సర్కార్‌పై జూడాల సీరియస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కార్‌పై జూడాల సీరియస్

సర్కార్‌పై జూడాల సీరియస్

Written By ysrcongress on Tuesday, January 31, 2012 | 1/31/2012

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజులుగా ప్రభుత్వ జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు సోమవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి చేరుకుని దీక్ష చేస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వం జూ
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజులుగా ప్రభుత్వ జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు సోమవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి చేరుకుని దీక్ష చేస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వం జూతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజులుగా ప్రభుత్వ జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు సోమవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి చేరుకుని దీక్ష చేస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వం జూడాలను చర్చలకు ఆహ్వానించింది. చర్చల్లో పాల్గొనేందుకు సచివాలయానికి వెళ్లిన జూడాల ప్రతినిధులు ఆగ్రహంతో తిరిగొచ్చారు.

54 మంది జూడాలు అరెస్ట్
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డీఎల్ చర్చలు జరుపకుండా తమ నేతలను అవమానించారని ఆరోపిస్తూ సాయంత్రం పలువురు డాక్టర్లు ముషీరాబాద్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ట్రాఫిక్‌కు విఘాతం కల్గించవద్దని సూచించారు. అయినప్పటికీ వైద్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వం స్పందించేవరకు తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అప్పటికే అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో సుమారు 54మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అరెస్టు చేసిన జూడాలను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

‘గాంధీ’కి తరలి వచ్చిన నేతలు
తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఆరు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సోమవారం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, సీపీఎం కార్యదర్శి రాఘవులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ముఖ్య నేత బాజిరెడ్డి గోవర్థన్, రాజ్‌ఠాకూర్, వెల్లాల రామ్మోహన్, మోహన్‌కుమార్, భీమార్జునరెడ్డి, టి.వెంకట్‌రెడ్డి తదితరులు మద్దతు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మంది జూడాలు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. డిమాండ్లు సాధించేవరకు దీక్షలను విరమించేదిలేదని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: