పల్లెలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పల్లెలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నాయి

పల్లెలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నాయి

Written By ysrcongress on Wednesday, January 18, 2012 | 1/18/2012

అదే హోరు. అదే జోరు. పల్లెలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నాయి. ఆయన నడిచే దారిలో వేలాది పాదాలు కదులుతున్నాయి. ఓదార్పు యాత్రలో ఏ పల్లెను కదిపినా జగన్.. జగన్ అంటూ పలవరిస్తున్నాయి. వేల గొంతుకలు ఒక్కటై జగన్ని నాదాన్ని వినిపిస్తున్నాయి. జననేతకు స్వాగతం పలికేందుకు గుండె ద్వారాలు తెరుస్తున్నాయి. ఊరి పొలిమేరలకు ఎదురేగి సుస్వాగతం పలుకుతున్నాయి. మాట తప్పని, మడమతిప్పని ఆయన నైజానికి గ్రామ సీమలు హ్యాట్సాఫ్ చెబుతుండగా నాలుగో విడత ఓదార్పు యాత్రలో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి మండలం దిడుగు నుంచి ముందుకు సాగుతున్నారు.
పెదకూరపాడు, న్యూస్‌లైన్ : జననేతకు జన స్వాగతం లభించింది. పల్లెప్రజలు జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. మహిళలు హారతులిచ్చి గ్రామాల్లోకి సాదరంగా ఆహ్వానించారు. అన్నదాతలు, వలస కూలీలు తమ కష్టాలను వెళ్లబోసుకున్నారు. ఇలా ఓదార్పుయాత్ర ఆద్యంతం జన సంద్రం నడుమ సాగింది. జిల్లాలో నాలుగో విడత ఓదార్పుయాత్ర మంగళవారం అమరావతి మండలం దిడుగు గ్రామం నుంచి ప్రారంభమైంది. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో జగన్ గన్నవరం చేరుకున్నారు. తాడేపల్లి, తుళ్ళూరు మీదుగా అమరావతి చేరుకొని యాత్రను ప్రారంభించారు. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఆరు గ్రామాల్లో 13 కిలోమీటర్లు పర్యటించి ఆరు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. 

యాత్ర జరిగిందిలా.. పెదకూరపాడు నియోజకవర్గ నేతలు అమరావతిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి చైతన్యబ్యాంక్, ధరణికోట ఇసుకరేవు సెంటర్, కళాశాల సెంటర్, ఎస్‌బీఐ వద్ద విద్యార్థులు, మహిళలు జగన్‌కు నీరాజనం పలికారు. అక్కడ నుంచి ధరణికోట ముత్తాయపాలెం మార్గమధ్యంలో, ఎత్తిపోతల పథకం, దిడుగు గ్రామం వద్ద కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వలస కూలీలతో మాట్లాడారు. అనంతరం దిడుగు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఎస్సీ కాలనీలో వృద్ధురాలు ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లూథరన్, ఆర్‌సీఎం చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. 

బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. అనంతరం దిడుగు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జూపూడి పయనమైన జగన్‌ను మార్గమధ్యంలోని తమ్మవరం అడ్డరోడ్డు, మల్లాది అడ్డరోడ్డు వద్ద ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం మల్లాది ఎస్సీ కాలనీకి చేరుకున్న జగన్‌కు వికలాంగురాలు శ్యామల తన సమస్యలను విన్నవించింది. ఆయన్ని ఆర్‌వీఎం చర్చికు తీసుకెళ్లి, ప్రార్థనలు నిర్వహించారు. పొందుగల అడ్డరోడ్డులో వలసకూలీలు జగన్‌కు సమస్యలను విన్నవించారు. జూపూడి గ్రామ శివారులో మునగోడు గ్రామస్తులు తమ గ్రామంలో పర్యటించాలని జగన్ కాన్వాయ్‌ను ఆపారు. ‘రేపు వస్తాను’ నని జగన్ బదులు ఇవ్వడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అనంతరం జూపూడిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఎస్సీ కాలనీ చర్చిలో ప్రార్థనలు నిర్వహించి, స్థానికుడు జనమాల పీటర్‌పాల్ ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్నారు. 

అనంతరం నూతల కుంట అడ్డరోడ్డు వద్ద మహిళలు ఘన స్వాగతం పలికారు. అత్తలూరు ఎస్సీ కాలనీలో కనక తప్పెట్లతో ప్రజలు స్వాగతం పలికారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. చర్చి ఫాదర్ అరుణ్ పాపారావు నివాసంలో జరిగిన అల్పాహార విందుకు హాజరయ్యారు. ఎస్సీ కాలనీ, చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. బుచ్చయ్యపాలెం, రామాపూరంలో ప్రజలు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాత్ర పెదకూరపాడుకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంద్‌పేట, బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి, ప్రసంగించారు. అనంతరం స్థానికుడు చుండు రత్తయ్య నివాసానికి రాత్రి బసకు వెళ్లారు. 
 అప్పులపాలయ్యాం.. ఆదుకోవయ్యా అంటూ ఉల్లిరైతులు వైఎస్ జగన్‌ను వేడుకున్నారు. అకాలవర్షాలు, గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని జననేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఓదార్పుయాత్రకు బయల్దేరిన జగన్ మండలంలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లోని ఉల్లి రైతుల పొలాలను పరిశీలించారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ‘పంటకు గిట్టుబాటు ధర లేదయ్యా. కిలో రూపాయికి, రెండు రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. వేలాది రూపాయలు నష్టపోయాం’ అని రైతులు వాపోయారు. జగన్ పంటలను పరిశీలించి, రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

జననేతకు వినతి
బోరుపాలెం(తుళ్ళూరు): ఓదార్పుయాత్రకు వెళ్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మండల ప్రజలు నీరాజనం పలికారు. వేలాది మంది రోడ్ల వెంబడి బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. పలుచోట్ల జగన్ కారు దిగి మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. బోరుపాలెం వద్ద రైతులు తమ సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంటనష్టం వివరాలకు ఆయన దృష్టికి తెచ్చారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. రైతులు, కూలీలు ఎవరూ అధైర్యపడొద్దని, మంచిరోజులు త్వరలో వస్తాయని జగన్ వారికి భరోసా ఇచ్చారు. 

బొబ్బరితెగులుతో ఆరిపోయాం 
అమరావతి: ‘ఈ ఏడాది మిర్చిరైతులమంతా బొబ్బరి తెగులతో ఆరిపోయాం. ఇటీవల కురిసిన వర్షాలకు పండిన పంటంతా తడిసి, పాడైపోయింది. అయినా ప్రభుత్వం మా గురించి పట్టించుకోవడం లేదు’ అంటూ జూపూడి గ్రామానికి చెందిన మిర్చిరైతులు మాగులూరి వీరయ్య, ఆంజనేయులు జగన్‌కు మొరపెట్టుకున్నారు. వర్షానికి తడిసి తాలుగా మారిన కాయలను రెండువేలకు కూడా కొనే దిక్కులేదని వాపోయారు. జగన్ స్పందిస్తూ.. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఉండడం మన దురదృష్టం. కొద్దికాలం ఓపిక పడితే మంచిరోజులు వస్తాయి అని ఓదార్చారు. పొందుగల, బయ్యవరం, దిడుగు గ్రామాల రైతులు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు.

మా ఊరు రావాల్సిందే..

అమరావతి, న్యూస్‌లైన్: అమరావతి నుంచి పెదకూరపాడు వెళ్తున్న జగన్ కాన్వాయ్‌ను పందుగల అడ్డరోడ్డు వద్ద మునగోడు గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావాల్సిందేనని పట్టుబట్టారు. ‘ఇప్పటికే మూడుసార్లు పర్యటన వాయిదా పడింది. ఈసారి తప్పనిసరిగా రావాల్సిందే. గ్రామంలో మూడు వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపారు. ‘బుధవారం తప్పనిసరిగా మీ గ్రామానికి వస్తాను. విగ్రహాలను ఆవిష్కరిస్తాను’ అని జగన్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

ప్రత్యేక ప్రార్థనలు
కృష్ణాయపాలెం(మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని కృష్ణాయపాలెం న్యూషాలేము చర్చిలో వైఎస్ జగన్ మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వచ్చారని తెలిసి గ్రామస్తులు పెనుమాక రోడ్డు వద్ద కాన్వాయ్‌ను అడ్డగించి, గ్రామానికి తీసుకెళ్లారు. చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.

బైబిల్ బహూకరణ
అమరావతి: మల్లాది ఎస్సీకాలనీ వద్ద జననేతకు తోకల సౌజన్య బైబిల్‌ను బహూకరించింది. జగన్ ఆమెను ఆప్యాయంగా పలకరించి, ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ పిల్లలను జగన్‌కు అందజేశారు. అనంతరం మల్లాది, దిడుగు ఎస్సీకాలనీలోని లూథరన్, ఆర్‌సీఎం, జూపూడిలోని ఆర్‌సీఎం, అత్తలూరు పునీత థామస్ వారి ఆర్‌సీఎం చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఘన స్వాగతం
తాడేపల్లి/అమరావతి, న్యూస్‌లైన్: ఓదార్పుయాత్రకు వెళ్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఘన స్వాగతం లభించింది. మహిళలు, యువకులు, రైతులు రోడ్ల వెంబడి నిలబడి అపూర్వ స్వాగతం పలికారు. కేఎల్‌రావు కాలనీ, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి పంచాయతీ వద్ద మహిళలు హారతులు పట్టారు. పెనుమాకలో వికలాంగురాలు డేగల రేవతిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. అభిమాన నేతతో కరచాలనం చేసేందుకు యువకులు పోటీపడ్డారు. జననేత అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పెదకూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్‌కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మద్దూరు అడ్డరోడ్డులో అభిమానులు జగన్‌పై పూలవర్షం కురిపించారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తోందా..
అమరావతి, న్యూస్‌లైన్: మండలంలోని ధరణికోటలో ఉన్న ఆర్‌వీవీఎన్ కళాశాల విద్యార్థులు జగన్ రాక కోసం ఉదయం నుంచి వేచిచూశారు. ఆయన రాగానే కేరింతలు కొడుతూ సందడి చేశారు. వారిని చూసిన జగన్ కాన్వాయ్ దిగి విద్యార్థులను పలకరించారు. ‘ఎలా చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందా.. అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉన్నారా’ అని అడిగి తెలుసుకున్నారు.

హసన్‌ను ఆదుకుంటాం: ఆర్కే
పట్నంబజారు(గుంటూరు), న్యూస్‌లైన్: మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని తెనాలి నుంచి కుంకలగుంటకు తీసుకెళ్తున్న సమయంలో బాణసంచా పేలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త షేక్ హసన్ ఆదివారం తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న హసన్‌ను పార్టీ నాయకుడు ఆర్కే మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హసన్ కోలుకునే వరకూ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యసేవలందించాలని ఆయన వైద్యులకు సూచించారు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హసన్‌ను పరామర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), డాక్టర్ సాంబశివారెడ్డి, నాగూల్‌మీరా, బ్రహ్మం, శ్యామ్ తదితరులు ఉన్నారు.

అంబేద్కర్‌కు నివాళి
అమరావతి, న్యూస్‌లైన్: మండలంలోని జూపూడి ఎస్సీ కాలనీలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి జననేత పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటించిన జగన్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

ముఖ్యనేతల హాజరు
విగ్రహావిష్కరణల సందర్భంగా జరిగిన సభలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సెల్ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్, నాయకులు డైమండ్ బాబు, ఆతుకూరి ఆంజనేయులు, యేటిగడ్డ బుజ్జి, పులివర్తి రత్నబాబు, గుత్తికొండ అంజిరెడ్డి, కట్టా సాంబయ్య, జీవీఆర్‌ఏఎల్ నరసింహశాస్త్రి, అచ్యుత శివప్రసాద్, గంగదాసు శ్రీధర్‌రెడ్డి, గార్లపాటి ప్రభాకర్, దొంతిరెడ్డి కృష్ణారెడ్డి, పుల్లా పాల్ ప్రసాద్, మామిడి ప్రకాష్, బెల్లంకొండ మీరయ్య, జగన్ కోటి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: