సమాచారం ఇచ్చిన వ్యక్తిని, ఆరోపణలు చేసిన వారిని అరెస్టు చేయాల్సి ఉండగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమాచారం ఇచ్చిన వ్యక్తిని, ఆరోపణలు చేసిన వారిని అరెస్టు చేయాల్సి ఉండగా

సమాచారం ఇచ్చిన వ్యక్తిని, ఆరోపణలు చేసిన వారిని అరెస్టు చేయాల్సి ఉండగా

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012

* ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో ప్రధాన సూత్రధారి బాబే
* కక్ష సాధింపుతోనే సునీల్‌రెడ్డి అరెస్టు
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సూత్రధారుడైన స్టైలిష్ హోమ్స్ రంగారావును వదిలేసి సునీల్‌రెడ్డిని అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. రంగారావు ద్వారా వైఎస్ కుటుంబీకుల పేర్లను చెప్పించి కేసులో ఇరికించాలన్న కుట్ర జరుగుతోందని విమర్శించారు. మంగళవారం సునీల్‌రెడ్డిని కలుసుకోవడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. పార్టీ నేతలు రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టయిన నేతలను పరామర్శించారు. 

ఈ సందర్భంగా బాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మార్ కేసులో చంద్రబాబును వదిలేసి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మార్ కేసులో కీలక వ్యక్తి అయిన రంగారావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు సీబీఐ సునీల్‌రెడ్డిని అరెస్టు చేయడంవంటి వరుస సంఘటనలు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయని స్పష్టమవుతోందన్నారు. 

రంగారావు ఇచ్చిన సమాచారం ప్రకారం సునీల్ రెడ్డిని అరెస్టు చేశామని చెప్పిన సీబీఐ, సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం సమాచారం ఇచ్చిన వ్యక్తిని, ఆరోపణలు చేసిన వారిని అరెస్టు చేయాల్సి ఉండగా సునీల్‌ను ఒక్కడినే అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏ కేసులోనూ అధికారులను, అప్పటి మంత్రులను ప్రశ్నించకపోవడం, వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కక్ష సాధింపు, వేధింపుల్లో భాగంగానే సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారని దుయ్యబట్టారు. ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో ప్రధాన సూత్రధారి చంద్రబాబే అయినప్పటికీ, ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌కు చెంచాగిరీ చేస్తున్నందున సీబీఐ ఆ దిశగా విచారణ చేయడం లేదన్నది తేలిపోయిందన్నారు.
Share this article :

0 comments: