జగన్‌ను ఆశీర్వదించేందుకు ఉత్తర తెలంగాణ జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను ఆశీర్వదించేందుకు ఉత్తర తెలంగాణ జనం

జగన్‌ను ఆశీర్వదించేందుకు ఉత్తర తెలంగాణ జనం

Written By ysrcongress on Sunday, January 8, 2012 | 1/08/2012

ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కక అప్పుల పాలైన అన్నదాతకు అండగా యువనేత నిలుస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వారికోసం చేపట్టనున్న రైతు దీక్ష అందరినీ ఆకర్శిస్తోంది. రైతు బాం ధవుడిగా జనం గుండెల్లో గుడికట్టుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా, తండ్రిబాటలోనే అన్నదాతల వెన్నం టి నడుస్తున్న జగన్ ఇప్పటికే ప్రజల మనస్సుల్లో ముద్రవేసుకున్నారు. రైతులు, విద్యార్థులు, నిరుపేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మొద్దు నిద్రపోతున్న సర్కారు కళ్లు తెరిపించేందుకు వివిధ సందర్భాల్లో యువనేత దీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్మూరులో ఈనెల 10, 11, 12 తేదీల్లో జగన్ తలపెట్టిన రైతు దీక్ష సర్కారు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతాంగం కరువు కోరల్లో చిక్కింది. కరువు మండలాలుగా ప్రకటించినా ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం అందలేదు. పంట నష్టం అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు పం పారు. ఖరీఫ్‌లో భారీగా పంట దెబ్బతిన్న రైతాంగం రబీలోనూ నష్టాల పాలై ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నా సర్కారు కిమ్మనటం లేదు.

నిలువునా మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న పత్తి, పసుపు, వరి, చెరుకు రైతుల పక్షాన దీక్షకు సిద్ధమైన జగన్‌ను ఆశీర్వదించేందుకు ఉత్తర తెలంగాణ జనం తరలిరానుంది. ప్రజాసమస్యలపై జననేత స్పందిస్తున్న తీరు వాటి పరిష్కారం కోసం పోరాడుతున్న విధానం పట్ల ఆకర్శితులవుతున్నారు. పట్టుదలతో ఆయన వైఎస్‌కు వారసుడేనంటూ ప్రశంసిస్తున్నారు. జననేత దీక్షకు ఎంచుకున్న ఆర్మూరు వ్యవసాయంలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ప్రాంతం. వాణిజ్య పంటలను, విత్తనాలను పండించే ఈ ప్రాంత రైతులు ఆదర్శంగా నిలిచారు. పసుపు పంటకు ఆర్మూర్ ప్రసిద్ధి. వ్యవసాయం లాభసాటి అవుతుందని చాటి చెప్పిన ఈ ప్రాంత రైతులు కూడా ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సుదీర్ఘ పోరాటాలు చేసిన చరిత్ర గల తాము కష్టాల్లో ఉన్న సమయంలో మూడు రోజుల పాటు దీక్షకు పూనుకోవటం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆయన దీక్షకు బ్రహ్మరథం పట్టేందుకు రైతాంగం సిద్ధమయ్యింది. జిల్లాలో రైతాంగానికి వైఎస్ హయాం స్వర్ణయుగం లాంటిదని, ప్రస్తుత ప్రభుత్వ తీరు పూర్తిగా భిన్నంగా ఉందని చెబుతున్న రైతులు దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. 

నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా రైతులు భారీగా తరలిరానున్నట్టు సమాచారం. మరో పక్క జగన్ దీక్షకు యువత నుంచి కూడా అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. విద్యార్థుల కోసం పోరాడుతున్న ఆయన యువత మనస్సులను గెలుచుకున్నారు. మూడు రోజుల పాటు దీక్షలో పాల్గొంటామని ఆర్మూరు ప్రాంతానికి చెందిన యువకులు స్పష్టం చేస్తున్నారు. అన్ని గ్రామాల నుంచి ఆడ మగ తేడా లేకుండా స్వచ్ఛందంగా కదిలి వెళ్లాలని ఆర్మూరు, బాల్కొండ నియోజక వర్గాలలోని పలు గ్రామాభివృద్ధి కమిటీలు నిర్ణయించారు. జగన్ దీక్ష పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ రాజకీయ నాయకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. దీక్షను ప్రకటించగానే ప్రజలు నిండుమనస్సుతో స్వాగతించటం అన్ని పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది.
 


 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే రైతుదీక్ష తో ఉనికి కోల్పోతామన్న భయం టీడీపీ నేతలకు పట్టుకొందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ పేర్కొన్నారు. అందుకే ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం ఆయన నందిపేటలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్నపూర్ణమ్మ రైతు, బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు. ఆమె తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు తప్ప ఇతరులకు పదవులిచ్చిన దాఖలాలు లేవన్నారు. జగన్ దీక్షతో తన పునాదులు కదులుతాయని ఆమె జంకుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్లుగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో చంద్రబాబునాయుడి పాలన గుర్తుకు వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఒకే ఏడాదిలో పసుపు క్వింటాలు ధర రూ. 12 వేలు పడిపోయిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఆర్మూర్‌లో దీక్షకు పూనుకున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ సాయిరాం, నాయకులు ధర్మరాజు, శ్రీనివాస్‌రెడ్డి, గోపి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రైతులకు మద్దతుగా..
డిచ్‌పల్లి : జిల్లాలో రైతులకు మద్దతుగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 10, 11, 12 తేదీల్లో ఆర్మూర్‌లో దీక్ష చేస్తున్నారని, దీనికి మద్దతు తెలపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మునిపల్లి సాయరెడ్డి ప్రజలను కోరా రు. శనివారం ఆయన పార్టీ మండల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు, విద్యార్థులు, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. జిల్లా రైతుల కోసం అలీసాగర్, బర్ధిపూర్ ఎత్పిపోతల పథకాలు మంజూరు చేశారని, రామడుగు ప్రాజెక్ట్ ఆధునికీకరణకు నిధులిచ్చారని గుర్తు చేశారు. ఆయన మరణానంతరం అధికారంలోకి వచ్చిన వారు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాయకులు పదవులు కాపాడుకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారని, ప్రజలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. జగన్ చేపట్టనున్న దీక్షపై రైతులకు అవగాహన కల్పించేందుకు శనివారం చంద్రాయన్‌పల్లి, గన్నారం, ఇందల్వాయి, తిర్మన్‌పల్లి, నడిపల్లి, నల్లవెల్లి గ్రామాలలో పర్యటించామని తెలిపారు.

చంద్రయాన్‌పల్లి వద్ద స్వాగత ఏర్పాట్లు..
పార్టీ అధినేతకు చంద్రాయన్‌పల్లి వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మునిపల్లి సాయరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పొలసాని శ్రీనివాస్, నాయకులు పాశం నర్సింలు, న్యాస రాజేశ్వర్, గాండ్ల లక్ష్మీనర్సయ్య, ఎర్రోళ్ల సాయన్న, చింతల దాసు, మహేందర్‌రెడ్డి, పంచరెడ్డి చరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయండి...
ధర్పల్లి : వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్‌చార్జి మునిపల్లి సాయరెడ్డి కోరారు. ధర్పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గంగాధర్, కోకన్వీనర్ వెంకట్‌రెడ్డి, నల్లవెల్లి సింగిల్ విండో చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు దామనర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కుంటచిన్నగంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు రాత మార్చేందుకే ‘దీక్ష’
భీమ్‌గల్, న్యూస్‌లైన్ : కష్టాల్లో ఉన్న రైతుల తలరాత మార్చేందుకే తమ పార్టీ అధినేత వైఎ స్.జగన్‌మోహన్‌రె డ్డి దీక్ష చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కన్నె సురేందర్ తెలిపారు. శనివారం భీమ్‌గల్‌లో ‘రైతు దీక్ష’ పో స్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతు రా జులా బతికాడన్నారు. ఆయన మరణానంతరం పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు ధరలు పెంచి, కరెంటు కోతలు విధించి, రుణాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రైతులపై ముప్పేట దాడి చేస్తోందని ఆరోపించారు. ఈ దుస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే జగన్‌మోహన్‌రెడ్డి పోరుబాట పట్టారన్నారు. రైతు దీక్షను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల సమస్యలను తమ అధినేత దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గున్నాల నర్సాగౌడ్, పర్స రత్నయ్య, రిగ్గు గంగాధర్, పాలెపు గంగాధర్, సుర్జీల్, రెహ్మాన్, సాగర్, అరవింద్, లింబాద్రి, రామకృష్ణ, రాజేశ్, గంగాధర్ తదితరలు పాల్గొన్నారు. 

ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకే..
శక్కర్‌నగర్, న్యూస్‌లైన్ : రైతు సంక్షేమంపై ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడానికే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వి భాగం జిల్లా నాయకుడు సయ్యద్ ముక్తార్ అహ్మద్ తెలిపారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కోసం చెరుకు రైతులు ఏటా రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. దివంగ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని పేర్కొన్నారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాలన్న తపనతో ఆయన పనిచేశారన్నారు. తండ్రి బాటలో తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారని, రైతుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయన చేపట్టే దీక్షకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.

Share this article :

0 comments: