సాధారణ వాహనాల్లో తిరుగుతున్న జననేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాధారణ వాహనాల్లో తిరుగుతున్న జననేత

సాధారణ వాహనాల్లో తిరుగుతున్న జననేత

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

* జెడ్ కేటగిరీ నేతకు సెక్యూరిటీ సిబ్బందిని కుదించిన సర్కారు
* బులెట్‌ప్రూఫ్ వాహనం కేటాయింపులోనూ వివక్ష
* చేసేది లేక సాధారణ వాహనాల్లో తిరుగుతున్న జననేత

న్యూస్‌లైన్ ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రోజురోజుకీ భద్రతా సిబ్బందిని కుదించడంతో పాటు పోలీసు శాఖలో నిరుపయోగంగా మారిన బులెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆయన భద్రతకే ముప్పు తెస్తోంది. ఆయన హైదరాబాద్‌లో ఉన్నప్పుడు స్కార్పియో బులెట్‌ప్రూఫ్ వాహనం కేటాయిస్తున్న పోలీసు అధికారులు.. ఆయన విసృ్తతంగా జనంలో తిరిగేటపుడు మాత్రం అసౌకర్యంగా ఉండే పాత అంబాసిడర్ కేటాయిస్తున్నారు. దీని డైవర్‌ను నెలకోసారి మారుస్తుండడం, వాహనం పాతది కావడంతో అది తరచు మరమ్మతులకు గురవుతోంది. దీంతో చాలాసార్లు జగన్‌మోహన్‌రెడ్డి సాధారణ వాహనాల్లోనే ఓదార్పు యాత్రలో పాల్గొనాల్సి వస్తోంది. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి ఇలా సాధారణ వాహనంలో తిరిగే పరిస్థితి తీసుకొస్తున్న సర్కారు వైఖరిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదుగురిలో ఇప్పుడు ముగ్గురే
జెడ్ కేటగిరీలో ఉన్న జగన్‌కు ప్రభుత్వం 4+1 సెక్యూరిటీని కల్పించింది. ఓదార్పు యాత్రలో అడుగడుగునా జనం పోటెత్తుతున్న నేపథ్యంలో ఆయనకు భద్రత సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన సర్కారు.. తాజాగా ఇద్దరిని తగ్గించింది. దీంతో గుంటూరు ఓదార్పు యాత్రలో ముగ్గురు మాత్రమే ఆయన వెంట ఉంటున్నారు. మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయించిన పాతకాలంనాటి బులెట్‌ప్రూఫ్ అంబాసిడర్ కారు అసౌకర్యంగా ఉండడంతో ఆయన సొంత బులెట్‌ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణిస్తున్నారు. మంగళవారం అది బ్రేక్ డౌన్ అవడంతో ఆయన మరోసారి సాధారణ వాహనంలో పర్యటించాల్సి వచ్చింది. దీంతో జగన్ భద్రతలో లొసుగులు బయటకొచ్చాయి.

పట్టించుకోని సర్కారు
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఇతర భద్రతా పరమైన అంశాల నేపథ్యంలో జగన్ భద్రత పెంచాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నేతలు పోలీసు బాసులను ఇప్పటికే కోరారు. అలాగే జగన్ స్వయంగా తనకు నూతన బులెట్ ఫ్రూఫ్ స్కార్పియో వాహనాన్ని కేటాయించాల ని ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డెరైక్టర్ జనరల్ ఎం.మహేందర్‌రెడ్డికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఇద్దరు డ్రైవర్లను కేటాయించాలని కూడా కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు.

బాబుకి 9 బులెట్‌ప్రూఫ్ వాహనాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి తొమ్మిది బులెట్‌ఫ్రూఫ్ వాహనాలను, 18 మంది డ్రైవర్లను పోలీసుశాఖ దాదాపుగా 12 ఏళ్లనుంచి కొనసాగిస్తోంది. ఇక సెక్యూరిటీ ఐతే ఏకంగా ఎన్‌ఎస్‌జీ కమాండర్లే ఉన్నారు. డ్రైవర్ల విషయంలో ఎలాంటి కాలపరిమితి షరతులు లేకుండా ప్రభుత్వం చూస్తోంది. అయితే జగన్ విషయంలో డ్రైవర్లను నిత్యం మారుస్తోంది. వాస్తవానికి బులెట్‌ఫ్రూఫ్ వాహనానికి ప్రత్యేక శిక్షణ ఉన్న డ్రైవర్లనే కేటాయిస్తారు. నెలకో డ్రైవరును మార్చడం, అదీ పూర్తి శిక్షణ లేని డ్రైవర్లను కేటాయించడంతో తరచూ అవి మరమ్మతులకు గురవుతున్నాయి.

ప్రభుత్వం వివక్ష చూపుతోంది: మర్రి
జగన్‌కు ఏమైనా జరిగితే ఈ రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ హెచ్చరించారు.ఆయనకు కొత్త బులెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, భవిష్యత్ పరిణామాలకు ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, ఐజీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

జగన్‌కు ఏదైనా జరిగితే సర్కారుదే బాధ్యత: జూపూడి
హైదరాబాద్: జగన్‌కు భద్రతను తగ్గించి, బులెట్‌ప్రూఫ్ వాహనం కేటాయింపులో వివక్ష చూపుతున్న ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. జగన్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే రాష్ట్రం అగ్ని గుండమే అవుతుందన్నారు.
Share this article :

0 comments: