ప్రభుత్వానికి బుద్ధిచెప్పే సమయం వచ్చింది: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వానికి బుద్ధిచెప్పే సమయం వచ్చింది: జగన్

ప్రభుత్వానికి బుద్ధిచెప్పే సమయం వచ్చింది: జగన్

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

రాష్ట్ర రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి తేచ్చేందుకు రైతు బాంధవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దీక్ష చేపట్టారని కొండా సురేఖ తెలిపారు. రైతే రాజని నమ్మేవాడు మహానేత రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాసనసభలో రైతుల కోసం ప్రభుత్వాన్ని నిలదీసేవారని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచే ఆ మహానేత రైతుల గురించే ఆలోచించారన్నారు.

రైతులను జైళ్లకు పంపిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని ఆమె విమర్శించారు. రైతులు ఎన్ని బాధలు పడుతున్నా ప్రస్తుత ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.

రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి అండగా ఉంటానని జగన్ ధైర్యంతో ఈ దీక్ష చేపట్టారన్నారు. ఈ దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం ప్రకటించి విజయవంతం చేయాలని ఆమె కోరారు.

హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల దీవెనలతో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రైతు దీక్ష ప్రారంభించారు. ఈ సందర్బంగా పార్టీ తరపున మూడు డిమాండ్లను కొండా సురేఖ ప్రభుత్వం ముందు ఉంచారు.

ఒకటి: రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. ఆ నిధి ద్వారా పసుపు, పత్తి, మిరప, ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తుంది.

రెండు: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలి. విద్యుత్ కోతల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అంతరాయం లేకుండా 9 గంటలు విద్యుత్ ఇస్తే వారికి మేలు జరుగుతుందని తెలిపారు.

మూడు: కరువు మండలాలకు తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించాలి. ఇప్పటి వరకు ప్రకటించిన కరువు మండలాలకు ఆర్థిక సహాయానికి సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆర్థిక సహాయం ప్రకటించి ఆ మండలాలను ఆదుకోవాలి.

ఈ మూడు డిమాండ్లతో జగన్ దీక్ష ప్రారంభిస్తున్నట్లు సురేఖ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీలో కొత్త బిచ్చగాడు చిరంజీవి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతుదీక్ష సభావేదికపై నుంచి ఆమె మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి ప్రచారంపై మోజు ఎక్కువని, విషయం తక్కువని అన్నారు. అన్నివిధాలుగా రైతులకు అండగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆమె అన్నారు.


ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. రైతు దీక్ష చేపట్టే ముందు ఆయన కొద్దిసేపు మాట్లాడారు. తను రావడం ఆలస్యం అయినా, రాత్రి 8 గంటలు దాటే వరకు ఎదురు చూసిన ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గత రెండేళ్లుగా రైతన్న కోసం ఎన్ని దీక్షలు చేసినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. ఇక్కడి ప్రభుత్వం, దీనిని నడిపిస్తున్న కేంద్రంలోని ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే తాను ఈ దీక్ష చేపట్టినట్లు జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడంలేదన్నారు.
Share this article :

0 comments: