‘మత్తు’ కల్లు నాలుక మీద పడకుంటేహిస్టీరియాతో ఊగిపోతున్న పల్లెలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మత్తు’ కల్లు నాలుక మీద పడకుంటేహిస్టీరియాతో ఊగిపోతున్న పల్లెలు

‘మత్తు’ కల్లు నాలుక మీద పడకుంటేహిస్టీరియాతో ఊగిపోతున్న పల్లెలు

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

బడుగుల జీవితాల్లో విషం చిమ్మేందుకు డైజో‘పాము’ మళ్లీ పల్లెలను చుట్టుముట్టింది... టీడీపీ నేత మేనల్లుడు చేస్తున్న అక్రమ వ్యాపారం బారిన పడి పల్లె ప్రజలు తల్లడిల్లుతున్నారు... రసాయనాలతో తయారుచేసిన కల్లు నాలుక మీద పడకుంటే పల్లెలుహిస్టీరియాతో ఊగిపోతున్నాయి... మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామంలో ఇదే జరిగింది. నిత్యం కల్లు తాగేవాళ్లు వింత ప్రవర్తనతో హల్‌చల్ చేశారు. గతంలో ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో... అప్పటి ఎక్సైజ్ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ వైట్‌వాష్’ దెబ్బకు పారిపోయిందనుకున్న ఈ కల్తీకల్లు ‘విష’ సంస్కృతి ఇప్పుడు టీడీపీ నేత మేనల్లుడి చేతిలో పడి మళ్లీ జీవం పోసుకుంది. కర్నూలు జిల్లా గీత కార్మిక సామాజిక వర్గానికే చెందిన ఒక మాజీ మంత్రి, టీడీపీ నాయకుని మేనల్లుడే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో కల్లు సొసైటీలను అనధికారికంగా లీజుకు తీసుకొని నడిపిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అతను, అతని అనుచరులే కర్ణాటక రాష్ట్రం నుంచి డైజోఫాం, ఆల్ఫ్రాజోలం మత్తుమందును అక్రమంగా దిగుమతి చేసి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.

డైజోఫాం ఉన్నట్లు నిర్ధారణ: డైజోఫాం, ఆల్ఫ్రాజోలం అనే రసాయనిక మత్తు పదార్థాలతో కృత్రిమ కల్లు తయారుచేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కల్లు దుకాణాలపై దాడులు చేసి కల్తీ కల్లు శాంపిల్స్ సేకరించారు. కర్నూలు జిల్లా ఆదోని, నెల్లూరు జిల్లా గూడూరు, మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు, మెదక్ జహీరాబాద్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, కుత్బుల్లాపూర్, నల్లగొండ జిల్లా వెలిమినేడు, వరంగల్ జిల్లా నర్సింహులపేట, కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతాల్లో కల్లు శాంపిల్స్ సేకరించారు. కొన్ని శాంపిల్స్‌ను కర్నూలు ఎక్సైజ్ లేబరేటరీకి, మరికొన్నిటిని హైదరాబాద్ లేబరేటరీకి పంపించగా ఏడు శాంపిల్స్‌లో డైజోఫాం ఉన్నట్లు నిర్ధారణ అయింది. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు కల్లు సొసైటీలపై దాడులు చేస్తూ డైజోఫాం లేకుండా చేశారు. 

డైజోఫాం కలిపిన కల్లు దొరక్కపోవడంతో కొన్ని రోజుల కింద అదే మండలంలోని రంగాపురంలో నిత్యం కల్లు తాగేవాళ్లు పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తూ చెట్లు, పుట్టల వెంట పరుగులు పెట్టారు. ఇవి హిస్టీరియా లక్షణాలని, డ్రగ్స్‌కు బానిసైన వాళ్లకు ఒక్కసారిగా అది అందుబాటులోకి లేకుంటే ఇలానే ప్రవర్తిస్తారని వైద్యులు చెప్పారు. ఓ మాజీ మంత్రి, టీడీపీ నేత మేనల్లుని అనుచరులే మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మత్తుపదార్థాలతో కల్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మేనల్లుడిని కాపాడేందుకు ఆ మాజీ మంత్రి రంగప్రవేశం చేసినట్లు తెలిసింది. ఆకస్మిక దాడులు నిర్వహిస్తే రంగాపూర్‌లాంటి సంఘటనలు ప్రతి జిల్లాల్లో చోటుచేసుకునే అవకాశం ఉందని, ఇది ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతుందని ఎక్సైజ్ మంత్రితో చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు కల్పించుకొని తొందరపడి కల్తీ కల్లుపై దాడులు చేసి ప్రభుత్వానికి కొత్త సమస్యలు తేవద్దని ఎక్సైజ్ అధికారులకు సూచించినట్లు సమాచారం.
Share this article :

0 comments: