ఆ ‘శోధన’ కాజాలదు సాక్ష్యం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ ‘శోధన’ కాజాలదు సాక్ష్యం!

ఆ ‘శోధన’ కాజాలదు సాక్ష్యం!

Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012

-విశ్లేషణ
ఎ.చంద్రశేఖర్, హైకోర్టు న్యాయవాది

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేసు ల వ్యవ హారంలో కేంద్ర పరిశో దక సంస్థ (సీబీఐ) వ్యవహరి స్తున్న తీరుపై ఇప్పటికే ఆరోపణ లు వస్తుండగా, తాజాగా విజ యసాయిరెడ్డికి సత్యశోధన పరీక్ష జరపడానికి అనుమతిం చమంటూ ఆ సంస్థ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అసలు సత్యశోధన పరీక్ష ఎవరిపై చేయొచ్చు? ఎవరు చేయాలి? అందుకు ఎవరికి ఎలాంటి హక్కులుంటాయి? ఈ విషయంలో సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ సంగతి సీబీఐకి తెలియదనుకోలేం. ఎందుకంటే అది దేశంలోనే ప్రధానమైన దర్యాప్తు సంస్థ. దాని ఛత్ర ఛాయలో హేమా హేమీలైన న్యాయ నిపుణులు ఉంటారు. అయినా ఇలా పిటిషన్ దాఖలు చేయడంలోని అంతరార్ధం ఏమిటో సీబీఐయే చెప్పాలి. దర్యాప్తు పేరుతో కేవలం ఒక వైపే చూస్తూ రెండోవైపు చూడ నిరాకరిస్తున్నారన్న అపప్రథను ఎదుర్కొంటున్న సీబీఐ తాజాగా తీసుకున్న చర్య ఆ సంస్థ విశ్వసనీయతను పెంచదు. అసలు సుప్రీంకోర్టు ఇలాంటి పరీక్షల విషయంలో ఏం చెప్పిందో ఒక్కసారి చూద్దాం.

నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ బలవంతపెట్టడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23కు విరుద్ధం. ‘మౌనం గా ఉండే హక్కు’ (right to be silent) రాజ్యాంగం కల్పిం చిన హక్కు. తనను నేరస్తుడిగా నిరూపించే స్వీయ విఘా త సమాచారాన్ని వెల్లడించకుండా మౌనాన్ని పాటించే హక్కు రాజ్యాంగం నిందితులకు కల్పించింది. ప్రతి నిం దితుడూ స్వేచ్ఛాయుతంగా, సక్రమంగా, సమానంగా న్యాయాన్ని పొందే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తుంది. 

1978 మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఈ హక్కును క్రోడీకరిస్తూ తీర్పు చెప్పింది. 
మనదేశంలో నేర పరిశోధన పేరుతో నిందితులపై నార్కో అనాలిసిస్, పాలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ లాంటి పరీక్షలను 2000 సంవత్సరం తర్వాత విస్తృతంగానే చేశారు. ఆ పరీక్షల శాస్త్రీయత, చట్టబద్ధతలపై ఒకవైపు విస్తృతంగా చర్చ జరుగుతుండగానే ఇవి కొనసాగాయి. ఫోరెన్సిక్ సైన్స్‌లో అపార అనుభవమున్న తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగం మాజీ డెరైక్టర్ డాక్టర్ పి. చంద్ర శేఖరన్ ఈ పరీక్షలు ఎంతో అశాస్త్రీయమైనవేకాక, నింది తుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో సమానమని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. నార్కో పరీక్ష పేరుతో ఒక వ్యక్తికి ఇలా మత్తు పదార్ధాన్ని ఎక్కించాక దర్యాప్తు అధికారి తనకు నచ్చినట్టుగా అతనితో చెప్పించగలుగుతాడని ‘రేప్ ఆఫ్ మైండ్’ పుస్తకంలో వైద్యుడు జాన్ మెర్లూ అన్నారు. ఈ విధానంలో అమాయకులను ఇరికించడానికి కూడా వీలుంటుందని మానవహక్కుల ఉద్యమకారులు చెబుతూ వచ్చారు.

ఒక వ్యక్తిని ప్రలోభపెట్టి, మత్తులోకి పంపి, హింసలకు గురిచేసి నిందితుడినుంచి తనకు వ్యతిరేకంగా తానే సమా చారం ఇచ్చేలా చేసే అధికారం పరిశోధనా సంస్థలకు లేదు. ఇలా చేయడం నిందితుడికి రాజ్యాంగంలోని ఆర్టి కల్ 20(3) ద్వారా సంక్రమించిన ‘మౌనంగా ఉండే హక్కు’కు భంగకరం. 

నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, పాలీగ్రాఫ్ పరీక్షలను నిందితులపై జరపడాన్ని సవాల్‌చేస్తూ దేశవ్యా ప్తంగా వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను సమీ క్షిస్తూ సుప్రీంకోర్టు సెల్వీ వర్సెస్ కర్ణాటక కేసులో మే 2010లో అత్యంత ముఖ్యమైన తీర్పును వెలువరించింది. నిందితుడిని అతని మనోభీష్టానికి విరుద్ధంగా ఈ పరీక్ష లకు గురిచేయడం రాజ్యాంగం కల్పించిన హక్కుకు భంగ కరమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ప్రకటించింది. నేర నిరూపణకు సంబంధిం చిన సమాచారాన్ని సమర్థంగా సేకరించి నేరాన్ని నిరూపించే బాధ్యత నేర పరిశోధనా సంస్థదే. సమాచార సేకరణ పేరుతో నింద ఎదుర్కొంటున్న వ్యక్తిపై థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, నార్కో అనాలిసిస్ పరీక్షల్లాంటివి నిర్వహించడం సమాచారాన్ని రాబట్టి సదరు వ్యక్తికి వ్యతి రేకంగా వాటిని వినియోగించడం చెల్లదు. ఇలా చేయడం ‘నిందితుడిని తనకు వ్యతిరేకంగా తననే సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయడం’గా భావించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ఇందుకు అనుమతించదు. అలాగే, భారత నేర శిక్షాస్మృతి కూడా ఇందుకు అనుమతించదు. 

నిందితుడి నుంచి పోలీస్ అధికారి బలవంతంగా తీసుకున్న వాంగ్మూలాన్ని భారత న్యాయస్థానాలు సాక్ష్యంగా పరిగణించవు. భారత సాక్ష్యాధారాల చట్టంలోని నిబంధనలు అందుకు అనుమతించవు. పోలీసు అధికారుల ముందు, సీబీఐ లాంటి నేరపరిశోధనా సంస్థల ముందు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయ స్థానాలు సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకున్న పక్షంలో పౌరులకు న్యాయం జరగదని, నేర పరిశోధనా సంస్థలు ఈ హక్కును దుర్వినియోగం చేస్తాయన్న ఉద్దేశంతోనే రాజ్యాంగం, చట్టం వీటిని అనుమతించలేదు. నార్కో అనాలిసిస్, పాలీగ్రఫీ, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు నిర్వహించి స్వీకరించిన సమాచారం కూడా ఇటు వంటిదేనని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అప్పటి చీఫ్ జస్టిస్ కె.జి. బాలకృష్టన్, జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్, జస్టిస్ ఎం.పాంచాల్‌లతో కూడిన విస్తృత ధర్మాసనం వివిధ హక్కులను, అంశాలను విస్తృతంగా పరిశీలించి అన్ని పక్షాల వాదనలనూ సుదీర్ఘంగా విన్న తర్వాత ఈ తీర్పు చెప్పింది. ఈ తరహా పరీక్షలు మానవ హక్కుల ఉల్లంఘన, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని బ్రిటన్, అమెరికా, కెనడా న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చూస్తే విజయసాయిరెడ్డిపై నార్కో అనాలిసిస్ పరీక్షలు జరపడానికి అనుమతి కోరడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3)కు విరుద్ధం.

నిందితులపై వైద్య పరీక్షలు జరపడానికి భారత క్రిమి నల్ ప్రొసీజర్ కోడ్‌లోని కొన్ని నిబంధనలు అనుమతి స్తాయి. అయితే, ఈ నిబంధనలను ఆసరా చేసుకొని నార్కో అనాలిసిస్ పరీక్షలను నిందితులపై ప్రయోగించ డం చెల్లదని సుప్రీంకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది. మత్తుకల్పించే పదార్ధాలను వ్యక్తిలో ప్రవేశపెట్టి అతని అభీష్టానికి విరుద్ధంగా నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించడం ‘వ్యక్తి మానసిక స్వేచ్ఛకు భంగం కల్పించ డమే’నని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంచేసింది. అంత ర్జాతీయ మానవహక్కుల రక్షణ కోణంలో ఇటువంటి చర్య ను హింసాత్మక, అమానవీయ చర్యగా పరిగణించాల్సి ఉం టుంది. నేరాల సంఖ్య పెరిగిపోతోందన్న సాకుతో పౌరు లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే అధికా రం నేరపరిశోధనా సంస్థలకు, ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగ హక్కులను, చట్ట నిబంధనలను అంతర్జాతీయ మానవహక్కుల పరిరక్షణ ఒడంబడికలను పరిగణనలోకి తీసుకుంటే ఏ వ్యక్తినీ, నిందితుడిని అతని అభీష్టానికి విరు ద్ధంగా నార్కో అనాలిసిస్, పాలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలకు గురిచేయడం చెల్లదు. ఒక వ్యక్తిపై బలవంతంగా ఈ పరీక్షలను నిర్వహించడం అతని వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. 

అయితే, ఎవరైనా నిందితుడు ఇష్టపూర్వకంగా మాన సిక సంసిద్ధతతో అంగీకరిస్తే సదరు వ్యక్తిపై ఈ పరీక్షలు నిర్వహించవచ్చు. అలా వ్యక్తి మనోభీష్టం మేరకు జరిపిన పరీక్షల్లో సేకరించిన సమాచారాన్ని భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 27 నిబంధనల మేరకు మాత్రమే సాక్ష్యం గా పరిగణించవచ్చు. స్వచ్ఛందంగా నార్కో అనాలిసిస్ పరీక్షలను తనపై జరపడానికి అనుమతించిన వ్యక్తిపై నేర పరిశోధనా సంస్థ పరీక్షలు నిర్వహిస్తే ఆ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ రూపొందించిన మార్గ దర్శక సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు గురికావడానికి అంగీకరించిన వ్యక్తి తన అంగీకారాన్ని మేజిస్ట్రేట్ ఎదుట తన న్యాయవాది సమక్షంలో అంగీకరిం చాల్సి ఉంటుంది. పోలీసులు నిందితుడిని భయపెట్టి, ప్రలోభపెట్టి ఈ పరీక్షలకు పరోక్షంగా, బలవంతంగా అంగీకరించేలా ఒప్పించకుండా ఈ జాగ్రత్తలు అవసర మని భావించారు. ఈ పరీక్షలు కూడా న్యాయవాది సమక్షంలో మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. 

పరీక్షలకు అంగీకరించని వ్యక్తిపై బలవంతంగా పరీ క్షలు జరిపే అధికారం సీబీఐకి, పోలీసులకు లేదు. ఈ పరీ క్షలకు లోనుకావాల్సిందిగా నిందితుడిని ఆదేశించే అధి కారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టులకు కూడా లభించదు. సీబీఐ ఎంత ప్రత్యేకమైన, కీలకమైన దర్యాప్తు సంస్థ అయినా ఆ సంస్థ కూడా రాజ్యాంగ నిబంధనలకు, చట్ట నిబంధనలకు న్యాయస్థానాల తీర్పులకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తిపట్ల ఒక్కో విధంగా సీబీఐ వ్యవహరించడం సమాన హక్కుకు భం గకరం. ఇది పక్షపాతపూరిత చర్యగా భావించాల్సి ఉం టుంది. చట్టం దృష్టిలో అందరూ సమానం అన్న మౌలిక సూత్రాన్ని ఇది ఉల్లంఘిస్తుంది. కాబట్టి సమానత్వం ప్రాతిపదికగా ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థ మసలుకోవాల్సి ఉంటుంది. ఇది నిర్వివాదాంశం.


అ-శాస్త్రీయ అనాలిసిస్

నార్కో అనాలిసిస్ పరీక్షలు పూర్తిగా శాస్త్రీయమైనవని, ఈ పరీక్షలకులోనైన వ్యక్తి నేర పరిశోధనకు అవస రమైన విషయాలను మాత్రమే వెల్లడిస్తాడని భావించ లేమని అమెరికన్ కోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. దీంతో దర్యాప్తు అధికారి నేర పరిశోధనలో తనకు ఉపయోగపడే విధంగా ప్రశ్నలను రూపొందిం చుకుని ఈ పరీక్షలకు గురవుతున్న వ్యక్తి నుంచి అవును... కాదు అన్న సమాధానాలను మాత్రమే రాబట్టే అవకాశం ఉందని దీనివల్ల పరీక్షకు గురైన నిందితుడికి సక్రమమైన న్యాయం లభించదని ఆ కోర్టు ప్రకటించింది. టౌన్సెండ్ వర్సెస్ సేన్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు సత్యశోధన పరీక్షలను ఆమోదించలేదు. ఈ పరీక్షల ద్వారా సేకరిం చిన సమాచారం చెల్లదని, దాన్ని సాక్ష్యంగా పరిగణించ లేమని కోర్టు స్పష్టం చేసింది.
http://www.indianexpress.com/news/forcible-narco-test-illegal-as-bad-as-tortu/615797/


http://www.dnaindia.com/india/report_sc-verdict-to-stop-misuse-of-narco-test-by-police-welcomed-by-legal-experts_1379457





Share this article :

0 comments: