 

శాస్త్రీయత లోపించింది..

కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా లేదు. ఆయకట్టు ప్రాంతాలను కూడా కరువుగా ప్రకటించారు. వర్షపాతం, పంటల సాగు, దిగుబడి తగ్గుదల అంశాలను పట్టించుకోలేదు. ఇప్పుడు పరిహారం అందించే విషయంలో జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి మండలానికి రూ.10 కోట్ల తక్షణ నిధిని మంజూరు చేయాలి. పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి. పంట రుణాలు మాఫీ చేయాలి. ప్రైవేటు అప్పులపై మారటోరియం ప్రకటించాలి. జాబ్ కార్డుదారులందరికీ ఉన్న ఊళ్లోనే ఉపాధి కల్పించాలి.
- కె.రామకృష్ణ, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం.

గిట్టుబాటు దక్కితేనే...

వరుసగా నాలుగైదేళ్లు మంచి పంట పండినా ఒక్క సీజనులో విపత్తు వస్తే తట్టుకునే పరిస్థితి లేకపోవడం.. వ్యవసాయరంగ సంక్షోభ పరిస్థితిని తెలియజేస్తోంది. పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తేగానీ ఈ దుస్థితి మారదు. ఒక్క ఏడాది కరువుతోనే మళ్లీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోని అన్నదాతలకు రుణ భారమే పెద్ద సమస్య. బ్యాంకులు వ్యవసాయరంగానికి ఇస్తున్న రుణాలు కచ్చితంగా ఎంతనేది ఎవరికీ అర్థం కావడంలేదు. కౌలు రైతులకు రుణాలపై సర్కారు విధానం సరిగా లేదు. చిత్తశుద్ధితో వరుసగా కొన్నేళ్లపాటు వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తేనే సరైన ఫలితం ఉంటుంది. 
-ఇ.రేవతి, ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం

Popular Posts

Topics :