మనోధైర్యం కోల్పోవద్దు: రైతులకు జగన్ భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనోధైర్యం కోల్పోవద్దు: రైతులకు జగన్ భరోసా

మనోధైర్యం కోల్పోవద్దు: రైతులకు జగన్ భరోసా

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

  అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటానని రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి భరోసా ఇచ్చారు. ఆర్మూరులో రైతు దీక్షకు వెళుతూ మార్గ మధ్యలో మునిపల్లి గ్రామం వద్ద ఆయన పసుపు పంటని పరిశీలించారు. ఈ సందర్భంగా పసుపు రైతులు తమ బాధలను జగన్ కు చెప్పుకున్నారు. మనోధైర్యం కోల్పోవద్దని, తాను అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం మెడలువంచైనా సరే రైతులకు పరిహారం సాధిస్తామని వారికి చెప్పారు. వ్యవసాయ మంత్రి లేని రాష్ట్రం ఇదని ఆయన అన్నారు. భారీగా తరలి వచ్చిన జనం మధ్యలో జగన్ పార్టీ జెండాని ఎగురవేశారు. 

దారిపొడవునా జనం అధికసంఖ్యలో తరలివచ్చి జగన్ కు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజాభిమానం ఊరూరా ఉప్పొంగింది. రైతు దీక్షకు మద్దతుగా రైతాంగం కదిలింది. నిజామాబాద్-ఆర్మూరు రహదారి మొత్తం వాహనాలతో నిండిపోయింది. దాంతో ఆయన ఆర్మూరు గ్రామం చేరుకోవడం ఆసల్యం అవుతోంది. రాత్రి 7 గంటలు దాటినా ఆయన ఆర్మూరు గ్రామం చేరకోలేకపోయారు. కొద్దిసేపట్లో ఆయన రైతుదీక్ష సభా స్థలం వద్దకు చేరుకుంటారు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి అడుగడుగున ఘనస్వాగతం లభిస్తోంది. హైదరాబాద్ లోని పంజాగుట్ట మొదలుకొని నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించే వరకు జనం నీరాజనాలు పలికారు. అభిమానులు, కార్యకర్తలతోపాటు మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా జగన్ ని చూసేందుకు ఉత్సాహం చూపారు.దారిపొడుగునా ఇరువైపులా జనం నిలబడి స్వాగతం పలికారు. పలుచోట్ల కార్యకర్తలు,అభిమానులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. 

రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో జగన్‌కు ఘన స్వాగతం లభించింది. రైతు దీక్షకు బయలుదేరిన జగన్‌ కొంపల్లి చేరుకోగానే వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి స్వాగతం పలికారు. జనంతో కొంపల్లి సెంటర్‌ కిక్కిరిసిపోయింది. జై జగన్‌ అంటూ నినాదాలు మిన్నంటాయి. వేలాది మంది జనం కాన్వాయ్‌ వెంట నడిచారు. జనాభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ ముందుకు సాగారు. మెదక్‌ జిల్లాల్లో జగన్‌కు బ్రహ్మరథం పట్టారు.

జగన్ నిజామాబాద్ జిల్లా సరిహద్దులలోకి ప్రవేశించారు. ఇందలవాయి గ్రామం చేరుకున్నారు. చంద్రాయణపల్లిలో పార్టీ జెండాని ఆవిష్కరించారు. అడుగడుగునా ప్రజలు వచ్చి స్వాగతం పలకడంతో ఆయన ఆర్మూరు చేరుకోవడం ఆలస్యం అవుతోంది. సాయంత్రం 4.30 గంటలకు ఆయన ఆర్మూరులోని రైతుదీక్ష సభాప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షకు మాజీ ఎంపీ కేశపల్లి గంగారెడ్డి మద్దతు ప్రకటించారు. తాను వ్యక్తిగతంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానినని తెలిపారు. తాను ఎప్పుడు వైఎస్ ను కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారని గంగారెడ్డి గుర్తు చేసుకున్నారు. అందరం ఒకే కుటుంబం అని వైఎస్ చెప్పేవారని....జగన్ ఆయన కుమారుడే కాబట్టి ఆయన్ని కూడా అభిమానిస్తానన్నారు. రైతుల కోసం చేపట్టిన దీక్షకు తన మద్దతు ఉంటుందని గంగారెడ్డి తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో రైతుదీక్షకు వెళ్తోన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనకు చర్చిలో మతపెద్దలు ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రైతు శ్రేయస్సును కాంక్షిస్తూ ఆయన చేస్తున్న దీక్ష సఫలం కావాలని మతపెద్దలు ఆకాంక్షించారు. 

ప్రజాశ్రేయస్సును కోరే జగన్ ఆలోచనలు, ప్రయత్నాలు విజయవంతం కావాలని ప్రార్థించారు. ఆయన వెంట ఉండే నాయకులందరి ఆలోచనలు సఫలం కావాలని, జనం అండదండలు ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం జగన్ ఆర్మూర్ కు బయల్దేరారు. 
Share this article :

0 comments: