రేపటి ఓదార్పుయాత్రకు బ్రేక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి ఓదార్పుయాత్రకు బ్రేక్

రేపటి ఓదార్పుయాత్రకు బ్రేక్

Written By ysrcongress on Thursday, January 5, 2012 | 1/05/2012

గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రను శుక్రవారం రోజున నిలిపివేసినట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు మర్రి రాజశేఖర్, తలశిల రఘురాం తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ తోట గోపాలకృష్ణ అంత్యక్రియలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతుండటంతో ఓదార్పుయాత్రను శుక్రవారం రోజున నిలిపివేసినట్టు రాజశేఖర్ తెలిపారు. శనివారం నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర యథావిధిగా కొనసాగుతుందని వారు ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రోజున కిర్లంపూడిలో తోట గోపాలకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.

అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తోట గోపాలకృష్ణ కుటుంబాన్ని గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు.



 వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు తోట గోపాలకృష్ణ మృతి పట్ల పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎం.పిగా ఎన్నికైన గోపాలకృష్ణ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి చాలా సన్నిహితుడనీ, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను వై.ఎస్‌కు పదే పదే వివరించి దాని రూపకల్పనకు కారకుడయ్యారనీ వారు నివాళులర్పించారు. ఆయన మృతికి పార్టీ తరపున వారి కుటుంబాని సానుభూతిని తెలుపుతున్నామని వారన్నారు. తోట మృతి తమ పార్టీకీ, ప్రజాస్వామ్యానికి తీరని లోటని వారు పేర్కొన్నారు.


కిర్లంపూడితో పాటు పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తోట సుబ్బారావు నాయుడు, వీర రాఘవమ్మ దంపతులకు 1953 మార్చి 27వ తేదీన జన్మించిన తోట గోపాలకృష్ణ ఎంఏ ఇంగ్లీషులో పట్టా పొందారు. చదువు పూర్తి చేసుకున్న ఆయనకు అప్పటి మెట్ట ప్రాంత రాజకీయ దురంధరుడు పంతం పద్మనాభం రాజకీయ గురువుగా మారారు. గోపాలకృష్ణను పెద్దాపురం సమితి అధ్యక్షుడిగా రెండుసార్లు చేశారు. 

1984లో కాకినాడ లోక్‌సభకు టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. రెండు పర్యాయాలు ఎంపీగా పని చేసిన ఆయన 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌లో చేరారు. 2004లో పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2009లో ఓటమి చవిచూశారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక భూమిక పోషిస్తున్నారు. ఆయన మృతికి అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
Share this article :

0 comments: