ఎన్టీఆర్ పేరును, నందమూరి వంశాన్ని కరివేపాకులా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్టీఆర్ పేరును, నందమూరి వంశాన్ని కరివేపాకులా

ఎన్టీఆర్ పేరును, నందమూరి వంశాన్ని కరివేపాకులా

Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012

*స్థాయి మరచి మాట్లాడుతున్నారు
*వైఎస్ జ్ఞాపకాలను తుడిచేసే కుట్ర 
*ఎన్టీఆర్ పేరును, నందమూరి వంశాన్ని కరివేపాకులా వాడుకుంటున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబుది ఎల్లప్పుడూ కూలదోసే సంస్కృతే. ఆయన మనసు కుట్రలు, కుతంత్రాలు, దుర్బుద్ధితో ఉంటుంది. అందుకే ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశానన్న స్పృహ కోల్పోయిన చంద్రబాబు స్థాయి మరిచి మాట్లాడుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ను కూలదోసిన చంద్రబాబు అదే మాదిరిగా వైఎస్ విగ్రహాలపై కన్ను వేశారని దుయ్యబట్టారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

మహానేతపై ఉన్న అభిమానంతో ప్రజలు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను కాంగ్రెస్‌తోనే తొలగింపచేసి, వారి మదిలోంచి వైఎస్ జ్ఞాపకాలను తుడిచేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే, చంద్రబాబు మాత్రం అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలు కూల్చివేస్తామంటున్నారని విమర్శించారు. ‘‘పేదల ఆర్థిక స్థితిగతులను పెంచిన సృష్టికర్త వైఎస్సార్ అయితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చేతివృత్తుల కూల్చివేతలకు ప్రతినిధి చంద్రబాబు. అందుకే ఆయన ఇప్పటికీ కూల్చివేత మాటలు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. వైఎస్ విగ్రహాలనే భరించలేక పోతున్న చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే 104, 108లను కొనసాగించగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు రైతులకు ఎంతో అసరానిచ్చిన ఉచిత విద్యుత్‌లను అమలు చేయగలరా అని పద్మప్రశ్నించారు. 

కరివేపాకులా నందమూరి వంశం
ప్రజల్లో విశ్వసనీయతలేని చంద్రబాబు తనకు రాజకీయంగా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఎన్టీఆర్ పేరును, నందమూరి వంశాన్ని కరివేపాకులా ఉపయోగించుకున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు వ్యక్తిత్వం కారణంగా ప్రజల్లో టీడీపీ రోజురోజుకూ ఆదరణ తగ్గిపోతోందన్నారు. ‘‘1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 48 శాతం ఓట్లు సాధించి అధికారం చేపట్టింది. వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు సారధ్యంలో 2009 నాటికి మహాకూటమితో కలుపుకొని 28 శాతం ఓట్లకు దిగజార్చారు. ఇప్పుడు త్వరలో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ 12 శాతానికి పడిపోయే అవకాశముంది. టీడీపీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలు ఆ పార్టీ కేడర్‌కు కూడా లేవు’’ అని అన్నారు. అందుకే ఎన్టీఆర్‌ను, బాలకృష్ణను తెరపైకి తెస్తున్నారన్నారు.
Share this article :

0 comments: