23 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా సమావేశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 23 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా సమావేశాలు

23 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా సమావేశాలు

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత వ్యవహారాలపై చర్చించడానికి ఈ నెల 23వ తేదీ నుంచి జిల్లాల వారీగా విస్త్రత సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. తొలి విడతగా రోజు కొకటి చొప్పున ఐదు జిల్లాల సమావేశాలు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతాయి. 23న నిజామాబాద్, 24న నల్లగొండ, 25న మహబూబ్‌నగర్, 27న ఆదిలాబాద్, 30వ తేదీన కరీంనగర్ జిల్లాల సమావేశాలు ఉంటాయని పార్టీ సంస్థాగత వ్యవహారాల సమన్వయకర్త పి.ఎన్.వి.ప్రసాద్ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లకు లేఖలు పంపారు. 

ఈ విస్త్రత సమావేశాల్లో పార్టీ అడ్‌హాక్ కమిటీ జిల్లా కన్వీనర్లు, పరిశీలకులు, జిల్లా సమన్వయకర్తలు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల పార్టీ అడ్‌హాక్ కన్వీనర్లు, మున్సిపాలిటీ కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కన్వీనర్లు, అధికార ప్రతినిధులు, జిల్లాల్లోని పార్టీ ముఖ్య నేతలు, ఇతర జిల్లాల్లో పార్టీ విధులు నిర్వహిస్తున్న నాయకులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంటు సభ్యులు పాల్గొనాలని ఆయన సూచించారు. సమావేశానికి పై వారంతా పాల్గొనేలా సంబంధిత జిల్లా కన్వీనర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆహ్వానితులు సమావేశానికి వచ్చేటపుడు తమ ఫోటోలు రెండింటిని తీసుకురావాలని కూడా ఆయన సమాచారం పంపారు. 

కమిటీల ఏర్పాటుపై శ్రద్ధ
పార్టీ సభ్యత్వ కార్యక్రమం వేగవంతం చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల్లో అన్ని స్థాయిల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. వారంతా ఏ మేరకు మండల కమిటీలను ఏర్పాటు చేశారనే అంశం కూడా ప్రస్తావనకు రావచ్చు. కొత్తగా ఏర్పడిన పార్టీ కనుక వివిధ శ్రేణుల, నాయకుల విధులను, బాధ్యతలను గురించి ఈ సమావేశంలో స్పష్టంగా నిర్దేశిస్తారు. సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కీలకమైన అంశాలు చర్చిస్తారు కనుక సాధ్యమైనంత వరకూ ఆహ్వానితులందరినీ సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఇప్పటికే జిల్లా కన్వీనర్లకు ఆదేశాలు వెళ్లాయి.
Share this article :

0 comments: