రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులు అత్యుత్సాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులు అత్యుత్సాహం

రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులు అత్యుత్సాహం

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

 రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. అప్పటికీ వారు కదలకపోవడంతో అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలలో ఎక్కించారు. ఆ సమయంలో ముగ్గురు మహిళలు కింద పడ్డారు. వారికి గాయాలయ్యాయి. ఒక మహిళ తలకు బలమైన గాయం అయింది. లాఠీ చార్జీలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు.






ఒంగోలు:  ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించే ప్రయత్నమే ఈ ధర్నా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిని భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థి ఫీజులు చెల్లించలేక, తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దాంతో తన మనసు చలించిపోయిందన్నారు. అప్పుడే తాను ఏడు రోజులు దీక్ష చేసి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. ఈరోజు కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొందన్నారు. అందుకే రాష్ట్రం అంతటా ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. స్కాలర్ షిప్ లు కూడా అందలేదని ఇక్కడకు వచ్చిన తరువాత విద్యార్థులు తనకు చెప్పారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అబద్దం చెప్పారన్నారు. 

కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత చదువులు చదివితే పేదరికం పోతుందని ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశించారని చెప్పారు. కులాలు, మతాలు, రాజకీయాలు చదువులకు అడ్డు రాకూడదని ఆ మహానేత పేదలందరికీ వర్తించే విధంగా ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారని గుర్తు చేశారు. 9 ఏళ్ల పాలనలో విద్యార్థులు దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. వారి సమస్యలు 
తెలుసుకోవాలని ఎందుకు అనుకోలేదని అడిగారు. ఒక్కరోజైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు రైతుల కోసమో, పేదల కోసంమో శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేదన్నారు. ప్రభుత్వం పడిపోదని తెలిసే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ని ఇబ్బందులు పెట్టడానికే ఆయన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా పదవి పోతుందని తెలిసినా 17 మంది ఎమ్మెల్యేలు ఆ మహానేతపై ఉన్న అభిమానంతో రైతుల కోసం అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారని గుర్తు చేశారు. వారిలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి కూడా ఒకరని ఆయనని చూపించారు. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. 

జిల్లా నలుమూల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం అంతా నేల ఈనిందా అన్నట్లు ఉంది. ఒంగోలు పట్టణం జనంతో నిండిపోయింది. 

అనంతరం జగన్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. 


  సీబీఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాదని.. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆంగ్ల టెలివిజన్ చానెల్ టైమ్స్ నౌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను జగన్ మాట్లాడారు. విజయసాయిరెడ్డి అరెస్ట్ తమకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన చెప్పారు. సీబీఐ దర్యాప్తు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎలా కోరుకుంటున్నాయో అలాగే జరుగుతోందని జగన్ విశ్లేషించారు. 

తనపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని జగన్ అన్నారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గౌరవం అకస్మాత్తుగా తగ్గిపోయిందన్నారు. తన కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి కొత్త సమాచారమేదీ లేదన్నారు. ఈనాడుతో సమంగా ఉన్న సాక్షి పత్రిక విలువ.. మరో తెలుగు పత్రిక ఈనాడు కంటే సగం ధరలో లభిస్తున్నపుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టకుండా ఎలా ఉంటారని జగన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

దేశ పత్రికారంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాక్షి ఒకేసారి 23 కేంద్రాలలో ప్రారంభమైందని.. ఈనాడు కంటే మెరుగైన స్థితిలో ఉన్న సాక్షి విలువ.. ఈనాడు కంటే సగం ధరకే లభిస్తున్నపుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారా? అని జగన్ ప్రశ్నించారు. 

కోర్టు దర్యాప్తుకు ఆదేశించిన పుడు అందులో ప్రభుత్వం అనే పదం ఉందని.. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ప్రభుత్వం అనే పదం స్థానంలో రాజశేఖరరెడ్డి అనే పదం వచ్చిందని జగన్ చెప్పారు. ఈ విషయాన్ని బట్టి సీబీఐ ఎలా వ్యవహరిస్తోందో అర్ధమవుతుందని జగన్ మరో ప్రశ్నకు సమధానమిచ్చారు.


  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్దాలు పలికారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఒంగోలులో ‘ఫీజు పోరు’ ధర్నాలో పాల్గొన్న వైఎస్ జగన్ పాలక, ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. విద్యార్థులకు వంద రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా అందలేదని.. విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని జగన్ అన్నారు. 

ఫీజు బకాయిలు కోసం బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలకు పొంతన లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ఫీజు ధర్నా సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించలేని పరిస్థితిలో వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. 

రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు కనుమరుగైపోయాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విలువలు దొరకని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు విద్యార్థుల, రైతుల బాధలు పట్టవన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఒంగోలు కలెక్టర్‌కు జగన్ మెమొరాండం సమర్పించారు.
Share this article :

0 comments: