దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారు

దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారు

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012

* దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారు... అభాండాలు వేస్తున్నారు
* వైఎస్సార్ కాంగ్రెస్ లేకుండా చేయడానికి కాంగ్రెస్, టీడీపీల కుట్ర
* ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కవు
* వైఎస్‌ను ప్రేమించే ప్రతి హృదయం ఒక్కటవుతుంది

‘‘ఇచ్చిన మాట మీద నిలబడ్డందుకు, విలువలు, విశ్వసనీయత వైపు నిలిచినందుకు నా మీద ఈరోజు అవినీతి ఆరోపణలతో అభాండాలు వేస్తున్నారు.. దొంగ కేసులు పెడుతున్నారు.. నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి లేకుండా చేసేందుకు క్రూర రాజకీయాలు చేస్తున్నారు.. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే బదులు.. కాల్చి చంపేయకూడదా...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదనగా ప్రశ్నించారు. 

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ కుమ్మక్కై క్రూరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు.. కోర్టుల దాకా వెళ్లి సీబీఐ విచారణను ఎందుకు తప్పించుకుంటున్నారని నిలదీశారు. గుంటూరు జిల్లాలో 56వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా మంగళవారం గురజాల నియోజక వర్గం దాచేపల్లి, గురజాల మండలాల్లోని పలు గ్రామాల్లో జగన్ పర్యటించారు. మొత్తం తొమ్మిది వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. గురజాల నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ పార్కులో నిర్మించిన వైఎస్ విగ్రహాన్ని, ఫౌంటేన్‌ను ఆవిష్కరించారు. ఓదార్పు యాత్రలో జగన్ వెంట మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. గురజాలలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనం ప్రభంజనంలా తరలివచ్చారు. అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే...

ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట..!
రాష్ర్ట చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక క్రూరమైన రాజకీయం జరుగుతోంది. ఆ రాజకీయం ఏమిటంటే..! రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉండాలట! ఒకటి తెలుగుదేశం, మరొకటి కాంగ్రెస్. ఓటు వేయడానికి ప్రజలకు మూడో పార్టీ కనపడకూడదట. ఆ పరిస్థితులు తీసుకురావడానికి చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పెద్దలు ఇద్దరు కూడా కుమ్మక్కై నానా అవస్థలు పెడుతున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. అవినీతి ఆరోపణలతో అభాండాలు వేస్తున్నారు. ఇవ్వాళ ఒక్కమాట అడుగుతున్నా.. దివగంత నేత రాజశేఖరరెడ్డిగారు బతికి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. సాక్షాత్తూ సోనియాగాంధీ దగ్గర్నుంచి మన్మోహన్‌సింగ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నేత దేశంలోనే ఎక్కడా లేరని కొనియాడ లేదా?

విలువలతో కూడిన రాజకీయాలు చేయండి..
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత... నేను మాట మీద నిలబడ్డానని, ఆ నేత చనిపోయిన ప్రదేశంలో నిలబడి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఒక మాట ఇచ్చానని, ఆ మాటను గాలికి వదిలేయమని మీరు చెపితే వదిలేయలేకపోయానని, విలువల కోసం, విశ్వసనీయత కోసం నిలబడాడ్డనని, ఒకే ఒక్క కారణంతో నా కుటుంబాన్ని, నన్ను, అందరిని కూడా సర్వనాశనం చేసేందుకు ఇన్నిన్ని పన్నాగాలు పన్నే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడైనా రాజకీయాలు చేస్తే అవి విలువలతో కూడిన రాజకీయాలై ఉండాలి. మీరు ప్రజల్లోకి రండి.. వచ్చి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకొనే కార్యక్రమాలు చేయండి. ప్రజల మన్ననలు పొందే రాజకీయాలు చేయండి. కానీ ఈ మాదిరిగా ఒక పార్టీ ఉండకూడదని, ఒక మనిషి ఉండ కూడదని నీచమైన రాజకీయాలు చేసే బదులు ఆ మనిషిని కాల్చి చంపేయ్యకూడదా.. అని ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలనూ, చంద్రబాబు నాయుడును అడుగుతున్నా!

ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు
ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆయన తరపున ఎవరూ మాట్లాడలేరని, ఇక ఆ వ్యక్తి రారని ఆయనపై అభాండాలు వేస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. మీ నీచ రాజకీయాలను ఎవరూ చూడటం లేదని అనుకోకండి. పైనుంచి దేవుడు అనే వాడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికల వచ్చినా దివంగత నేత వైఎస్సార్‌ను ప్రేమించే ప్రతి హృదయం ఒక్కటౌతుంది. చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్‌కు రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రాని రోజులు వస్తాయి. ఇలాంటి కష్ట సమయంలో ఎవ్వరూ లేరని అనుకోబోకండి. ఆ దివంగత నేత నీకు ఇంతపెద్ద కుటుంబాన్ని ఇచ్చి పోయాడు అని గురజాల పట్టణం అంతా నడిరోడ్డు మీదకు వచ్చి నాపై ఆప్యాయత చూపిస్తోంది. ఇంతటి ఆత్మీయతను పంచి పెడుతున్న మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను.

చంద్రబాబూ.. నువ్వా అవినీతిపై మాట్లాడేది?
ఈరోజు చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నువ్వా..! అవినీతి గురించి మాట్లాడేది. ఈ చంద్రబాబుకు ఇవాళ ఒక సవాల్ విసురుతున్నా. అయ్యా.. చంద్రబాబునాయుడుగారు.. వైఎస్సార్ చనిపోయి రెండున్నరేళ్లు దాటింది. అయినా ప్రతి మీటింగ్‌లోనూ, ఆయన పేరును తలచుకుంటున్నావు. ప్రతిరోజూ ఆయన్ను తిడుతూనే ఉంటావు. నువ్వు అవినీతి గురించి మాట్లాడే ముందు.. కోర్టుల దాకా వెళ్లి, ఆ కోర్టులను కూడా మ్యానేజ్ చేసుకొని నీ మీద సీబీఐ విచారణ లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. నేను ఒకటే ఒకటి అడుగుతున్నా.. నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, ఆ కోర్టుల దాకా పోకుండా నీపై సీబీఐ విచారణ వేసుకో, నీ కుటుంబ సభ్యుల మీద వేసుకో, నీ ఆస్తుల మీద వేసుకో, సచ్చీలుడిగా బయటికి రా.. వచ్చినప్పుడు నీతో పాటు మేం అందరం హర్షిస్తాం. కానీ నీ దాకా వచ్చినప్పుడేమో సీబీఐ వద్దంటావు. నీ అనుయాయులకు కూడా సీబీఐ వద్దంటావు. కానీ వేరే వాళ్ల మీద మాత్రం అదే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత తప్పుడు కేసులు పెట్టించడానికి ఢిల్లీ దాకా పైరవీలు చేస్తావు.
Share this article :

0 comments: