7-1-2012 శనివారం ఓదార్పుయాత్ర వివరాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 7-1-2012 శనివారం ఓదార్పుయాత్ర వివరాలు

7-1-2012 శనివారం ఓదార్పుయాత్ర వివరాలు

Written By ysrcongress on Saturday, January 7, 2012 | 1/07/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

7-1-2012 శనివారం

సత్తెనపల్లి మండలం
* కొమెరపూడి నుంచి యాత్ర ప్రారంభం

మేడికొండూరు మండలం
* మేడికొండూరులో మూడు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
* పాలడుగులో మూడు విగ్రహాల ఆవిష్కరణ

పెదకూరపాడు మండలం
* పొడపాడులో పర్యటన
* ముసాపురంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* పాటిబండ్లలో పర్యటన
* జలాలపురంలో పర్యటన
* కంభంపాడులో పర్యటన

అమరావతి మండలం
* మండేపూడిలో రెండు విగ్రహాల ఆవిష్కరణ (నామాల నాగరాజు కుటుంబానికి ఓదార్పు).

నేటి ‘ఓదార్పు’ కుటుంబం
మారాజు.. మరిక లేడని..
పేరు: నామాల నాగరాజు
ఊరు: మండెపూడి ఎస్సీ కాలనీ, అమరావతి మండలం
వృత్తి: వ్యవసాయ కూలీ
తల్లిదండ్రులు: రామకోటి, నాగరత్నమ్మ

చిన్నతనంలోనే చదువు మానేసిన నాగరాజు తండ్రికి చేదోడువాదోడుగా కూలి పనులకు వెళుతుండేవాడు. అతడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఆయన మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. తీవ్ర ఆవేదనతో సెప్టెంబర్ నాలుగున పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు చనిపోగా తల్లిదండ్రులు నామాల రామకోటి, నాగరత్నమ్మ వ్యవసాయకూలీలుగా జీవనం సాగిస్తున్నారు.
Share this article :

0 comments: