ఏడేళ్లనాటి సర్వీసు చార్జీల బకాయిలన్నీ కట్టండి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏడేళ్లనాటి సర్వీసు చార్జీల బకాయిలన్నీ కట్టండి..

ఏడేళ్లనాటి సర్వీసు చార్జీల బకాయిలన్నీ కట్టండి..

Written By ysrcongress on Wednesday, January 11, 2012 | 1/11/2012

ఏడేళ్లనాటి సర్వీసు చార్జీల బకాయిలన్నీ కట్టండి.. 
బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరికలు... 
అడ్డగోలు లెక్కలతో నోటీసులు..
ఇంటి బిల్లుకు, వ్యవసాయం బిల్లుకు ముడి... 


<


<




స్టార్టరు ఎత్తుకెళ్లారు...
‘‘బిల్లు కట్టాలని కరెంటోళ్లు ఇంతకుముందెప్పుడూ నాకు నోటీసులివ్వలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి రూ.1,451 కట్టాలని బిల్లు ఇచ్చారు. కట్టనన్నందుకు స్టార్టర్ ఎత్తుకుపోయారు’’ 

- పెద్ద మల్లయ్య, రైతు, నల్గొండ జిల్లా, మల్లారం గ్రామం


ఈ రైతు పేరు కొంతం సత్తిరెడ్డి. నల్లగొండ జిల్లా చిట్యాల. ఈయనకు కూడా విద్యుత్ అధికారులు ఏకంగా రూ.3,200 కట్టాలని బిల్లు పంపారు. పంటలన్నీ పోయాయి, ఇప్పటికిప్పుడు ఇంత బిల్లు కట్టాలంటే ఎలా అని సత్తిరెడ్డి వాపోతున్నాడు.


హైదరాబాద్, న్యూస్‌లైన్:కరెంటు బిల్లు కట్టలేదో కనెక్షన్ కట్ చేస్తాం..! ఏడేళ్లనాటి బకాయిలు కూడా ఇప్పుడే చెల్లించాలి.. కాదూ కూడదన్నారో.. మీ మోటార్లు, స్టార్టర్లను ఎత్తుకుపోతాం..!! అటు కరువు.. ఇటు కోతలతో ఇప్పటికే కుదేలైన రైతులపై విద్యుత్ సిబ్బంది చేస్తున్న జులుం ఇదీ!! ఖరీఫ్‌లో నిండా మునిగినా.. కనీసం రబీలో అయినా కాసిన్ని తిండిగింజలు పండించుకుందామనుకున్న రైతన్నకు అధికారులు ఇలా ‘షాక్’ ఇస్తున్నారు. ఏడాదో.. రెండేళ్లో కాదు.. ఏకంగా ఏడేళ్లనాటి సర్వీసు చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తామని, బిల్లులు కట్టకపోతే వ్యవసాయ స్టార్టర్లను, మోటార్లను ఎత్తుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎత్తుకెళుతున్నారు కూడా! మోటార్లు ఎత్తుకుపోయినా బిల్లు కట్టకపోతే జైలు చూపిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అంతేకాదు వ్యవసాయ బిల్లులకు ఇంటి బిల్లులకు లంకె వేస్తున్నారు. వ్యవసాయ సర్వీసు చార్జీలు చెల్లించని రైతుల ఇంటి కనెక్షన్లు తొలగిస్తున్నారు. 2004 నుంచి ఇప్పటివరకు కేవలం సర్వీసు చార్జీల రూపంలోనే రైతుల నుంచి రూ.200 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే విద్యుత్ సిబ్బంది ఇలా రైతులపై రెచ్చిపోతున్నారు. ఈ సర్కారు అచ్చంగా మళ్లీ నాటి చంద్రబాబు పాలనను గుర్తుకు తెస్తోందని రైతులు వాపోతున్నారు!

రైతుపై భారం 200 కోట్లపైనే..

రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉచిత వ్యవసాయ కనెక్షన్లకు సర్వీసు చార్జీల రూపంలో రూ.20 వసూలు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే రైతుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఏనాడూ వసూలు చేయలేదు. ఈ సర్వీసు చార్జీని కాస్తా కిరణ్ సర్కారు 2011 ఏప్రిల్ నుంచి రూ.30కి పెంచింది. దీంతో అధికారులు తాజా సర్వీసు చార్జీలతోపాటు 2004 నుంచి ఇప్పటివరకు అయిన మొత్తాన్ని లెక్కగట్టి రైతుల నుంచి బకాయిలను వసూలు చేస్తున్నారు. ఇంటికి ఇచ్చే విద్యుత్ బిల్లులోనే దీన్ని కూడా జమచేసి ఇస్తున్నారు. 2004 నుంచి ప్రతీ ఏటా లక్షన్నర వ్యవసాయ కనె క్షన్లు మంజూరు చేస్తున్నారు. మొత్తమ్మీద 30 లక్షల మంది రైతులపై సగటున కనీసం తక్కువలో తక్కువగా 3 ఏళ్ల భారం పడుతుందని అంచనా. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్‌కు నెలకు రూ.20 చొప్పున.. మూడు సంవత్సరాలకు రూ.760 భారం పడుతుందన్నమాట! మొత్తం 30 లక్షల కనెక్షన్లకుగానూ ఈ భారం రూ.216 కోట్ల దాకా ఉంటుంది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటుందని ఇంధనశాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.

విద్యుత్ చట్టం ఏం చెబుతోంది..?

విద్యుత్ వినియోగదారుల నుంచి ఇష్టారీతిన బకాయిలను వసూలు చేసేందుకు వీలు లేదని విద్యుత్ చట్టం స్పష్టంచేస్తోంది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 56 క్లాజ్ 2 విద్యుత్ వినియోగదారులకు ఈ విషయంలో రక్షణ కల్పిస్తోంది. ‘‘ఏదైనా వినియోగదారునికి బకాయి ఉన్న విషయాన్ని రెండేళ్లలోపే తెలియచే యాలి. అప్పుడే వాటిని వసూలు చేసుకునే అవకాశం విద్యుత్ సంస్థలకు ఉంది. వినియోగదారులకు బకాయి ఉన్న విషయాన్ని రెండేళ్లయినా తెలియచేయకుండా ఉంటే.. బిల్లు వసూలు చేయకూడదు. వినియోగదారునికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయకూడదు’’ అని ఈ క్లాజ్ 2 వివరంగా చెబుతోంది. ఒకవేళ ఈ క్లాజుకు భిన్నంగా ఇదే చట్టంలో ఎక్కడైనా పేర్కొన్నప్పటికీ... అంతిమంగా సెక్షన్ 56 క్లాజు 2 వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ‘‘ఒక వినియోగదారుడు 2009 నవంబర్ నుంచి విద్యుత్ చార్జీలు బకాయిపడ్డాడని అనుకుంటే.... ఈ బకాయి పడ్డ బిల్లును విద్యుత్ సంస్థలు 2011 డిసెంబర్‌లోపు (నవంబర్ బిల్లు నవంబర్‌లో చెల్లిస్తారు కాబట్టి) వసూలు చేసుకోవాలి. ఒకవేళ ఈ బకాయి పడ్డ విషయాన్ని వినియోగదారునికి 2010 సెప్టెంబర్ వరకూ తెలియజేయకుండా.. 2010 అక్టోబర్‌లో బకాయిపడ్డట్టు పేర్కొని చెల్లించాలంటే ఇది చట్టరీత్యా చెల్లదు’’ అని విద్యుత్ రంగ నిపుణుడు ఒకరు విశ్లేషించారు. 2009 నవంబర్ ముందునాటి బిల్లులను వసూలు చేయడం కుదరదు. కానీ ఏడేళ్ల నాటి బకాయిలు చెల్లించాలంటూ తాజాగా బిల్లులు జారీ చేస్తుండటం గమనార్హం.

లంకె వేశారు ఇలా..

బకాయిల పేరుతో వేలకు వేలు రైతుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించిన డిస్కంలు ఇందుకు సరికొత్త మార్గాన్ని ఎన్నుకున్నాయి. ఇంటి బిల్లుకు, పంట బిల్లుకు ముడిపెట్టాయి. ఇంటిబిల్లుతోపాటే వ్యవసాయ బకాయి బిల్లునూ కలిపి ఒకే బిల్లు రూపంలో పంపుతున్నారు. ఇంటి బిల్లు కట్టే సమయంలోనే ఇదీ కట్టాలని చెబుతున్నారు. ఒకవేళ చెల్లించకపోతే ఇంటికి ఉన్న కరెంటు కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు.అప్పటికీ చెల్లించకపోతే కేసులు బనాయిస్తున్నారు. ఒక వినియోగదారుడికి రెండు కనెక్షన్లు ఉంటే.. అందులో ఒక్క కనెక్షన్ బిల్లు మాత్రమే చెల్లిస్తే రెండో కనెక్షన్ కట్ చేయవ వచ్చని విద్యుత్ చట్టం చెబుతోంది. ఈ నిబంధనను ఇప్పుడు డిస్కంలు రైతులపై ప్రయోగిస్తున్నాయి.

తత్కాల్ పేరిట మహా దోపిడీ..
తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకూ విద్యుత్ సంస్థలు షాక్ ఇస్తున్నాయి. తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్‌కు 20 పైసలు వసూలు గతంలోనే నిర్ణయించారు. తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు లేవు. దీంతో ఎంత విద్యుత్ వినియోగాన్ని వినియోగించారని లెక్కించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో 2009లో తత్కాల్ కనెక్షన్లకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేశారు. అయితే ఇప్పుడు తాజాగా 2004 నుంచి 2009 వరకు యూనిట్‌కు 20 పైసల చొప్పున లెక్కగట్టి రైతులకు బిల్లులు పంపుతున్నారు. ఈ కాలంలో (2004-09) విద్యుత్ వాడకానికి సంబంధించి విద్యుత్ సంస్థలు.. రైతు నడ్డి విరిచేలా దారుణమైన లెక్కలను వేస్తున్నాయి. ఇదీ ఆ లెక్క... ఉదాహరణకు ఒక రైతు 5 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఓ మోటారు వాడుతున్నాడనుకుంటే.. ఈ మోటారును వాడటం వల్ల గంటకు 3.73 యూనిట్లు (హార్స్‌పవర్‌కు 0.746 యూనిట్ల చొప్పున) కాలుతుంది. రోజుకు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ లెక్కన రోజుకు 26.11 యూనిట్లు.. నెలకు 783.3 యూనిట్లు.. ఏడాదికి 9399.6 యూనిట్లు! అంటే యూనిట్‌కు 20 పైసల చొప్పున ఏడాదికి రూ.1879.92 బిల్లు కట్టాలి. 2004 నుంచి 2009 వరకు ఈ బిల్లులు కట్టలేదు కాబట్టి ఏడాదికి రూ.1879.92 చొప్పున ఐదేళ్లకు మొత్తం రూ.9396 చెల్లించాల్సిందేనని బిల్లులు మంజూరు చేస్తున్నారు. ఏడాదిలో అన్నిరోజులు వ్యవసాయ పనులు ఉండవు. ఒకవేళ ఉన్నా... ఏడాది పాటు రోజుకు ఏడు గంటలపాటు మోటారును నడపాల్సిన అవసరం ఉండదు. ఏడాదిపాటు రోజుకు 7గంటలపాటు వ్యవసాయానికి కరెంటు సరఫరా చేయడం లేదని సాక్షాత్తూ ప్రభుత్వ లెక్కలే తేల్చిచెబుతున్నాయి. అయినా విద్యుత్ సంస్థలు ఈ మొత్తం రోజులకు కలిపి బిల్లులు వేసి రైతులపై భారాన్ని మోపేందుకు
Share this article :

0 comments: