కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కోసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కోసం

కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కోసం

Written By ysrcongress on Thursday, January 19, 2012 | 1/19/2012

కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం జోరుగా కొనసాగుతుందని పార్టీ ఎన్నారై విభాగ కన్వీనర్ మేడపాటి వెంకట్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికంగా ఉండే తెలుగు వారు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. సభ్యత్వం తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నందున, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కువైట్‌లోని మాలియా ప్రాంతంలో తేజేంధ్ర బకాళ వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కోరే వారు పాస్‌పోర్టు నెంబర్‌తో పాటు ఒక స్టాంపు సైజు ఫోటోను అందిచాలని సూచించారు. మరింత సమాచారం కోసం బి.హెచ్. ఇలియాస్ స్వయంగా లేదా ఫోన్: 99590800, 97698690లను సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
Share this article :

0 comments: