చంద్రబాబు పచ్చి అవకాశవాది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పచ్చి అవకాశవాది

చంద్రబాబు పచ్చి అవకాశవాది

Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012

* వైఎస్సార్ హయాంలో లక్షలాదిమంది పేదలు లబ్ధిపొందారు
* వారు చందాలు వేసుకుని ఆయన విగ్రహాలు పెట్టుకుంటున్నారు
* వాటిపై చేయిపడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు
* లక్ష ఎన్టీఆర్ విగ్రహాలు పెడతాననడం కామెడీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలను కూల్చివేస్తామని చెప్పడం, తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ దుయ్యబట్టారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడుకట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆమె తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘దివంగత వైఎస్సార్ విగ్రహాలు ఎవరో చెబితే, పంపిణీ చేస్తే ఏర్పాటు చేసినవి కావు. వైఎస్ ఐదేళ్ల పాలనలో లబ్ధి పొందిన పేదప్రజలు తమ అభిమానం కొద్దీ చందాలు వేసుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వృద్ధులు నెలకు వారికొచ్చే రూ. 200 పెన్షన్‌లో వంద రూపాయలను చందాలుగా వేసుకొని అభిమానాన్ని చాటుకుంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు పేద ప్రజలను అవమానపరచేవిలా ఉన్నాయి’’ అని విమర్శించారు. వైఎస్సార్ విగ్ర హాలపై చేయిపడితే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని, తమ తడాఖా చూపిస్తారని హెచ్చరించారు. 

‘‘వైఎస్సార్ విగ్రహాలపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా.. వైఎస్సార్ రెక్కల కష్టం మీద పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నేతలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమతి లేని వైఎస్సార్ విగ్రహాలకు వెంటనే అనుమతి మంజూరు చేయాలి’’ అని సురేఖ డిమాండ్ చేశారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం అతి పెద్ద కామెడీ అని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. వెన్నుపోటు పొడిచి, చెప్పులు విసిరి అవమానపరచి, కోలుకోలేని విధంగా చేశారు. బాబు తన హయాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ ఫోటోను కూడా పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వ్యక్తి లక్ష విగ్రహాలంటున్నారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది. అందుకే మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ మీద కపటప్రేమ వలకబోస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.

మీపై ఆరోపణలు చేస్తే తొలగిస్తారా?
‘‘దివంగత వైఎస్సార్, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించి కేసులు వేసిన శంకర్రావుకు మంత్రి పదవితో సన్మానించారు. అవే ఆరోపణలు సీఎం కిరణ్ ఆయన కేబినెట్‌పై చేస్తే పదవి నుంచి తొలగిస్తారా? ఇది కాంగ్రెస్ ద్వందనీతికి నిదర్శనం’’ అని సురేఖ ధ్వజమెత్తారు. ప్రజల్లో వైఎస్సార్‌కున్న అభిమానాన్ని తగ్గించేందుకు శంకర్రావును ఒక కరివేపాకులా ఉపయోగించుకున్నారని విమర్శించారు. శంకర్రావు వ్యాఖ్యలే ప్రమాణికంగా తీసుకునేట్లయితే సీఎం కిరణ్‌తో సహా కేబినెట్ మొత్తం విచారణ జరిపించుకుని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
Share this article :

0 comments: