నేటి యాత్ర ఇలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి యాత్ర ఇలా...

నేటి యాత్ర ఇలా...

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

మూడో విడత ఓదార్పుయాత్రకు గుంటూరు జిల్లా సన్నద్ధమైంది. అడుగడుగునా అశేష జనసంద్రం, అభిమానుల నడుమ, జిల్లాలో తొలి, మలివిడత యాత్ర పూర్తి చేసుకోగా.. బుధవారం మేడికొండూరు మండలంలోని పేరేచర్ల గ్రామం నుంచి మూడో విడత ఓదార్పుయాత్ర ప్రారంభం కానుంది. ఒంగోలులో బుధవారం ఉదయం జరిగే ఫీజు ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి చిలకలూరిపేట మీదుగా పేరేచర్లకు చేరుకుని ఓదార్పు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పేరేచర్లలో స్వాగతం పలకటానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జగన్ పర్యటించే మార్గంలో పార్టీ నేతల స్వాగత ఫ్లెక్సీలతో అలంకరించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఓదార్చటానికి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర ద్వారా జిల్లాలో ఇప్పటికి 22 కుటుంబాలను ఓదార్చారు. 

నేటి యాత్ర ఇలా... 
తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలంలో ఉన్న పేరేచర్ల గ్రామంలో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడు, అమీనాబాద్, ఫిరంగిపురం, గొల్లపాలెం, రేపూడి గ్రామాల్లో ఓదార్పుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఫిరంగిపురంలో వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన మేడా పోతురాజు కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం మండల కేంద్రమైన ఫిరంగిపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి అదే గ్రామంలో రాత్రి బస చేస్తారు. గురువారం మేడికొండూరు మండలం పాలడుగు నుంచి యాత్ర ప్రారంభించేలా పార్టీ నేతలు షెడ్యూలు ఖరారు చేశారు. 

జిల్లాలో జగన్ జన ప్రస్థానం ..
జిల్లాలో జగన్ ఓదార్పుయాత్ర జన ప్రభంజనంలా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ ఇతర జిల్లాలో జరగని విధంగా రికార్డుస్థాయిలో 44 రోజులు జిల్లాలో కొనసాగింది. అలాగే అత్యధికంగా 1146.5 కిలోమీటర్లు పర్యటించారు. గత ఏడాది అక్టోబర్ 16న మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలంలోని సీతానగరం నుంచి ప్రారంభమైన ఓదార్పుయాత్ర తెనాలి, వేమూరు నియోజకవర్గాలు పూర్తి చేసుకొని నవంబర్ 2న రేపల్లె పట్టణంలోకి ప్రవేశించి బహిరంగసభతో మొదటి విడత యాత్రను ముగించారు. రెండో విడత యాత్ర నవంబర్ 16 నుంచి రేపల్లెలో ప్రారంభమై రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో కొనసాగింది. డిసెంబర్ 2న పొన్నూరు నియోజకవర్గంలో యాత్రకు స్వల్పవిరామం తర్వాత 5వ తేదీ నుంచి ప్రారంభమై పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల్లో కొనసాగింది. డిసెంబర్ 16న తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలంలోని సిరిపురంలో యాత్ర ముగిసింది. ఓదార్పుయాత్రలో భాగంగా మండల కేంద్రాల్లో సభలతోపాటు పట్టణాలు, నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించారు.
Share this article :

0 comments: