ఒక్కరోజైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్కరోజైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నారా?

ఒక్కరోజైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నారా?

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించే ప్రయత్నమే ఈ ధర్నా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిని భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థి ఫీజులు చెల్లించలేక, తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దాంతో తన మనసు చలించిపోయిందన్నారు. అప్పుడే తాను ఏడు రోజులు దీక్ష చేసి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. ఈరోజు కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొందన్నారు. అందుకే రాష్ట్రం అంతటా ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. స్కాలర్ షిప్ లు కూడా అందలేదని ఇక్కడకు వచ్చిన తరువాత విద్యార్థులు తనకు చెప్పారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అబద్దం చెప్పారన్నారు.

కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత చదువులు చదివితే పేదరికం పోతుందని ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశించారని చెప్పారు. కులాలు, మతాలు, రాజకీయాలు చదువులకు అడ్డు రాకూడదని ఆ మహానేత పేదలందరికీ వర్తించే విధంగా ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారని గుర్తు చేశారు. 9 ఏళ్ల పాలనలో విద్యార్థులు దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. వారి సమస్యలు 
తెలుసుకోవాలని ఎందుకు అనుకోలేదని అడిగారు. ఒక్కరోజైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు రైతుల కోసమో, పేదల కోసంమో శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేదన్నారు. ప్రభుత్వం పడిపోదని తెలిసే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ని ఇబ్బందులు పెట్టడానికే ఆయన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా పదవి పోతుందని తెలిసినా 17 మంది ఎమ్మెల్యేలు ఆ మహానేతపై ఉన్న అభిమానంతో రైతుల కోసం అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారని గుర్తు చేశారు. వారిలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి కూడా ఒకరని ఆయనని చూపించారు. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.

Share this article :

0 comments: