లక్ష్మీనారాయణకు, ఇతర అధికారులకు నార్కో అనాలసిస్ చేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష్మీనారాయణకు, ఇతర అధికారులకు నార్కో అనాలసిస్ చేయాలి

లక్ష్మీనారాయణకు, ఇతర అధికారులకు నార్కో అనాలసిస్ చేయాలి

Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012

* సీబీఐ విచారణపై ప్రజల్లో అనుమానాలున్నాయి
* అందుకే లక్ష్మీనారాయణకు, ఇతర అధికారులకు నార్కో అనాలసిస్ చేయాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆడిటర్ విజయసాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు జరిపేందుకు అనుమతివ్వాలంటూ కోర్టును సీబీఐ కోరడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు సీబీఐ విచారణ తీరుపైనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి అసలు సీబీఐ అధికారులు, సంస్థ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నిజాయతీగా, చిత్తశుద్ధితో దర్యాప్తు జరుపుతున్నారో, లేక అధికార పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి వారికే నార్కో పరీక్షలు నిర్వహించాలి’’ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. సీబీఐ తీరు ఏ మాత్రం నిజాయతీగా లేదని, అది అధికారపార్టీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సాయిరెడ్డి మాదిరిగా సీబీఐ విచారణకు సహకరించిన వ్యక్తి రాష్ట్రంలోనే గాక దేశంలోనే మరొకరు ఉండరని చెప్పారు. వారి ప్రశ్నలన్నింటికీ గంటల తరబడి ఓర్పుగా ఆయన సమాధానాలిచ్చారని వివరించారు.

జగన్‌ను ఇరికించడమే లక్ష్యం
ఏదోలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ కేసుల్లో ఇరికించి, ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీసే కుట్రతోనే కాంగ్రెస్, సీబీఐ ముందుకు పోతున్నాయని శోభ ఆరోపించారు. ‘‘రామోజీరావు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులదీ అదే ఎజెండా. వైఎస్ తదనంతరం ఇక అధికారం తమదేననుకున్న బాబు, రామోజీలకు.. జగన్‌కు లభిస్తున్న జనాదరణ మింగుడుపడటం లేదు. అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుని దుష్ర్పచారానికి ఒడిగట్టారు. ఎమ్మార్ వ్యవహారంలో సునీల్‌రెడ్డి అరెస్టే ఇందుకు నిదర్శనం. సీబీఐ పూర్తిగా చంద్రబాబు డెరైక్షన్‌లోనే దర్యాప్తు చేస్తోంది. జేబు సంస్థలా వ్యవహరిస్తోంది. ఇవి నా మాటలు కాదు. ఏకంగా పార్లమెంటులోనే జాతీయ పక్షాలన్నీ బయట పెట్టిన వాస్తవాలు. 

అధికారంలో ఉన్న పార్టీకి సీబీఐ కొమ్ముకాస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అదే స్పష్టంగా కనిపిస్తోంది. తననెవరు వ్యతిరేకించినా, ఆత్మాభిమానంతో పార్టీ వీడినా ఇలాగే సీబీఐ ద్వారా వేధింపులుంటాయంటూ, జగన్‌ను ఇబ్బందులు పెట్టడం ద్వారా దేశానికి సోనియా ఓ సందేశమిస్తున్నారు. ఎమ్మార్ కుంభకోణంలో థర్డ్ పార్టీ జోక్యానికి అనుమతిచ్చిందే బాబు అయితే, ఆయన్ను వదలి వేసి సీబీఐ మరో దిశలో వెళ్లడాన్ని ఏమనాలి? దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌ను రాష్ట్రానికి పరిచయం చేసింది బాబు, తెచ్చింది కోనేరు ప్రసాద్ అయినప్పుడు.. ఆ కోణంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? బాబు దుబాయ్ వెళ్లినప్పుడల్లా కోనేరు ఇంట్లోనే బస చేసేవారని రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా సీబీఐ మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు. 

వైఎస్ హయాంలో ఎమ్మార్ వ్యవహారంలో ప్రభుత్వ వాటాను మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల సిఫార్సు మేరకే తగ్గించారు. మరి ఆ ఉపసంఘం సభ్యులు, అధికారుల్లో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? సునీల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోపే, ఆయన దర్యాప్తుకు సహకరించడం లేదు కాబట్టి అరెస్టు చేశామని సీబీఐ చెప్పడం విడ్డూరం. సాక్షి పత్రిక ప్రారంభోత్సవంలో జగన్, ఆయన కుటుంబసభ్యులతో సునీల్ కలిసి ఉన్న ఫొటోలను ప్రచురించిన రామోజీకి.. కోనేరు ప్రసాద్‌తో బాబు కలిసున్న ఒక్క ఫొటో కూడా దొరకలేదా?’’ అంటూ శోభ ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: