ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఒత్తిడి చేస్తాం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఒత్తిడి చేస్తాం’

ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఒత్తిడి చేస్తాం’

Written By ysrcongress on Thursday, January 12, 2012 | 1/12/2012

‘పెట్టుబడులు ఎక్కువయ్యాయి... కరువుతో పంటంతా దెబ్బ తింది. పసుపునకు నిరుడు ఉన్నంత ధరలో సగం కూడా ఇప్పుడు లేదు... మొత్తం అమ్ముకున్నా పెట్టుబడి సొమ్ము వచ్చేటట్టు లేదు. ఇప్పుడు ఆత్మహత్యలు తప్ప మరో గత్యంతరం లేదు...’ అంటూ నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన బచ్చల అంజయ్య, పెద్దొళ్ళ గంగారాం.. రైతు దీక్షా వేదికపై వైఎస్ జగన్‌ను కలిసి కంటతడి పెట్టారు. ‘వద్దు.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు’ అంటూ వారికి ధైర్యం చెప్పిన జగన్.. ‘అవసరమైతే ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఒత్తిడి చేస్తాం’ అని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో పసుపు శుద్ధి పరిశ్రమను నెలకొల్పితే తమకు మంచి మార్కెట్టు ఉంటుందని, గిట్టుబాటు ధర లభ్యమవుతుందని రైతులు జగన్‌కు చెప్పారు. కిరణ్ సర్కారు వచ్చినప్పటి నుంచి పసుపు ధర గణనీయంగా పడిపోయిందని మొర పెట్టుకున్నారు.

కరెంటు కోతతో చితికిపోయాం: అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన అంకాపూర్ ఆదర్శ గ్రామంలోనూ కరువు విలయతాండవం చేస్తోందని, సర్కారు విధించిన కరెంటు కోత ఇక్కడి రైతులతో చెలగాటమాడుతోందని ఆ ప్రాంత రైతులు.. తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ‘పసుపు సాగుకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలు ఖర్చవుతోంది. పంట మంచిగుంటే 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వర్షాభావం, వాతావరణం అనుకూలించక 15 నుంచి 18 క్వింటాళ్లు వస్తోంది. క్వింటాలుకు ఇప్పుడు మార్కెట్లో రూ.4 వేలు ధర వస్తోంది. గతంలో ఇదే క్వింటాలు రూ.14 వేల నుంచి రూ.16 వేలకు అమ్ముకున్నాం. ఇప్పుడు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రావటం లేదు.

క్విం టాలుకు రూ. 15 వేలు గిట్టుబాటు ధర ఇప్పిస్తే తప్ప మాకేం లాభం లేదు...’ అంటూ అంకాపూర్ రైతులు నర్సారెడ్డి, ఆలూరు నారాయణరెడ్డి, పీడీ గంగారాం, భూమారెడ్డి, కుంట గంగారెడ్డి.. జగన్‌తో అన్నారు. ‘కరెంటు సమస్య ఎక్కువైంది. ఏడు గంటలు అంటున్నారు. కానీ.. 5 గంటలు కూడా ఇవ్వటం లేదు. ఎప్పుడిస్తారో తెలియదు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. సొసైటీల ద్వారా సరఫరా చేస్తే బ్లాక్‌లో కొనాల్సి వచ్చింది...’ అంటూ సర్కారు నిర్వాకాన్ని వివరించారు. స్పందించిన జగన్.. ‘ఎగుమతి చేస్తే పసుపునకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మంచి రేటు వచ్చేలా ప్రయత్నిద్దాం...’ అని వారి వెన్నుతట్టారు.
Share this article :

0 comments: