సీబీఐ పేరిట నాటకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ పేరిట నాటకం

సీబీఐ పేరిట నాటకం

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

*వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి ఏవైనా సంస్థలు అనుచిత ప్రయోజనాలు పొంది, జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయా అన్నది హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ దర్యాప్తు చేయాల్సిన మౌలిక అంశం. ఇంతకీ అదేమైనట్టు? దాన్ని వదిలేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎందుకీ ప్రచారాలు?

* క్విడ్‌ప్రో కో (ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఫలితంగా పెట్టుబడులు పెట్టారన్న ప్రచారం) పక్కకుపోయి, సాక్షి వాల్యుయేషన్ సక్రమం కాదంటూ ఎల్లో మీడియా నయా డ్రామా....

* సీబీఐ దర్యాప్తు సకలం తమకు తెలిసే జరుగుతోందన్నట్టుగా ఓ వర్గం మీడియా రాతలు...

* జగన్‌మోహన్ రెడ్డిని రెండో విడత సాక్షిగా పిలుస్తున్నారని... అందుకు రేపో మాపో నోటీసులు ఇవ్వనున్నారని సీబీఐ అధికార ప్రతినిధి మాదిరి ప్రకటనలు....

* మీడియాలో సాక్షిని ద్వేషించే వర్గాల చేతుల్లో విచిత్ర సమాచారాలు....

* డెలాయిట్ ప్రతినిధి నాలుగేళ్ళ తరవాత ఇప్పుడు ఇచ్చారంటున్న వాంగ్మూలానికి నిజానిజాలతో నిమిత్తం లేకుండా ఎనలేని ప్రాధాన్యం....

*జగతిలోకి వచ్చిన పెట్టుబడుల ప్రీమియం రూ.350 ఉండటం కుంభకోణమైతే, రూ.5,28,630 లాభంతో రామోజీ అమ్మిన షేరును ఏమనాలి? ఈమధ్యే ప్రారంభమైన నమస్తే తెలంగాణ పత్రిక షేరు ప్రీమియం రూ.1450. దాన్ని కూడా అధికం... అక్రమం అని చిందులు తొక్కుతారా?

* మీడియా సంస్థల్లో మిస్టరీ పెట్టుబడులకు మారుపేర్లయిన ఈనాడు, చంద్రబాబు తోక పత్రిక తమ నలుపు మరిచి గగ్గోళ్ళు...

* నిలువు లోతు నష్టాలతో మూతపడి చంద్రబాబు హయాంలో తెరుచుకున్న పత్రికలోకి ప్రవ హించినవి ఎవరి క్విడ్ ప్రోకోలు? అందులో ఇన్వెస్టర్లు ఆ తరవాత ఎందుకు గల్లంతయ్యారు?

* రామోజీ సంపాదన, ఆస్తి, భూములు అన్నీ వివాదాస్పదమే అయినా నిత్యం జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలపై అసత్య కథనాలు...

* ‘జగతి పబ్లికేషన్స్‌మీద సెబీ కొరడా’ ఝళిపించే అవకాశం ఉందంటూ... సహారా మోసాన్ని తలదన్నే తన మోసాన్ని మరిచి రామోజీ పత్రిక ఓవరేక్షన్...

* ఒకసారి కాదు... పలుసార్లు ప్రజలు ఛీ కొట్టినా అవే రాతలు...

* ప్రజా క్షేత్రంలో నిలబడే ధైర్యం లేక... గోబెల్స్ ప్రచారాలమీద, దొంగ దెబ్బలమీద మక్కువ పెంచుకున్న పత్రికలు...

* విచారణ సమయంలో సాక్షి పోటీ సంస్థల అక్షర అరాచకాలను, అవి పాఠకులతో ఆడుతున్న పరాచకాలపై సీబీఐ ప్రేక్షక పాత్ర....

* ఎవరి ప్రయోజనాల పరిరక్షణకు ఈ మీడియా డ్రామాలు?
Share this article :

0 comments: