రాష్ట్రంలో పది నెలల నుంచి వ్యవసాయ మంత్రి లేని పరిస్థితి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో పది నెలల నుంచి వ్యవసాయ మంత్రి లేని పరిస్థితి

రాష్ట్రంలో పది నెలల నుంచి వ్యవసాయ మంత్రి లేని పరిస్థితి

Written By ysrcongress on Sunday, January 8, 2012 | 1/08/2012

రాష్ట్రంలో పది నెలల నుంచి వ్యవసాయ మంత్రి లేని పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తెలిపారు. మండెపూడి అన్నపూర్ణ కాలనీలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది నెలల నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి విసిని నియమించకపోవడం సిగ్గుచేటన్నారు.

నాసికరం విత్తనాలతో మిర్చి దిగుబడి బాగా తగ్గిందన్నారు. ఎకరానికి దిగుబడి 15 క్వింటళ్లకు పడిపోయిందని చెప్పారు. 9,500 రూపాయలు ఉన్న మిర్చి ధర 5వేల రూపాయలకు పడిపోయిందన్నారు.



 అమరావతి మండలం మండేపూడిలో నామాల నాగరాజు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పరామర్శించారు. వ్యవసాయ కూలీ అయిన నాగరాజుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎనలేని అభిమానం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందాడు. హెలీకాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ దుర్మరణం చెందారని తెలిసి తట్టుకోలేకపోయాడు. తల్లడిల్లిపోయాడు. ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ ని చూడగానే నాగరాజు తల్లి నాగరత్నమ్మకు దు:ఖం ఆగలేదు. చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకుని కోల్పోయిన వ్యవసాయ కూలీలైన నాగరాజు తల్లిదండ్రులు నాగరత్నమ్మ, రామకోటిలకు తాను అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: