దుకాణాలు తగ్గిపోయి చివరకు వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దుకాణాలు తగ్గిపోయి చివరకు వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం

దుకాణాలు తగ్గిపోయి చివరకు వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012

అధికారంలోకి వచ్చాక తొలిరోజే దానిపై సంతకం 
దేశంలో ఎక్కడా లేని పన్ను కేవలం మన రాష్ట్రంలోనే ఎందుకు?
వ్యాట్ వల్ల 3.50 లక్షల కుటుంబాలపై ప్రభావం
దుకాణాలు తగ్గిపోయి చివరకు వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం
ఉద్యోగాలిస్తామని చెప్తూ.. ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి తెస్తున్నారు
నిత్యావసరాల ధరలన్నీ పెంచడంతో సామాన్యుడిపై ఏడాదికి రూ.1,400 భారం
రూ.2 బియ్యాన్ని రూ.1కి చేసి ఏటా రూ.240 మాత్రమే తగ్గిస్తోందీ ప్రభుత్వం
ఆ రూ.1 బియ్యం ప్రచారానికి మాత్రం రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారు
ఈ ప్రభుత్వ పెద్దలకు సోనియాను మెప్పించడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదు
వస్త్ర వ్యాపారుల సమ్మెపై స్పందించకపోతే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం

నరసరావుపేట నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి:దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే చిన్న చిన్న వస్త్ర వ్యాపారులను కూడా వదలకుండా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధిస్తున్నారని, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పెద్దలపై మండిపడ్డారు. అమలు చేస్తే దేశం మొత్తం ఒకే విధానం అమలు చేయాలన్నారు. లేదంటే రాబోయే సువర్ణయుగంలో ముఖ్యమంత్రి స్థానంపై కూర్చున్న తొలి రోజునే వస్త్రాలపై ‘వ్యాట్’ రద్దు చేస్తూ సంతకం చేస్తానని వస్త్ర వ్యాపారులకు, ఆర్య వైశ్యులకు ఆయన హామీ ఇచ్చారు. పంచదార, కిరోసిన్ కోటా తగ్గించి, కరెంటు చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఈ ప్రభుత్వం ప్రతి కుటుంబం మీద ఏటా రూ.1,400 అదనంగా భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వస్త్రాలపై ప్రభుత్వం విధించిన 5 శాతం వ్యాట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా వ్యాపారులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వైఎస్సార్ చౌక్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలుపంచుకొని ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న దుకాణాలను కూడా వదలడం లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. మన రాష్ట్రంలో బట్టల వ్యాపారులపై 5 శాతం వ్యాట్ విధిస్తున్నారని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉందని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు చెప్తున్నా. అన్ని రాష్ట్రాల్లో ఒకే మాదిరిగా ట్యాక్సులు(పన్నులు) ఉండాలి కాబట్టి, మేం వ్యాట్ తీసుకొస్తున్నామని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దానికి పూర్తి విరుద్ధంగా ఇక్కడి ప్రభుత్వం చేస్తోంది. నిన్ననే అనుకుంటా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు ఒక మాట అన్నారు. ‘అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది(వస్త్రాలపై వ్యాట్) పెట్టేస్తారు. మేం మూడు నెలల ముందు మాత్రమే తీసుకొచ్చాం’ అని ఆయన చెప్పారు. అయ్యా..! రామనారాయణరెడ్డి గారూ.. ఇది జనవరి. మూడు నెలల కిందట అంటే నవంబర్. మీరు టాక్స్‌లు తెచ్చింది జూలైలో. మీకు నవంబర్‌కు జూలైకి తేడా కూడా తెలియకుండా పోయిందా?

పత్తి వినియోగంపైనా ప్రభావం..: వస్త్రాలపై ఈ వ్యాట్ విధించడం వల్ల దాదాపుగా 1.50 లక్షల దుకాణాలను ఇది ప్రభావితం చేస్తుంది. దుకాణానికి కనీసం ఇద్దరు చొప్పున పని చేసేవారు ఉంటారు అనుకుంటే, దాదాపుగా 3 నుంచి 3.50 లక్షల కుటుంబాలు ఈ దుకాణాల మీద ఆధారపడుతున్నాయి. రూ.100కు ఐదు రూపాయలు చొప్పున ట్యాక్స్ వేయడం వలన వారి కొనుగోలు శక్తి తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో దుకాణాలు కూడా తగ్గిపోయి, వేధింపులు ఎక్కువయ్యే పరిస్థితులు వస్తాయి. వేధింపులు ఎక్కువై లంచాలు పెరిగిపోయే పరిస్థితి వస్తుంది. లంచాలు ఎక్కువై దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. చివరకు ఉద్యోగాలు పోయే పరిస్థితులు వస్తాయి. ఒక వైపేమో.. రాజీవ్ యువ కిరణాలు.. కిరణ్ యువకిరణాలు అంటావు. ఉద్యోగాలు ఇస్తామని ఒకవైపు చెప్తూనే.. మరోవైపు మీరు చేస్తున్న పనుల వలన చిన్నచిన్న దుకాణాల్లో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు పోయి రోడ్డున పడే పరిస్థితులు మీకు కనపడటం లేదా? ఇది ఇంతటితో ఆగిపోదు. ఈ భారం పత్తి రైతుల మీద పడే ప్రమాదం కూడా ఉంది. కారణం ఏమిటీ అంటే.. కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో, అప్పుడు పత్తి వినియోగం కూడా తగ్గి పోతుంది. పత్తి వినియోగం లేకపోవడంతో ఇవాళ క్వింటాల్ పత్తికి పలుకుతున్న రూ.3,500 ఇంకా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది.

సోనియాను మెప్పించడమే చాలు వీళ్లకు...

ఇవాళ రైతులను ఆదుకునే నాథుడు లేడు. చదువుకుంటున్న పేద విద్యార్థిని ఆదుకునే నాథుడు లేడు. చివరకు చిన్న చిన్న దుకాణాలను నడుపుకొంటున్న ఆర్యవైశ్య సోదరులను సైతం బాదేంతగా ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఆ దివంగత నేత వైఎస్సార్‌ను చూసి ప్రజలు ఓటేసింది.. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోసమా.. అని బాధనిపిస్తోంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తే వైఎస్సార్ సువర్ణయుగం గుర్తుకు వస్తోంది. కారణం ఏమిటంటే.. ఆ ఐదు సంవత్సరాలూ.. ఇవాళ్టికీమర్చిపోలేని సువర్ణయుగం. ఇవాళ ఈ రాష్ట్ర పెద్దలకు ఏం కావాలీ అంటే? వీళ్లు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా ప్రజల్లోకి రారు వీళ్లు. వీళ్లకు అసలు ప్రజలతో పనే లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఒక్క సోనియా గాంధీని మెప్పించడం తప్ప మరోటి లేదు.

కూకటివేళ్లతో పెకిలిస్తాం... 

చేస్తే దేశం అంతటా ఒకే విధానం తీసుకొని రండి. లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వ్యాట్‌ను వెంటనే తీసేయండి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్తున్నా. ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా బహుశా ఈ ఎనిమిది రోజుల సమ్మె సరిపోతుందో.. సరిపోదో.. నాకైతే తెలియదు. అందరం ఏకం కావాలి. ఒక్కటై ఆ చిన్నచిన్న దుకాణాల వారిని ఆదుకునేందుకు ముందడుగు వేయాలి. ఎనిమిది రోజుల సమ్మె చేస్తామని చె ప్పి ముందే నోటీసులు ఇచ్చాం.. ఆరు నెలల నుంచీ వస్త్ర వ్యాపారులు పోరాటం చేస్తూ ఉన్నారు. అయినా కూడా కనీసం పట్టించుకునే నాథుడు లేని అధ్వాన పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడుతున్నాయి. ఈ ఉద్యమంలో భాగంగా ఆర్డీవో దగ్గరకు వెళ్లి ఇక్కడ మేం చేస్తున్న సమ్మెను ముఖ్యమంత్రిగారికి పంపించాలని వినతిపత్రం ఇస్తాం. ఇచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందేమో.. అని చూస్తాం. కదలకపోతేమటుకు.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరిస్తున్నాను. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. చిన్నచిన్న వ్యాపారులకు సంఘీభావం తెలిపేందుకు ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

రూ.240 తగ్గించి.. 1,400 పెంచారు

‘‘ఒక వ్యక్తి బతకాలి అంటే ఆ వ్యక్తికి ఏడాదికి కనీసం నాలుగు చొక్కాలు, నాలుగు లుంగీలు, నాలుగు బనియన్లు, నాలుగు నిక్కర్లు కావాలి. వీటి కోసం సంవత్సరానికి ఆ వ్యక్తి ఖర్చు చేసేది రూ. వెయ్యి. ఆ కుటుంబంలో కనీసం నలుగురు ఉంటారు అనుకుంటే రూ.4,000 ఖర్చవుతుంది. ఆ రూ. 4 వేల మీద ఐదు శాతం వ్యాట్ అంటే సంవత్సరానికి ఆ కుటుంబం మీద రూ. 200 అదనపు భారం పడుతోంది. కిరోసిన్ చూద్దామా.. అంటే, మూడు లీటర్లు ఇస్తున్న కిరోసిన్‌ను ఒక లీటర్‌కు తగ్గించారు. మార్కెట్‌లో లీటర్ కిరోసిన్ రేటు రూ. 30. అదే కిరోసిన్‌ను రేషన్‌లో కొంటే రూ. 15. కిరోసిన్ కోటా తగ్గించడం వల్ల నెలకు సామాన్యుడిపై అదనంగా పడుతున్న భారం రూ.30. సంవత్సరానికి లెక్కేస్తే రూ.360. పంచదారేమో.. ఇంతకుముందు ఒక కేజీ ఇచ్చేవారు. 

ఇది ఇప్పటికే అర్ధ కేజీకి తగ్గించారు. ఇలా తగ్గించినందుకు ప్రజలపై పడే భారం రూ.10. అంటే సంవత్సరానికి రూ. 120. నిత్యావసరాల మీద 4 నుంచి 5 శాతం వ్యాట్ పెంచినందు వలన నెలకు రూ.15 చొప్పున సంవత్సరానికి రూ. 180 భారం పడుతోంది. పెంచిన కరెంటు చార్జీలు చూస్తే నెలకు రూ. 20 చొప్పున సంవత్సరానికి రూ. 240 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పెంచిన బస్ చార్జీలు చూద్దామా.. అంటే నెలకు రూ.20, సంవత్సరానికి రూ. 240. మొత్తం కలిపి చూస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.1,400 భారం పెంచారు అనే సం గతి చెప్పటానికి మీకు సిగ్గుగా లేదా అని నేను అడుగుతున్నా. ఒక వైపేమో.. రూ.1400 పెంచారు. మరోవైపేమో.. కేజీ రెండు రూపాయల బియ్యం రూపాయి చేశామని చెప్పి నెలకు రూ. 20 చొప్పున ఏడాదికి రూ.240 తగ్గిం చారు. నికరంగా పెంచింది రూ.1,400.. తగ్గించిందేమో రూ.240. ఇంత తగ్గిం చామని చెప్పి పబ్లిసిటీ చేసుకోడానికి రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నారు’’.
Share this article :

0 comments: