వసూలు చేసిన మొత్తాన్ని సునీల్‌రెడ్డికి ఎందుకు ఇచ్చేస్తారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వసూలు చేసిన మొత్తాన్ని సునీల్‌రెడ్డికి ఎందుకు ఇచ్చేస్తారు?

వసూలు చేసిన మొత్తాన్ని సునీల్‌రెడ్డికి ఎందుకు ఇచ్చేస్తారు?

Written By ysrcongress on Thursday, January 26, 2012 | 1/26/2012


‘‘2005-10 మధ్య కోనేరు ప్రసాద్ సూచనల మేరకు చదరపు గజానికి రూ.5,000 నుంచి రూ.50వేల వరకూ అధిక మొత్తాన్ని తుమ్మల రంగారావు, ఆయన మేనేజరు వసూలు చేశారు. అయితే చాలా సందర్భాల్లో రంగారావు, ఆయన మేనేజరు వసూలు చేసిన మొత్తం సునీల్‌రెడ్డి చేతికి వెళ్లినట్లు మా దర్యాప్తులో తేలింది. కోనేరుతో కలిసి సునీల్‌రెడ్డి కుట్ర పన్ని ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు తెలిసింది. సాక్షుల సమక్షంలో మంగళవారం మేం సునీల్ ఇంటిని సోదా చేయగా కీలక పత్రాలు లభ్యమయ్యాయి. వాటి పరిశీలన అనంతరం సునీల్‌ను నిందితుడిగా చేర్చాం. ఈ మొత్తం అంతిమంగా ఎక్కడికి చేరిందనేది సునీల్‌రెడ్డికి తెలుసని వెల్లడయింది. అది తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆయన సహకరించలేదు. దీంతో సాయంత్రం అరెస్టు చేశాం’’ అంటూ పేర్కొన్న సీబీఐ నివేదిక.. దీన్లోని డొల్లతనాన్ని తనంత తానుగానే బయటపెట్టనే పెట్టింది. ఎందుకంటే..

* అసలు తుమ్మల రంగారావు, ఆయన మేనేజరు వసూలు చేసిన మొత్తాన్ని సునీల్‌రెడ్డికి ఎందుకు ఇచ్చేస్తారు? కొంచెం బుద్ధీ బుర్రా ఉన్న వారెవరికైనా ఇదే ప్రశ్న తలెత్తుతుంది. బహుశా! వారలా డబ్బులివ్వాలంటే.. అయితే సునీల్ ఎమ్మార్ ప్రతినిధి అయి ఉండాలి. లేకుంటే స్టైలిష్ సంస్థ యజమాని అయి ఉండాలి. ఇవన్నీ కాకుంటే వారికి ఆయన వల్ల ఏదో ఒక ప్రతిఫలం దక్కి ఉండాలి. మరి ఏ ప్రతిఫలం దక్కిందన్నది సీబీఐ చూపించాలి కదా!!!
Share this article :

0 comments: