కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ రోశయ్య చేసిన ప్రసంగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ రోశయ్య చేసిన ప్రసంగం

కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ రోశయ్య చేసిన ప్రసంగం

Written By ysrcongress on Tuesday, January 31, 2012 | 1/31/2012

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ హోదాలో కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ రోశయ్య చేసిన ప్రసంగం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన గవర్నర్ హోదాలో తొలి ప్రసంగం చేశారు. ముళ్లపెరియార్ డ్యామ్ వివాదంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందన్నారు. పథకాల రూపకల్పనలో అందరికీ ఒకే విధానం అనే రీతిలో వ్యవహరిస్తూ, రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేస్తోందని విమర్శించారు.తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులపైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

సీఎం జయలలిత ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే సర్కారు పాలనను, పథకాలను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రసంగం ముఖ్యమంత్రి జయలలితకు సంతోషాన్ని కలిగించినా, కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం అసంతృప్తి కలిగించినట్లు సమాచారం. సాధారణంగా ప్రభుత్వం సిద్ధంచేసిన ప్రసంగ పాఠాన్నే గవర్నర్లు చదువుతారు. అయితే, అప్పుడప్పుడు ప్రసంగ పాఠాల్లో గవర్నర్లు మార్పులు చేయడం మామూలు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రసంగ పాఠాలకు మార్పులు చేయడం సర్వసాధారణం. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడైన రోశయ్య ప్రసంగ పాఠంలో తగిన మార్పులు చేసుకుని ఉండాల్సిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Share this article :

0 comments: