జగన్ దీక్షను అడ్డుకోవడం అప్రజాస్వామికం: సీపీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ దీక్షను అడ్డుకోవడం అప్రజాస్వామికం: సీపీఐ

జగన్ దీక్షను అడ్డుకోవడం అప్రజాస్వామికం: సీపీఐ

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు సహజం. విభేదాలుండబట్టే ఇన్ని పార్టీలున్నాయి. నేతలను అడ్డుకోవాలని పార్టీలు పిలుపివ్వడం తగదు. దీన్ని ఖండిస్తున్నాం. నిన్న చంద్రబాబు వ్యవహారంలోనైనా రేపు జగన్ దీక్ష విషయంలోనైనా మాదిదే మాట. బాబుకు కల్పించినట్టే జగన్‌కూ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని సీపీఐ స్పష్టం చేసింది. ఆదివారం ముగిసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ, సమితి సమావేశాల తీర్మానాలను విడుదల చేస్తూ పార్టీ నేత నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడారు.

 వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో చేపట్టనున్న మూడు రోజుల రైతు దీక్షను స్వాగతిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ప్రకటిం చారు. తెలంగాణలో జరిగే ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను పోటీకి నిలపమని ప్రకటించడం అభినందనీయమన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణకు అడ్డుకాదని ప్లీనరీ సమావేశంలో చెప్పిన జగన్, అదేవిషయాన్ని కేంద్రప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపితే తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. రాష్ట్రం లోని అన్ని పార్టీల అధినేతలు ఇదేవిధంగా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాయాలని, లేనిపక్షంలో తెలంగాణలో ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామన్నారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులందర్నీ ఏకం చేసేందుకు వచ్చేవారంలో అన్నిపార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామనీ, ఫిబ్రవరి 4న కరీంనగర్‌లో తెలంగాణలోని 119 మంది ప్రజాప్రతినిధులతో భారీ బహిరంగసభ నునిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ వైస్ చైర్మన్ రమేష్ యాదవ్, నాయకులు వెంకట్, అరవింద్, భాస్కర్ పాల్గొన్నారు. 
Share this article :

0 comments: