బాబు ఓ పిచ్చికుక్క - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు ఓ పిచ్చికుక్క

బాబు ఓ పిచ్చికుక్క

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

బాబు ఓ పిచ్చికుక్క: అంబటి రాంబాబు
బాబువి సంధి ప్రేలాపనలు: కొణతాల
వైఎస్ విగ్రహాల తొలగింపు తరం కాదు: బోస్
చెయ్యేస్తే బాబుకి రాజకీయ సమాధి: కరుణాకర్‌రెడ్డి
బాబుకు మళ్లీ కోటింగ్ తప్పదు: మారెప్ప


గుంటూరు/అనపర్తి (తూర్పుగోదావరి)/తిరుపతి/హైదరాబాద్/అనకాపల్లి (విశాఖ), న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తీవ్రంగా మండిపడింది. ‘‘విశ్వసనీయత లేని బాబు ఎన్ని డ్రామాలాడినా ప్రజలు, రైతులు నమ్మడం లేదు. అందుకే డిప్రెషన్‌కు లోనై, తీవ్ర నిరాశా నిస్పృహలతోనే వైఎస్‌పై నీచాతినీచంగా నోరు పారేసుకున్నారు’’ అంటూ దుయ్యబట్టింది. బాబు పిచ్చికుక్క మాదిరిగా మహా నేతను తూలనాడుతున్నారంటూ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తూర్పారబట్టారు. ‘‘మామను, తోడల్లుణ్ని, చివరికి తోడబుట్టినవాణ్ని కూడా మోసగించిన ఘనుడు బాబు. 

దేశంలో ఏ నాయకుడూ అనుసరించని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ప్రజాదరణకు దూరమై, రెండుసార్లు వైఎస్ చేతిలో ఓడినా అధికారంపై ఇంకా ఆశ చావలేదు. వైఎస్ విషయంలో బాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే ప్రజలు సహనం కోల్పోయి తిరగబడటం ఖాయం. బాబు వైఖరి మారకుంటే ఓటనే ఆయుధంతో ఆయన నాలుక కోస్తాం’’ అని గుంటూరులో విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. వైఎస్ అభిమానులకు తక్షణం బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబువి సంధి ప్రేలాపనలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త, మాజీ మంత్రి కొణతాల అనకాపల్లిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్ భయం, బాలయ్య రూపంలో సొంతింటి కుంపటితో బాబుకు ఊపిరాడటం లేదు’’ అన్నారు. 

జోలికెళ్తే తెలుస్తుంది: బోస్
వైఎస్ విగ్రహాల తొలగింపు బాబు తరం కాదని మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్ విగ్రహాల జోలికెళ్తే ప్రజాగ్రహమేమిటో తెలుస్తుందంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హెచ్చరించారు. వైఎస్ విగ్రహాలపై చెయ్యేస్తే జనమే బాబుకు రాజకీయంగా సమాధి కడతారని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతిలో అన్నారు. ‘‘ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్న వైఎస్ విగ్రహాలను చూసి బాబు బెంబేలెత్తుతున్నాడు. బాబు పోరుబాట డ్రామాను నమ్మే స్థితిలో జనం లేరు’’ అన్నారు. బాబుపై నక్సల్స్ దాడి చేసినా, ప్రజలు సానుభూతి చూపకపోగా, అధికారంలో నుంచి తొలగించి ఛీత్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు గుర్తు చేశారు. ‘‘ఈ జన్మలో అధికారంలోకి రాలేనని తెలిశాక బాబు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు’’ అన్నారు. రెండు ఎన్నికల్లో ఓడించి ప్రజలు సూపర్ కోటింగిచ్చినా బాబు మారలేదని, వైఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారి చేతుల్లో ఆయనకు మళ్లీ కోటింగ్ తప్పదని మాజీ మంత్రి మూలింటి మారెప్ప పేర్కొన్నారు.

తిరుపతి : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చేయి పెడితే రాష్ట్ర ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జరిగిన వార్డుబాట కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. ఎన్‌టీఆర్ చనిపోయి 16 సంవత్సరాలు కావస్తున్నా తన సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన విగ్రహం పెట్టించాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు. అన్న తీరు నచ్చక ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డిని వారి గుండెల నుంచి చెరిపేసేందుకు చంద్రబాబు నానా రకాల పాట్లు పడుతున్నారని విమర్శించారు. 
విద్యుత్ చార్జీలు పెంచి, రైతులపై కాల్పులు జరిపించి వారిని హత్య చేయించిన చంద్రబాబు ఇప్పుడు రైతు జపం చేస్తూ జరుపుతున్న పోరుబాట డ్రామాను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. అధికారంలో ఉండగా రైతులను చంపించిన చంద్రబాబు ఇప్పుడు వారి పేరుతోనే నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గు చేటని జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శించారు.

Share this article :

0 comments: