చంద్రబాబు నాయుడు ఎప్పుడో అమ్ముడుబోయారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు నాయుడు ఎప్పుడో అమ్ముడుబోయారు..

చంద్రబాబు నాయుడు ఎప్పుడో అమ్ముడుబోయారు..

Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012

కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల నుంచి పిల్లాపాపలతో వలస వచ్చిన అక్కాచెల్లెళ్లు గుంటూరు మిరపతోటల్లో పనిచేస్తున్నారు
ఈ చేతగాని పాలకులు దివంగత వైఎస్ స్వప్నాలను కూల్చేస్తున్నారు
 ‘‘చేసిన కష్టానికి గిట్టుబాటు దొరక్క నా అక్కాచెల్లెమ్మలు పిల్లాపాపలను వెంటబెట్టుకొని మళ్లీ వలస బాట పట్టే దుస్థితిని తీసుకొచ్చారు ఈ పాలకులు. మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ చేతగాని పాలకుల చేతుల్లో చిక్కి వైఎస్సార్ స్వప్నాలు కుప్పకూలి పోతున్నాయి’’ అనివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 48వ రోజు ఆదివారం ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల మీదుగా వెళ్తున్న సమయంలో మిరపతోటల్లో, వరి పొలాల్లో పనిచేస్తున్న మహిళా కూలీలు జగన్ కోసం పరుగెత్తుకుంటూ వచ్చారు. 

వారి కష్టాలను, కన్నీళ్లను జగన్‌తో చెప్పుకొని ఊరట పొందారు. వారిలో కొంత మంది కూలీలు తాము కర్నూలు జిల్లా నుంచి వచ్చామని, మరికొంత మంది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామని చెప్పడంతో జగన్ పై విధంగా స్పందించారు. యాత్రలో ఆయన 75-త్యాళ్లూరులో కల్లి రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని, మండెపూడిలో నాగరాజు కుటుంబాన్ని ఓదార్చారు. నాగరాజు కుటుంబాన్ని శనివారమే ఓదార్చాల్సి ఉండగా.. సమయాభావం వల్ల వీలుకాలేదు. ఆదివారం యాత్రలో ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్‌మోహన్‌రెడ్డి పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చాలా బాధనిపించింది..

ఇవాళ రైతు కూలీ పరిస్థితి అధ్వానంగా ఉంది. నేను ఇక్కడికి రాకముందు చాలా గ్రామాల నుంచి తిరుగుతూ వచ్చా. కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్న అక్కా చెల్లెమ్మలు నాకు కనిపించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి వచ్చిన కూలీలనూచూశా! అమ్మా.. అక్కడి పరిస్థితి ఎలా ఉందని అడిగాను. కర్నూల్లో అయితే ఇవాళ మాకు రూ.70 -80 మాత్రమే గిట్టుతా ఉంది. అదే ఇక్కడికి వస్తే.. మిరపకాయ కోయాలి కాబట్టి కూలీలు అంత సులభంగా దొరకరు. కాబట్టి కనీసం రూ.120 అయినా మాకు గిట్టుతా ఉందన్నా అని చెప్పినప్పుడు బాధనిపించింది. ఏమమ్మా.. ఇంత తక్కువ కూలీనా? అని అడిగితే.. ఇవాళ రైతుల పరిస్థితే దారుణంగా ఉంది.. మాకు ఇంతకంటే ఎక్కువ ఇంకేమిస్తారన్నా అని అక్కాచెల్లెమ్మలు రైతన్న మీద సానుభూతి చూపిస్తున్నప్పుడు ఇంకా బాధనిపించింది. ఇవాళ సానుభూతి చూపించాల్సిన ఈ ప్రభుత్వం రైతులను, రైతుకూలీలను గాలికి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వైఎస్సార్ మాత్రమే చేశారు..

ఇవాళ ఇక్కడకు రాకముందు ఒక పైలాన్ చూడ్డానికి వెళ్లా.. అది తాళ్లూరు, బలుసపాడు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైలాన్. ఈ ప్రాజెక్టులు దివంగత నేత సువర్ణయుగంలో రూ. 24 కోట్లతో 8,500 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కట్టారన్నా అని స్థానిక రైతులు గర్వంగా చెప్తున్నారు. వైఎస్సార్ కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే పరిసర గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయని అందరికీ తెలిసి ఉండి కూడా ఏ ఒక్కరూ వాటిపైధ్యాస పెట్టలేదు. వైఎస్సార్ మాత్రమే ప్రాజెక్టులను పూర్తి చేసి గ్రామాలను సస్యశ్యామలం చేసి చూపెట్టారు.

చంద్రబాబు నాయుడు ఎప్పుడో అమ్ముడుబోయారు..

ఇవాళ చదువుకుంటున్న విద్యార్థి దగ్గర నుంచి ఇల్లు కట్టుకుంటున్న పేద వాళ్లు, అవ్వాతాతలు, వైద్యం అందని ప్రతి పేదవాడు, రైతన్నలు, రైతు కూలీలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా? అని చూస్తున్నారు. ఇంటువంటి పరిస్థితులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైనా గట్టిగా కాలర్ పట్టుకొని నిలదీస్తుందేమో అని ఆశగా చాలా మంది చూశారు. కానీ ప్రతిపక్షం ఎప్పుడో అధికార పక్షానికి అమ్ముడుపోయింది. చిరంజీవిగారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారు. ఇక కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లోనూ పడిపోదని నమ్మకానికొచ్చిన చంద్రబాబు ఇక రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పెద్దలకు కనుసైగ చేశారు. ఆ వెంటనే అవిశ్వాసం పెట్టారు. జగన్ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలిసి నీచమైన ఆలోచనలు చేశారు. వీళ్లంతా ఇంత నీచమైన ఆలోచనలు చేసినప్పటికీ నేనైతే ఒకే ఒక మాట నమ్మాను! కల్మషం లేని మనసుతో మనం చేయదల్చుకున్నది చేయాలి.. పై నుంచి దేవుడు చూస్తున్నాడు. దేవుని ఆశీస్సులు ఉంటాయి. ప్రజల అండదండలు మనకు తోడుగా ఉంటాయని చెప్పి గట్టిగా నమ్మాను. వైఎస్సార్ బాటలో నడవాలనుకున్న ప్రతి ఎమ్మెల్యేకూ ఇదే మాట చెప్పా. వాళ్లు నా మాటకు గౌరవం ఇచ్చారు.

Share this article :

0 comments: