గ్రామీణ నీటి పథకాలకు గ్రహణం!మూడేళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రామీణ నీటి పథకాలకు గ్రహణం!మూడేళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం

గ్రామీణ నీటి పథకాలకు గ్రహణం!మూడేళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

రాష్ట్రంలో గ్రామీణ మంచినీటి పథకాలకు గ్రహణం పట్టింది. అసలే కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇప్పటికే ప్రారంభమైన పలు పథకాలు నిధులు లేక అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. ఇదివరకే చేసిన పనులకు గాను రూ.200 కోట్ల బకాయిలు చెల్లించని పక్షంలో పనులు కొనసాగించలేమంటూ కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం పేరుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా.. ఒక్కపైసా కూడా విడుదల చేయడం లేదని అధికారులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,000 కోట్లు విడుదల కాని వైనాన్ని.. ఇటీవల జరిగిన కొత్త బడ్జెట్ కసరత్తు సమావేశాల సందర్భంగా అధికారులు ఆర్థిక మంత్రి దృష్టికి కూడా తెచ్చినట్లు సమాచారం. నిధుల జాప్యంతో పథకాలు సంవత్సరాల తరబడి కొన‘సాగుతూ’నే ఉన్నాయి. వచ్చేది వేసవి కాలం కాగా.. పథకాలను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు తాగునీరందించాలన్న కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ), నాబార్డు, హడ్కో రుణాలతో పాటు, ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రుణంతో కూడా మంచినీటి పథకాలు చేపడుతున్నారు. ఇందులో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోనే కొంతవరకు పనులు జరుగుతున్నాయి. 

రాష్ట్రంలో ప్రస్తుతం 350 సమగ్ర రక్షిత మంచి నీటి పథకాలు, దాదాపు ఆరువేల ‘ఒక గ్రామ పథకాలు’ (సింగిల్ విలేజ్ స్కీమ్స్)తోపాటు..గతంలో చేపట్టిన కొన్ని పథకాలు కూడా చిన్నచిన్న పనులు మిగిలిపోవడం వల్ల పూర్తికాకుండా ఉన్నాయి. కేంద్రం ఏటా రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు రాష్ట్ర తాగునీటి పథకాల కోసం కేటాయిస్తోంది. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటుగా 30% మేరకు నిధులు సమకూర్చాలి. తన వాటా విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పథకాలు పూర్తికావడం లేదు. గడిచిన మూడేళ్లుగా ఇదే పరిస్థితి. ఈ విధంగా ఏకంగా వెయ్యికోట్ల వరకు నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. 2009-10లో రూ.339 కోట్లు, 2010-11లో రూ.389 కోట్లు, 2011లో రూ.360 కోట్లు విడుదల కావాల్సి ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. వీటి కోసం గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. కేంద్రం తన వాటా నిధులు ఆపేస్తామని హెచ్చరించినా చలనం లేదు. రక్షిత మంచినీటి పథకాలు లేని కారణంగా కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారు.
Share this article :

0 comments: