సమస్యలను గాలికివదిలేసిన కాంగ్రెస్, టిడిపి:జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమస్యలను గాలికివదిలేసిన కాంగ్రెస్, టిడిపి:జగన్

సమస్యలను గాలికివదిలేసిన కాంగ్రెస్, టిడిపి:జగన్

Written By ysrcongress on Saturday, January 7, 2012 | 1/07/2012

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను గాలికి వదిలివేశాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మోసాపురం గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. న్యాయం, ధర్మం, విలువలు, విశ్వసనీయతలేని కాంగ్రెస్, టిడిపిలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఫీజుల కోసం ధర్నాలు చేయవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆ మహానేత బతికి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో చనిపోయిన వైఎస్ కు ఒక న్యాయం, బతికి ఉన్న చంద్రబాబుకు ఒక ధర్మం అన్నారు.
 మోసాపురం బిసి కాలనీలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.






హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేసు విషయంలో సిబిఐ ఒంటెద్దు పోకడపోతోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కేసులో ఒక లాగా, జగన్ కేసులో మరోలా వ్యవహరిస్తోందన్నారు. 'జగన్ విషయంలో మొత్తం మూలాలలోకి వెళ్లాలి. చంద్రబాబు నాయుడు విషయంలో అక్కడే ఉండాలి' అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైనుంచి ఆడిస్తున్న నాటకమా? లేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న కుతంత్రమా? అని ఆయన ప్రశ్నించారు. సిబిఐ అంటే బాబు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా ఉందని అన్నారు. సిబిఐ తీరు మారకపోతే దేశవ్యాప్తంగా సిబిఐ కార్యాలయాల ముందు నిరసనలు తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు.
Share this article :

0 comments: