బాబు పాలనలో... వైఎస్ పాలనలో... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు పాలనలో... వైఎస్ పాలనలో...

బాబు పాలనలో... వైఎస్ పాలనలో...

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012



కృష్ణా డెల్టాలోని 40 లక్షల ఎకరాలకు... ఖరీఫ్ పంటకు కూడా నీరివ్వలేమని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం చంద్రబాబునాయుడిది.
రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వొద్దని వాదించిన చంద్రబాబునాయుడు... తాను ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు హార్స్ పవర్‌కు రూ.50 చొప్పున రైతు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తాన్ని ఏకంగా రూ.625కు పెంచారు. అదే కాక గృహ అవసరాలకు 1995-96లో 19, 1996-97లో 32, 1998-99లో 10, 2000-01లో 14.8 శాతం ఛార్జీలు పెంచినదీ బాబు ప్రభుత్వమే. దీనికి సర్ ఛార్జీ అదనం.

అధికారంలోకి వచ్చినరోజునే వైఎస్ చేసిన మొట్టమొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు, వ్యవసాయ విద్యుత్తు బకాయిల మాఫీ.

ప్రభుత్వాలు రైతుకు అండగా నిలబడకపోతే... నేటికీ 60 శాతం ప్రజలు వ్యవసాయంమీద ఆధారపడిన దేశంలో.... విప్లవాలు పుడతాయి. సమాజంలో అశాంతి, అలజడి పెరిగిపోతాయి. కాబట్టే వైఎస్, కేవలం మన రాష్ట్రంలోని రైతులకే కాక, మొత్తంగా దేశంలో రైతులందరికీ రుణ భారం తగ్గించండని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చారు. దేశం మొత్తంమీద 70 వేల కోట్ల రూపాయల మేరకు రుణాల మాఫీవల్ల రైతులకు ప్రయోజనం కలిగితే, అందులో ఆంధ్రప్రదేశ్ రైతులకే 15 వేల కోట్ల మేరకు ప్రయోజనం లభించింది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ అన్నది రుణాలు కట్టని రైతులకే వర్తించేది తప్ప, అప్పోసప్పో చేసి, నగలు అమ్ముకుని వ్యవసాయ రుణాన్ని తీర్చిన రైతుకు దీనివల్ల మరింత వేదనే తప్ప ప్రయోజనం లేదని అర్థమైనప్పుడు... దేశంలో మిగతా రాష్ట్రాలకు భిన్నంగా... వ్యవసాయ రుణాలను తీర్చివేసిన రైతులకు కూడా రూ.5000 వరకు చెల్లించిన ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఒక్కరే.
వ్యవసాయ రుణాలమీద కేంద్ర ప్రభుత్వం వందకు ఏడు రూపాయల వడ్డీ వేయండంటే...

అందులో నాలుగు శాతాన్ని ప్రభుత్వమే భరించి మూడు శాతం వడ్డీకే... పావలా వడ్డీకే వ్యవసాయ రుణాలను రైతన్నకు ఇచ్చిన ప్రభుత్వం కూడా వైఎస్‌ఆర్ ప్రభుత్వమే.

భారత్ నిర్మాణ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు.... దేశం మొత్తం మీద కోటీ యాభై లక్షల ఎకరాలకు నీరందిస్తామని కేంద్రంలో పెద్దలు వాగ్దానం చేశారు. అందులో సగం అంటే దాదాపు డెబ్భై అయిదు లక్షల ఎకరాలకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే నీరందించే ఏరాట్లు చేస్తూ... ప్రాజెక్టులన్నింటికీ క్లియరెన్సులు తెచ్చి... ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారీగా చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మాత్రమే.

రైతుకు సంస్థాగతంగా రుణాలు అందకపోవటమే అసలు సమస్య అని గుర్తించి, వారికి బ్యాంకులు, సహకార సంస్థల ద్వారా రుణాలు అందకపోతే.... వ్యవసాయం నిప్పులమీద నడకలాగే ఉంటుందని గుర్తించి... అలా ఇచ్చే రుణాలను భారీగా పెంచినదీ వైఎస్ ప్రభుత్వమే. దేశంలో ఇలా బ్యాంకులు, సహకార సంస్థలనుంచి వ్యవసాయ రుణాలందుకుంటున్న ప్రతి ముగ్గురు రైతులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రైతే... అంటే, రైతులకు చేసిన మేలు ఏ స్థాయిలో ఉన్నదీ అర్థమవుతుంది.

చంద్రబాబు దిగిపోయిన 2003-04లో అందించిన పంటరుణాలు 57 లక్షల రైతులకు రూ.7,900 కోట్లయితే... 2008 నాటికి 80 లక్షల మంది రైతులకు రూ.20,000 కోట్లను పంట రుణాలుగా అందించిన ఘనత వైఎస్‌ది.

అధికారంలోకి వచ్చీ రావటంతోనే 1259 కోట్ల రూపాయల వ్యవసాయ విద్యుత్త బకాయిలను మాఫీ చేసినదీ... మరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమూ కాదు... అలా రైతు పక్షపతం ప్రదర్శించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మాత్రమే.

ఏటా దాదాపు పదమూడు వందల కోట్ల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇచ్చినదీ... మొత్తం దేశ చరిత్రలో వైఎస్‌ఆర్ ఒక్కరే.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీలకు మూడు దఫాలలో దాదాపు ఆరు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసినదెవరంటే సమాధానం... వైఎస్‌ఆర్.

పేరుకు ఇన్ని ఎకరాల భూమి ఉన్నా... అందులో వ్యవసాయం చేయటానికి వీలులేని పరిస్థితుత్లో వాటిని బంజర్లుగా వదిలేసిన రైతుల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టినది వైఎస్‌ఆర్...

బీదల భూములు వేరే వ్యక్తులకు అన్యాక్రాంతమైపోయినప్పుడు.. ఆ ఎసైన్డ్ భూముల్ని తిరిగి అదే బీదలకు అప్పగించేందుకు, వారికి భూ భద్రత కల్పించేందుకు... చట్టాలనే మార్చిన రైతు బాంధవుడు ఎవరంటే... అదీ వైఎస్‌ఆర్.

టీడీపీ పాలన చివరి ఏడాది అయిన 2003-04లో వ్యవసాయానికి కేటాయింపులు ముష్టి రూ.310 కోట్లయితే, 2008-09 నాటికే వైఎస్‌ఆర్ వ్యవసాయ బడ్జెట్ రూ.1542 కోట్లు.

చంద్రబాబు ధ్యాసంతా ఇంకుడు గుంతలమీద ఉంటే, వైఎస్ దృష్టి ఇందిరా సాగర్ వంటి దేశంలోకెల్లా అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణం మీద.

వైఎస్ హయాంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా ఒక్క అయిదేళ్లలో ఒక్క పైసా పన్ను అదనంగా విధించినది లేదు. ఒక్క పైసా ఆర్టీసీ ఛార్జీలుగానీ, విద్యుత్తు ఛార్జీలుగానీ పెంచినది లేదు. అన్నింటికీ మించి రైతుకు మరెంతో మేలుకలుగుతుందన్న విశ్వాసం నెలకొన్నది వైఎస్ పాలనలో మాత్రమే.
Share this article :

0 comments: