విద్యుత్ చార్జీలు పెంచొద్దు-బాబు ఆవకాశవాదం (must watch) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ చార్జీలు పెంచొద్దు-బాబు ఆవకాశవాదం (must watch)

విద్యుత్ చార్జీలు పెంచొద్దు-బాబు ఆవకాశవాదం (must watch)

Written By ysrcongress on Wednesday, January 11, 2012 | 1/11/2012

"రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ నేతలు తమ పాపాలు, చేతగానితనంతో కరెంటు సంస్థలను నిండా నష్టాల్లో ముంచేశారు. చార్జీలు పెంచి ఆ భారాన్ని ప్రజలపై నెట్టివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు చేసిన తప్పునకు ప్రజలు ఎందుకు భారం మోయాలి. దీనిపై ఊరుకునేది లేదు.. ప్రతిఘటిస్తాం, ప్రజలను కదిలిస్తాం'' అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యుత్ కోతలు.. చార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ ఆ పార్టీ మంగళవారం ఇక్కడ పాదయాత్ర నిర్వహించింది. 

అయితే.. ఈ పాదయాత్ర ప్రారంభమైన కొద్ది సేపటికే పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు సహా ముఖ్య నేతలందరినీ అరెస్టు చేశారు. వారందరినీ మధ్యాహ్నం రెండు గంటల అనంతరం వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బంజారా హిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. " మేం 2004లో మిగులు బడ్జెట్‌తో విద్యుత్ సంస్థలను అప్పగించి వెళ్ళాం. అప్పటి నుంచి వాటికి ఈ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. కరెంటు ఉత్పత్తి పెంచలేదు. గాలికి వదిలిపెట్టారు. దాంతో ఆ సంస్థలు 16 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. 

ఇప్పుడవన్నీ చూపించి రాష్ట్ర ప్రజలపై ఒకేసారి రూ. పది వేల కోట్ల భారం వేయాలని చూస్తున్నారు. ఈ అప్పులకు కారణం ప్రభుత్వం. తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజల జేబులు గుల్ల చేసి ఆ డబ్బు వసూలు చేస్తానంటే ఊరుకొనేది లేదు. ప్రతిఘటిస్తాం.. ప్రజలను కదిలిస్తాం'' అ ని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నేత ల నిర్వాకంతో విద్యుత్ రంగంలో రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి పోయిందని బాబు ఆరోపించారు. " మా హయాంలో 5500 మెగావాట్ల విద్యుత్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చాం. 


NOW WATCH VIDEO




Share this article :

0 comments: