వీణ-వాణిల పోషణపై అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వం లెక్కలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వీణ-వాణిల పోషణపై అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వం లెక్కలు

వీణ-వాణిల పోషణపై అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వం లెక్కలు

Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012


వైద్యుల పర్యవేక్షణ, నర్సుల లాలింపు, ఆయాల పలకరింపుల మధ్య హాయిగా గడచి పోతున్న వీణ-వాణిల జీవితంలోకి అనుకోని ఉపద్రవం తొంగిచూసింది. తమను విడదీస్తారో లేదో తెలియదు. ఒకవేళ విడదీస్తే ఏమవుతుందో నన్న ఆలోచన కూడా ఇన్నాళ్లూ ఆ చిన్నారుల పసిమనసుల్లోకి తొంగిచూడలేదు. కానీ తొమ్మిదేళ్ల వయస్సులో.. వైద్యులేమనుకుంటున్నారో, నర్సులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఆయాల మనసులో ఏముందో పసిగట్టేస్తున్నారు. ఇటీవలి పరిణామాలు సృష్టించిన అలజడి వారి ముఖాల్లో ప్రతిబింబిస్తోంది. ఆస్పత్రి నుంచి తమను పంపించివేస్తారేమోననే ఆందోళన వారిని కలవరపరుస్తోంది. స్వల్ప అనారోగ్యానికి కూడా గురయ్యారు. 

వాస్తవానికి దేశంలోనే అత్యంత అరుదైన కేసు ఇది. ఈ పరిస్థితుల్లో వారి పర్యవేక్షణ, శస్త్రచికిత్సకు మార్గాలను అన్వేషించాల్సిన సర్కారు.. తాము చేయాల్సిందంతా చేశాం, ఇక ఆ చిన్నారులను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటూ వదిలించుకోవాలని చూస్తుండటం, తల్లిదండ్రులు పెంచలేని స్థితిలో ఉండటం వెరసి వీణ-వాణిల భవితవ్యం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 

చికిత్స ఎప్పుడో చేసి ఉండాల్సింది
వీణ-వాణిల పోషణపై అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వం లెక్కలు వేస్తూండటం బాధాకరంగా ఉంది. వారికి శస్త్రచికిత్స ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా ఆ చిన్నారులను విడదీసేందుకు మార్గాలు అన్వేషించి ఓ సమర్థవంతమైన వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఆపరేషన్ విజయవంతం కావాలి, పిల్లలిద్దరూ బతకాలి అంటూ శస్త్రచికిత్స చేసే బృందంపై ఒత్తిడి తేకూడదు. సేవలందించేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే. 
-డా. నాయుడమ్మ, ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు, గుంటూరు

రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి 
ప్రభుత్వ తప్పిదం వల్లే అవిభక్త కవలల భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీణ-వాణిలకు శస్త్ర చికిత్స నిర్వహించేందుకు రూ.కోటి మంజూరు చేసేందుకు అంగీకరించారు. ఆయన అకాల మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుతం పిల్లల దుస్థితికి ప్రభుత్వమే కారణం. అందువల్ల నష్టపరిహారంగా రూ.50 లక్షలు, ఇళ్ల స్థలం ఇచ్చి చిన్నారులను ఆదుకోవాలి.
- అచ్యుతరావు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం
Share this article :

0 comments: