ప్రభుత్వ భూమిని కారు చౌకగా అమ్మిన చంద్రబాబుని వదిలి, జగన్ ని లక్ష్యంగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ భూమిని కారు చౌకగా అమ్మిన చంద్రబాబుని వదిలి, జగన్ ని లక్ష్యంగా

ప్రభుత్వ భూమిని కారు చౌకగా అమ్మిన చంద్రబాబుని వదిలి, జగన్ ని లక్ష్యంగా

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సిబిఐ ఉద్దేశపూర్వకంగానే దాడులు నిర్వహిస్తోందని ఆ పార్టీ అధికా ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులను, జగన్మోహన రెడ్డిని, అతని బంధువులను, సన్నిహితులను వేధించడమే లక్ష్యంగా సిబిఐ పని చేస్తోందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జగన్ సన్నిహితులు సునీల్ రెడ్డిని ఏ కేసుకు సంబంధించి సిబిఐ విచారిస్తుందో చెప్పడంలేదన్నారు. సునీల్ రెడ్డిని విచారణకు పిలిచారా? ముద్దాయిగా చూపించాలని పిలిచారా? అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు ఉన్నా అటువైపు సిబిఐ కన్నెత్తి చూడటంలేదన్నారు. ప్రభుత్వ భూమిని కారు చౌకగా అమ్మిన చంద్రబాబుని వదిలి, జగన్ ని లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

రైతు పోరుబాటకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో చంద్రబాబు ఆయన బావమరిది బాలకృష్ణని రంగంలోకి దించారన్నారు. చంద్రబాబు నాయుడు అవుట్ డేట్ అయిపోవడంతో బాలకృష్ణ వస్తున్నట్లు అందరికీ అర్ధమవుతోందన్నారు. ఇప్పుడు వచ్చి తొడగొట్టటం కాదని, వైస్రాయ్ హొటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన రోజున చంద్రబాబుకు వ్యతిరేకంగా బాలకృష్ణ తొడకొట్టి ఉంటే ఎన్టీఆర్ గౌరవం నిలబడేదన్నారు. బాలకృష్ణ నాన్న గారి గురించి చెబుతున్నారు గానీ, బావ గారి గురించి మాత్రం చెప్పడంలేదన్నారు. ఎన్టీఆర్ ని ఎవరూ తప్పుపట్టరన్నారు. బావగారు గొప్పగా దోచుకుని దొంగ బాబు, ఆ తరువాత వెన్నుపోటు బాబు, 9 ఏళ్లు అధికారంలో ఉండి దోపిడీ బాబుగా నిలిచాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చెత్తబాబుగా మిగిలారన్నారు. 

వాస్తవాలు అర్ధం చేసుకోని మాట్లాడాలని బాలకృష్ణకు హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టవద్దని కోరారు. రెండో వైపు చూపిస్తే జాతకం బయటపడుతుందన్నారు. పెట్టుడు విగ్గు, పెట్టుడు మీసం తీసి రావాలని సవాల్ విసిరారు. అసలు రంగు బయటపడిద్దన్నారు. ఎవరి మీదైనా పోటీ చేస్తానని ప్రగల్బాలు పలుకవద్దని సలహా ఇచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ వారిద్దరూ ఎక్కడ పోటీ చేస్తారో చెబితే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక సామాన్య కార్యకర్తని నిలబెట్టి ఇద్దరికీ డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని అంబటి సవాల్ విసిరారు. 

అభిమానులు కొట్టుకునే విధంగా సమస్యలను లేవనెత్తవద్దని ఆయన బాలకృష్ణని కోరారు. అలా చేస్తే మిమ్మల్ని ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.
Share this article :

0 comments: