ఆరు దూలాల ఇల్లున్న రామోజీకి తొమ్మిది దూలాల ఇల్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరు దూలాల ఇల్లున్న రామోజీకి తొమ్మిది దూలాల ఇల్లు

ఆరు దూలాల ఇల్లున్న రామోజీకి తొమ్మిది దూలాల ఇల్లు

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

‘‘ఆరు దూలాల ఇల్లున్న రామోజీకి తొమ్మిది దూలాల ఇల్లు’’ తన ఎదురుగానే ఎవరైనా కట్టుకుంటుంటే ఎంతటి అసహనం వస్తుందో పదహారేళ్ళ క్రితం ఓ పత్రికా రచయిత విశ్లేషించారు. ఇక్కడ ఆరు దూలాలు అంటే ఆరు యూనిట్లు. పోటీగా తొమ్మిది యూనిట్లతో ప్రారంభమైన పత్రికను లక్ష్యంగా చేసుకుని అడ్డదిడ్డంగా అప్పట్లో ఈనాడు కథనాలు అల్లేది. నిన్నటి సంచికలో ఆ పత్రిక చేసినది కూడా సరిగ్గా అలాంటి పనే! ‘‘ఆధునిక శైలిలో నిర్మించిన భవంతి’’ అంటూ హైదరాబాద్‌లోని సాక్షి కార్యా లయం ఫొటో వేసి ఈ సంస్థలో పెట్టుబడుల గురించి అలవాటైన పద్ధతిలో అవాకులు రాసుకుపోయారు. ఇంతకూ రామోజీకి ఇప్పుడు సాక్షి భవంతి ఎందుకు గుర్తుకు వచ్చింది? ఆ అత్యాధునిక భవంతి, పత్రిక, దానికి దక్కుతున్న ఆదరణ గురించి ఈ క్షణాన మరోసారి శోకించాలని ఎందుకు కోరిక కలిగింది?

దృష్టి మళ్ళించడానికే... 
ఎందుకు కలిగిందంటే... రామోజీ కంపెనీల్లోకి వచ్చిపడిన రిలయన్స్ నిధుల వరదను చూసి కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు కలకలం రేగుతోంది. ఆ అంశం నుంచి తన పాఠకుల కళ్ళు కప్పటానికి, దృష్టి మళ్ళించటానికి ‘ఈనాడు’ తన దుష్ట విద్యను ప్రద ర్శించింది. ఏనాడో 2009 నవంబరులోనే ‘సాక్షి’ బయ టపెట్టిన విషయం తిరుగులేని నిజంగా నిరూపణ అవుతోంది. కేవలం 37 రోజుల వ్యవధిలో ఆరు డొల్ల కంపెనీలను సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్... తొలి విడతగా ఏకంగా రూ.1,424 కోట్లను ఆ దారిలో మళ్ళించిందని బట్టబయలు చేసినది ‘సాక్షి’ మాత్రమే. రెండో విడతతో కలుపుకొంటే ఈనాడు గ్రూపులోకి వచ్చిన రిలయన్స్ సొమ్ము ఏకంగా 2,600 కోట్లు. ఈ విషయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య వైఎస్ విజయమ్మ తన పిటిషన్‌లో ఫ్లో-చార్టులతో వివరిం చారు. మరో లక్ష్యం లేకుండా రామోజీ సంస్థల్లోకి నిధులు ప్రవహింపజేయటానికే రిలయన్స్ సృష్టించిన కంపెనీలివి. అల్లిబిల్లి కంపెనీలు లేదా డొల్ల కంపెనీలు లేదా డబ్బా కంపెనీలు అంటే అవి. 

సాక్షి చెప్పిందే నిజమైంది... 
ఆ కంపెనీల ద్వారా తాను తోడుకున్న వందల కోట్ల రూపాయలకు సంబంధించి వైఎస్ విజయమ్మ పిటిషన్ తరవాతే రిలయన్స్ కలుగులోంచి బయటకు వచ్చి ఆ పెట్టుబడులు తానే పెట్టానని కేవలం మూడంటే మూడు రోజుల క్రితం మొట్టమొదటిసారిగా ఒప్పుకుంది. ఇంతకీ రామోజీ నష్టాల కంపెనీల్లో రెండు విడతలుగా రూ.2600 కోట్లు ఎక్కడో ఉన్న అంబానీలు ఎందుకు పెట్టుబడి పెట్టారు? ఎవరి ప్రోద్బలం ఉంది? అసలు అదంతా ఎవరి డబ్బు? బహిరంగంగా కాకుం డా ఎందుకు అల్లిబిల్లి కంపెనీల దారిలో సొమ్ము తెచ్చా రు? అందుకు అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్టర్లను ముంచిన నాగార్జునా ఫైనాన్స్ సంస్థ డెరైక్టరైన నిమేశ్ కంపానీని ఎందుకు ఎంచుకున్నారు? అదీగాక, జాతీయ-అంతర్జాతీయ స్థాయుల్లో లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్ ఇంత భారీ పెట్టుబడి గురించి ఏనాడూ తన వార్షిక నివేదికల్లో ఎందుకు చెప్పలేదు? స్టాక్ ఎక్స్‌ఛేంజికిగానీ, ఇతర నియంత్రణ సంస్థలకుగానీ వివరాలను ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ప్రైవేటు వ్యవహారం కాదే! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షల ఇన్వెస్టర్ల డబ్బును ప్రత్యేకించి చాటుమాటుగా రామోజీ జేబులో పెట్టి ఆయన్ను నష్టాలనుంచిగానీ, కష్టాలనుంచిగానీ ఎందుకు బయ టపడేయాలనుకున్నట్టు? అన్నింటికీ మించి, ఆ రోజున అల్లిబిల్లి కంపెనీల ద్వారా రిలయన్స్ రామోజీకి అంద జేసిన రూ.2,600 కోట్ల సొమ్ము రామోజీ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగం కాదే! అది మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా అప్పటికి ఆయన చట్ట విరుద్ధంగా సేకరించిన సొమ్ము బకాయిలు చెల్లించుకోవటానికే అన్నది తేటతెల్లం అయింది కదా? వ్యాపార విస్తరణ, లాభోద్దేశం లేకుండా రిలయన్స్ సంస్థ రామోజీకి చెందిన బకాయిల చెల్లింపునకు సొమ్మెందుకు ఇచ్చినట్టు? 

సమర్పయామి... 
చంద్రబాబు రిలయన్స్ బంధాన్ని అనుమానించటానికి మరో కారణమూ ఉంది. 2009 ఎన్నికలు ముగిసిన వెంటనే... గెలిచినా ఓడినా రాజకీయ నాయకులు ఏ దేవుడినో సందర్శించుకుని వచ్చారు. మరి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా తొలి దర్శనం ముఖేశ్ అంబానీని చేసుకున్నారు. ఎందుకని? ఏ సాయానికి కృతజ్ఞతగా? ఇలాంటి రాజకీయ అంశాలతోపాటు మార్కెట్, బిజినెస్ నిబంధనల ప్రకారం చూసినా రామోజీ సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడి పెట్టటంగానీ, ఆ తరవాత ఇప్పుడు పుచ్చు వంకాయల్లాంటి ఛానళ్ళనే ప్రత్యేకంగా ఎంచుకుని వాటికి భారీగా, మార్కెట్‌లో మరే సంస్థా ఇవ్వనంతటి భారీ ‘మూల్యాన్ని’ ఎందుకు చెల్లించుకున్నట్టు? నాలుగేళ్ళుగా వేల కోట్లు వాడుకోండని ఇచ్చి... వాటి మీద వడ్డీ పాటి విలువ కూడా చేయని రేటింగ్ లేని ఈటీవీ చానళ్ళను ఎంపికచేసిమరీ ఎందుకు తన ఖాతాకింద లెక్కగట్టుకున్నట్టు? రిలయన్స్ మొహమాట పడుతూ ఏదో పబ్లిక్‌కు వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి చెప్పిన వాటాల లెక్క ద్వారా తేలేదేమిటంటే... అంతా మాయ. రామోజీకి సర్వం సమర్పయామి. రిలయన్స్ పెట్టుబడి అంతా రామోజీ గోడకు కొట్టిన సున్నం. 
అంతో ఇంతో వాల్యుయేషన్ దక్కే ‘ఈనాడు’ పత్రికను, ఈటీవీ తెలుగు, ఈటీవీ2 ల్లో రామోజీ రిలయన్స్‌కు కోల్పోయినది లేదు. ఇంతకు ముందు వెనకనుంచి వచ్చిన డబ్బు ద్వారా వీటిలో కూడా రిలయన్స్‌కు 39 శాతం వాటా ఉంటే ఇప్పుడు ఈనాడులో ఒక్క వాటా కూడా రిలయన్స్‌కు లేదు. అలాగే తెలుగు టీవీ చానళ్ళలో దాని వాటా 39 నుంచి 24.5 శాతానికి తగ్గిపోయింది. 26 శాతం ఉంటే తప్ప ఏ నిర్ణయాన్నీ అడ్డుకునే హక్కే ఉండదు. అయినా రిల యన్స్ తన వాటాను ఎందుకు తగ్గించుకుంది? ఇదం తా చూస్తే, జరిగినది వాటా తగ్గించుకోవటమా... లేక ఎవరికో ఇవ్వాల్సిన ‘వాటా’ను రామోజీ చేతిలో పెట్టి తప్పుకోవటమా అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.

కేజీ బేసిన్ గ్యాస్ తాకట్టు... 
టెలివిజన్ ఛానళ్ళ విలువ అవి ఎందరికి చేరువయ్యాయన్న అంశంమీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. రామోజీ కంపెనీ అమ్మి రిలయన్స్‌కు ఇచ్చినట్టు చూపిన చానళ్ళకు రేటింగ్‌లో గణనీయమైన ట్రాక్‌రికార్డూ లేదు. అదీగాక, కేబుల్ నెట్‌వర్క్ పరంగాగానీ, డిష్ పరంగాగానీ ఆ ఛానళ్ళ ఈటీవీ గ్రూపునకు నెట్‌వర్కే లేదు. పైగా ఈటీవీ రాజస్థానీ, బీహారీ, ఒరియా, యూపీ వంటి ఛానళ్ళకు ఉన్న మార్కెట్ కూడా చిన్నది. ఈ మార్కెట్లన్నింటిలో స్టార్ ప్లస్, సోనీ వంటి హిందీ ఛానళ్ళదే హవా. అలాంటి ఛానళ్ళను తీసుకుని రిలయన్స్ ఏం చేసుకుంటుం దన్నది అర్థం కాని అంశం.

మొత్తంగా రామోజీ- రిలయన్స్ డీల్‌ను పరిశీలిస్తే... తెలుగువారికి దక్కాల్సిన కేజీ బేసిన్ గ్యాస్‌ను చంద్రబాబు వదులుకున్నందుకు ప్రతిఫలంగా రామోజీ బాగు పడ్డారన్న విజయమ్మ పిటిషన్‌లో వాదనకు మాత్రమే బలం చేకూరుతోంది. ఆ గ్యాస్ మన రాష్ట్రానికే దక్కి ఉంటే సిలిండర్‌కు ఈ రోజున రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న ధరలో సగానికే ఇంటిల్లి పాదికి మన కేజీ బేసిన్ గ్యాస్ అందుబాటులోకి వచ్చేది. అందుకు భిన్నంగా మనందరి ప్రయోజనాలను తాకట్టుపెట్టి కేవలం ఇద్దరు వ్యక్తులు-రామోజీ, బాబు లాభపడ్డారని అర్థమవుతుంది.

అల్లిబిల్లి కంపెనీలు.. కంపానీలు... 
ఇంతకీ రామోజీ కంపెనీలోకి డబ్బును ప్రవహింపజేసిన షినానో రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, తిస్తా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, కవీంద్రా కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, దేవకీ కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్టిట్యూడ్ మర్కెంటైల్ ప్రైవేట్ లిమిటెడ్... ఇవీ అల్లిబిల్లి కంపెనీలంటే. కేవలం రామోజీ గ్రూపులోకి డబ్బు పంపించటమనే ఒకే ఒక్క పని కోసం సృష్టించిన కంపెనీలివి. 

అలాగే రామోజీ సంస్థ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి రూ.1,149.77 కోట్లు ప్రవహింపజేసిన అనూ ట్రేడింగ్ సంస్థకు 2009 మార్చి వరకు ఉన్న అధీకృత మూలధనం కేవలం రూ. కోటి. అంతకు మించిన విచిత్రం ఏమిటంటే దాని పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ. లక్ష. ఇలాంటి డొల్ల కంపెనీలద్వారా ఈటీవీ వాటాల బేరానికి ముందే రామోజీ ఏకంగా రూ.2,650 కోట్లు లాగారు. కాకపోతే గురివిందకు తన కింద ఉన్న నలుపు తెలియదన్నట్టు రామోజీ నిర్లజ్జగా సాక్షిలోకి నిధులు రావటం గురించి పదేపదే పాత కథనాలను తన పాఠకులకు చెప్పాలని ఉబలాటపడుతుంటారు. 

ఇవేకాక, పీకల్లోతు నష్టాల్లో కూరుకుని... భూములన్నీ వివాదాల్లో చిక్కుకుని... ఆర్థిక నేరాల కేసులుల్లో మునిగితేలుతున్న రామోజీ కంపెనీ షేరు విలువ రూ.100 అయితే, దానిమీద భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనట్టు 5268.30 రెట్ల ప్రీమియాన్ని రిలయన్స్ సంస్థ ఏ ప్రాతిపదికన చెల్లించినట్టు? ఏ సంస్థ రామోజీ ఆస్తుల్ని మదింపు చేసింది? చంద్రబాబుతో రిలయన్స్ దోస్తీ తప్ప పెట్టుబడులకు సరైన కారణాలమిటి? సాక్షి గడచిన రెండేళ్ళ పైచిలుకు కాలంలో అనేక పర్యాయాలు ఇవే ప్రశ్నలు అడిగింది. రామోజీ నుంచి సమాధానం లేదు. అందుకు భిన్నంగా జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల గురించి రామోజీ అడ్డమైన రాతలూ రాస్తున్న సందర్భాల్లో ప్రజలకు సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా భావించిన జగన్‌మోహన్‌రెడ్డి పత్రిక ద్వారానో, నేరుగా మీడియాను పిలిచో సమాధానాలు ఇస్తూ వచ్చారు. తేడా ఇదే. ఈనాడు రాతల్లో తనకు చట్టాలు, న్యాయం, నీతి వర్తించవన్న తుడుచుకుపోయే ధోరణితోపాటు ఎదుటివారికి బురద పూయటం తన హక్కు అన్న ధోరణి కనిపిస్తుంది. సాక్షి అందుకు భిన్నంగా ఆధారాలు ఉంటే మాత్రమే కథనాలు ప్రచురించింది. తనమీద, జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులమీద, పెట్టుబడుల మీద గిట్టని పత్రికలో వచ్చిన కథనానికి ‘ఏది నిజం’ ద్వారా సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చింది. 

తనకు మాలిన ధర్మం... 
కోర్టులూ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లోనూ రెండు సంస్థల వైఖరుల్లో ఇదే తేడా కనిపిస్తుంది. రామోజీకి సంబంధించి ఏ వ్యవహారాన్ని తీసుకున్నా న్యాయస్థానం విచారించి నిగ్గుదేల్చాలని ఆయన ఏనాడూ భావించిన దాఖలాలు కనిపించవు. తనకు ఏ చట్టాలు వర్తించవో తానే నిర్ణయించుకుంటారు. పన్నులు ఎగ్గొట్టినా, అక్రమ వ్యాపారాలు చేసినా న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకోవటం మీదే దృష్టి పెడతారు. పత్రికలో మాత్రం బృహస్పతికి తానే గురువునన్నట్టు, ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్‌కు పారదర్శకతకు తానే అర్థం చెప్పానన్నట్టు సంపాదకీయాల్లో కుమ్మేస్తుంటారు. 

సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమం చేయండని జనానికి నీతులు చెప్పి తాను నీతిమంతుడిని కావచ్చని ప్రణాళిక వేసుకున్న ఈ పెద్దమనిషి... తన కంపెనీల్లోకి ఎవరి డబ్బు వచ్చిందో ఎందుకు ఏళ్ళ తరబడి గుంభనగా దాచినట్టు? మద్య నిషేధ ఉద్యమం అంటూ ఒకనాడు ఈనాడు పాఠకులను పిచ్చోళ్ళనుకుని సాగించిన ఉద్యమం అసలు లక్ష్యం ఉదయం అనే పత్రిక ఆర్థిక మూలాలను చిదిమివేయటమేనని... తన ఫిలింసిటీ ప్రారంభమై అందులో స్టార్ హోటళ్ళు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తరవాత స్వయానా తామే నిషేధం సరిగా అమలు జరగటం లేదని వార్తలు రాసి... తమ బాబుతో నిషేధాన్ని ఎత్తేసిన ఘట్టంతో తెలుగు ప్రజలకు రామోజీ అల్లిబిల్లి ఉద్యమాల వ్యవహారం సంపూర్ణంగా అర్థమయింది. 

అదీగాక, ఫలానా రాజయ్య ఇన్ని ఎకరాలను ఎలా కొన్నాడంటూ ఈనాడు మొదటి పేజీ కథనాల్లో అడ్డదిడ్డంగా వార్తాకథనాలు రాయించే రామోజీ ఆయన పెట్టుకున్న అల్లిబిల్లి సంస్థలతో కలిపి సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలో కబళించిన భూమి ఎంతో తెలుసా? దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా. మరి ఏ భూ గరిష్ట పరిమితి చట్టాలు రామోజీకి వర్తిస్తున్నాయి? ఇలాంటి పెద్దమనిషి తన పత్రికలో మాత్రం భూ కబ్జా... దందా అంటూ వినోబాభావేకి గురువునన్న తరహాలో కథనాలు రాయిస్తుంటారు. చూసే వారికి ఛీ అనిపించదూ! అంతెందుకు? లీజు... గలీజు అంటూ గిట్టని వ్యక్తులు, సంస్థలమీద లెక్కకు మిక్కిలి కథనాలు రాసే రామోజీ పత్రిక నెలకొన్న యూనిట్లలో అనేకం... లీజు పేరిట రామోజీ సాగిస్తున్న అరాచకాన్ని మాత్రమే వెల్లడిస్తాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీ చెప్పేదానికి... చేసేదానికి ఎక్కడా పొంతన కుదరదు. ఆయన చేతల్లో, ఆయన పత్రిక రాతల్లో వీసమెత్తు ప్రజా ప్రయోజనం కూడా ఉండదు. ఉండేదంతా తనకంటే ఎదుగుతున్న పత్రికో సంస్థో అంటే ద్వేషం. తాను మద్దతు ఇచ్చే రాజకీయ పక్షానికి వ్యతిరేకంగా నిలబడిన నాయకత్వం పట్ల వైరం. వారిని కూల్చటానికి మాత్రమే ఆయన చేతిలో మీడియా నిరంతరంగా శ్రమిస్తుంటుంది. అందుకు చంద్రబాబు, ఆయన తోక సంస్థలు మద్దతు పలుకుతుంటాయి. ఇదీ వీరికి తెలిసిన ప్రజా ప్రయోజనం.

కాదన్నట్లయితే, ప్రజాసమస్యల పట్ల అటు అధికార పక్షం... ఇటు ప్రతిపక్షం... ఈ రెండింటి చేతగానితనాన్ని , చవటాయిత్వాన్ని విమర్శించటానికి తన పత్రికను రామోజీ కేటాయించి ఎన్నాళ్ళయింది... ఎన్నేళ్ళయింది? ఆయనకు ఉదయాన లేస్తే సాక్షి కనిపిస్తోంది. నిద్రపోదామంటే జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుకు వస్తున్నాడు. కాబట్టి ఆయన పత్రికలో నిరంతరంగా ద్వేషపూరితంగా, కుట్రపూరితంగా వ్యక్తమయ్యేది తన బాధ మాత్రమే. నిరంతరం ఎదుటి వ్యక్తుల్ని, సంస్థల్ని చూసి ఏడవటాన్ని జర్నలిజంగా పరిగణించాలా కూడదా అన్న వివేచన ప్రజలకు ఎప్పుడూ ఉంది. పత్రికాధిపతిగా అది రామోజీకి ఈ 75ఏళ్ళ ప్రాయంలో కొత్తగా అబ్బుతుందా అంటే సమాధానం అవునో కాదో కూడా ప్రజానీకం ఏకగ్రీవంగా నిర్ణయించుకుని ఉంది. 

డొల్ల కంపెనీలు... వేల కోట్లు
రామోజీ కంపెనీలోకి డబ్బును ప్రవహింపజేసిన షినానో రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, తిస్తా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, కవీంద్రా కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, దేవకీ కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్టిట్యూడ్ మర్కెంటైల్ ప్రైవేట్ లిమిటెడ్... ఇవీ అల్లిబిల్లి కంపెనీలంటే. కేవలం రామోజీ గ్రూపులోకి డబ్బు పంపించటమనే ఒకే ఒక్క పని కోసం సృష్టించిన కంపెనీలివి. కేవలం 37 రోజుల్లో ఒక దాని వెనుక ఒకటిగా అరడజను కంపెనీలు పుట్టుకొచ్చాయి. రూ. 2000 కోట్లు ఈ కంపెనీల ద్వారా ప్రవహించి చివరికి అందులో సింహ భాగం రామోజీ కంపెనీల్లోకి చేరాయి. 

అలాగే రామోజీ సంస్థ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి రూ.1,149.77 కోట్లు ప్రవహింపజేసిన అనూ ట్రేడింగ్ సంస్థకు 2009 మార్చి వరకు ఉన్న అధీకృత మూలధనం కేవలం రూ. కోటి. అంతకు మించిన విచిత్రం ఏమిటంటే దాని పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ. లక్ష. ఇలాంటి డొల్ల కంపెనీలద్వారా ఈటీవీ వాటాల బేరానికి ముందే రామోజీ ఏకంగా రూ.2,650 కోట్లు లాగారు. కాకపోతే గురివిందకు తన కింద ఉన్న నలుపు తెలియదన్నట్టు రామోజీ నిర్లజ్జగా సాక్షిలోకి నిధులు రావటం గురించి పదేపదే పాత కథనాలను తన పాఠకులకు చెప్పాలని ఉబలాటపడుతుంటారు.
Share this article :

0 comments: