'రిలయన్స్ పెట్టుబడులపై రామోజీ మౌనం వీడాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'రిలయన్స్ పెట్టుబడులపై రామోజీ మౌనం వీడాలి'

'రిలయన్స్ పెట్టుబడులపై రామోజీ మౌనం వీడాలి'

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

 'ఈనాడు'లో రిలయన్స్ పెట్టుబడులపై రామోజీ రావు మౌనం వీడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాశిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. జగతి పబ్లికేషన్స్ పై రామోజీ కాకమ్మ కథనాలను ప్రజలు నమ్మడంలేదన్నారు. దొంగే దొంగ..దొంగ.... అన్నట్లుగా రామోజీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

సాక్షిలో పెట్టుబడులపై తమ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి 50, 60 సార్లు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పది రూపాయల షేర్ ని 350 రూపాయలకు కొనుగోలు చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఈనాడు 100 రూపాయల షేర్ ని 5 లక్షల 28వేల 630 రూపాయలకు ఎలా కొనుగోలు చేశారని ఆమె ప్రశ్నించారు. 19 వందల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న టివి18 ఈనాడు వాటాలను ఎలా కొనుగోలు చేసిందన్నారు. 

ఈనాడు, సాక్షి మధ్య వ్యాపారాత్మకమైన, రాజకీయమైన పోటీ నెలకొందని చెప్పారు. ఆ క్రమంలోనే సాక్షిపై ఈ దాడి జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. దేశంలోనే 8వ అతి పెద్ద పత్రికగా సాక్షి నిలిచిందని ఆమె తెలిపారు. ఈనాడు కథనాలను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని చెప్పారు. 

ఈనాడులో రిలయన్స్ కి సంబంధించిన పెట్టుబడులు మాటేమిటని ఆమె ప్రశ్నించారు. కెజి బేసిన్ లో రిలయన్స్ కు అనేక రాయితీలు ఇచ్చినందునే ఆ సంస్థ ఈనాడులో పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టమవుతోందన్నారు.
Share this article :

0 comments: